శ్రీదేవి కూతురి ఫొటోలపై దుమారం | Is Jhanvi Kapoor dating Shikhar Pahariya? Or Akshat Rajan? | Sakshi
Sakshi News home page

శ్రీదేవి కూతురి ఫొటోలపై దుమారం

Dec 2 2016 9:06 AM | Updated on Sep 4 2017 9:44 PM

అక్షత్‌ (ఎడమ), శిఖర్‌లతో జాహ‍్నవి

అక్షత్‌ (ఎడమ), శిఖర్‌లతో జాహ‍్నవి

జాహ్నవి కపూర్‌ తన సినిమా అరంగేట్రానికి సంబంధించిన సమాచారం కంటే బాయ్‌ఫ్రెండ్ (బాయ్‌ఫ్రెండ్స్‌?) వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

ప్రఖ్యాత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ పెద్ద కూతురు జాహ్నవి కపూర్‌ తన సినిమా అరంగేట్రానికి సంబంధించిన సమాచారం కంటే బాయ్‌ఫ్రెండ్ (బాయ్‌ఫ్రెండ్స్‌?) వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ అమ్మాయి కౌగిలింతలు, లిప్‌ లాక్‌ దృశ్యాలతో ఉన్న ఫొటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌లో పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్‌ శిఖర్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరో ట్విస్ట్‌ ఏంటంటే జాహ్నవి అక్షత్‌ రాజన్‌ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం దుమారం రేపుతోంది.

అక్షత్‌ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ప‍్రత్యక్షమయ్యాయి. అక్షత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్‌తో డేటింగ్‌ చేస్తుందా అని షాక్‌ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్‌ చేస్తోంది శిఖర్‌తోనా లేక అక్షత్‌తోనా? అని అయోమయంలో పడ్డారు. జాహ్నవి లవర్‌ ఎవరన్నది ఆ అమ్మాయికే తెలియాలి..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement