Janhvi Kapoor Reveals Why She Wary Of Talking About Her Mother Sridevi - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’

Published Tue, Aug 9 2022 11:10 AM | Last Updated on Tue, Aug 9 2022 1:39 PM

Janhvi Kapoor is Wary of Talking About What She Learnt From Her Mother Sridevi - Sakshi

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేశి తనయ జాన్వీ కపూర్‌ తల్లిని తలుచుకుని ఎమోషనలైంది. తాజాగా ఆమె నటించిన గుడ్‌ లక్‌ జెర్రీ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్‌ నేపథ్యంలో జాన్వీ తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా జాన్వీ తల్లితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది.

చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్‌ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’

అమ్మ లేకుండ జీవించడం చాలా కష్టంగా ఉందంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ ఇంటర్య్వూలో తన తల్లికి, తనకు ఉన్న పోలికను గురించి జాన్వీకి ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడేందుకు జాన్వీ కాస్తా బెరుకు చూపించింది. ‘అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు గర్వం అంటున్నారు. అందుకు తన గురించి మాట్లాడాలంటే భయమేస్తుంది. తను గురించి ఏం చెప్పిన నా తన సినిమాలతో నా మూవీస్‌ను పోల్చుతూ ట్రోల్‌ చేస్తున్నారు. ఆమెలా ఉండటం కాదు నటనలో కూడా మీ తల్లి పేరు నిలబెట్టు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు’ అని చెప్పింది.

చదవండి: మళ్లీ గ్రామీణ కథ అనగానే.. భయపడ్డా: కార్తీ

అయితే ‘అదే ఇప్పుడు అమ్మ ఉండుండే ఈ ప్రశ్నకు చాలా సౌకర్యంగా సమాధానం చెప్పేదాన్ని. తనకు నాకు చాలా విషయాల్లో పోలిక ఉన్నా కూడా ఇప్పుడు వాటి గురించి చెప్పలేకపోతున్నా’ అంటూ జాన్వీ వాపోయింది. కాగా జాన్వీని తెరపై చూడాలన్న  తన కోరిక తిరకుండానే శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. జాన్వీ తొలి చిత్రం ‘ధడఖ్‌’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో 2014లో దుబాయ్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడ శ్రీదేవి మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement