ఓటీటీకి వచ్చేస్తోన్న స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దేవరభామ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన స్టోర్ట్స్ డ్రామా 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. ఈ చిత్రంలో మహిమ పాత్రలో జాన్వీ మెప్పించింది. రాజ్‌కుమార్ రావు హీరోగా నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 26 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ చిత్రంలో రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. కాగా.. ప్రస్తుతం జాన్వీకపూర్ ఉలజ్ మూవీతో ప్రేక్షకులను అలరించనుంది. Their story is the ultimate match 💙 Mr. & Mrs. Mahi are about to hit it straight to your screens, arriving at midnight on Netflix!#MrAndMrsMahiOnNetflix pic.twitter.com/5rvDDtVpA0— Netflix India (@NetflixIndia) July 25, 2024