ఓటీటీకి వచ్చేస్తోన్న స్పోర్ట్స్‌ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Jahnvi Kapoor Mr And Mrs Mahi Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Mr And Mrs Mahi OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీకి జాన్వీ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Thu, Jul 25 2024 4:49 PM | Last Updated on Thu, Jul 25 2024 5:29 PM

Jahnvi Kapoor Mr and Mrs Mahi Streaming On This Ott From This Date

దేవరభామ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన స్టోర్ట్స్‌ డ్రామా 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. ఈ చిత్రంలో మహిమ పాత్రలో జాన్వీ మెప్పించింది. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ బ్యానర్‌పై కరణ్‌ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 26 నుంచే స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది.  క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఓటీటీ ప్రియులను అలరించనుంది.  ఈ చిత్రంలో రాజేశ్‌ శర్మ, కుముంద్‌ మిశ్రా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. కాగా.. ప్రస్తుతం జాన్వీకపూర్‌ ఉలజ్ మూవీతో ప్రేక్షకులను అలరించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement