పెళ్లికి కంచిపట్టు చీర కట్టుకుంటా | Kanchi pattu Saree will be made for the wedding says jhanvi kapoor | Sakshi
Sakshi News home page

పెళ్లికి కంచిపట్టు చీర కట్టుకుంటా

Published Mon, Oct 8 2018 2:51 AM | Last Updated on Mon, Oct 8 2018 2:51 AM

Kanchi pattu Saree will be made for the wedding says jhanvi kapoor - Sakshi

జాన్వీ కపూర్‌

అబ్బాయి ఇలా ఉండాలి. అలా ఉండాలని కాబోయే భర్త గురించి అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. పెళ్లి ఎలా చేసుకోవాలో కూడా కొంతమంది ఊహించుకుంటారు. మీ పెళ్లి ఎలా జరగాలని మీరు కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నను శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ ముందుంచితే.. పెళ్లికొడుకు లక్షణాలు ఎలా ఉండాలో ప్రస్తుతానికి చెప్పలేదు కానీ ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయంపై మాత్రం మనసు విప్పారు. ‘‘కొన్నేళ్ల  క్రితం ఫ్లోరెన్స్‌ (ఇటలీ)ప్రాంతానికి వెళ్లాను. పెళ్లి చేసుకుంటే అక్కడే చేసుకోవాలి అనేంతలా అక్కడి ప్రదేశాలు నన్ను ఆకట్టుకున్నాయి.

ఇప్పటికీ అదే ఫీలింగ్‌ ఉంది. అలాగే పెళ్లికి బంగారు జరీ ఉన్న కంచిపట్టు చీర కట్టుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు జాన్వీ. మరి.. జాన్వీ చేయి పట్టుకుని ఏడడుగులు వేసే అబ్బాయి ఎవర్నది అందరికీ తెలియాలంటే కాస్త టైమ్‌ పడుతుంది. ఎందుకంటే ఈ బ్యూటీ వయసు జస్ట్‌ 21 మాత్రమే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ధడక్‌’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్‌ మూవీ ‘తక్త్‌’ కోసం రెడీ అవుతున్నారు. అలాగే సౌత్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement