అమ్మ బతికుండగా పట్టించుకోలేదు.. కానీ: జాన్వీ కపూర్ | Janhvi Kapoor reveals she became more religious after mother death | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అమ్మ చనిపోయాకే వాటిని ‍నమ్ముతున్నా.. తిరుమలకు ఎందుకు వెళ్తానంటే?

Published Mon, May 27 2024 2:41 PM | Last Updated on Mon, May 27 2024 2:52 PM

Janhvi Kapoor reveals she became more religious after mother death

దేవర భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రాజ్‌ కుమార్‌ రావుకు జంటగా కనిపించనుంది. క్రికెట్‌ నేపథ్యంలో అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఇంట‍ర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి మరణం తర్వాత నా లైఫ్‌ స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా తిరుమలకు తరచుగా వెళ్లడానికి గల కారణాన్ని వివరించారు.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'అమ్మకు దైవ భక్తి ఎక్కువ. కొన్ని విషయాలను బాగా నమ్మేది. స్పెషల్ డేస్‌లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అని చెప్పేది. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేది. అంతే కాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దనేది. కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని లైట్‌ తీసుకున్నా. కానీ అమ్మ దూరమయ్యాక నమ్మడం మొదలుపెట్టా. ఇప్పుడు నేనే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని' తెలిపింది.

జాన్వీ కపూర్‌ తిరుమలరు వెల్లడంపై మాట్లాడుతూ..' అమ్మ  తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలచేది . షూటింగ్‌ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటూ ఉండేది. ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచుగా వెళ్తుంటానని' చెప్పుకొచ్చింది. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement