wedding plans
-
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్ కపుల్
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్‌బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు ) View this post on Instagram A post shared by Durek Verrett (@shamandurek) 2022 జూన్‌లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్‌ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్అని పేర్కొంది. అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్‌తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) . -
త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా!
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ లవ్‌లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే! త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన జంట నెక్స్ట్ ఏంటి? అని ఆలోచిస్తున్నారట. తాజాగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఇది నాకు చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎటువైపు అడుగులు వేయాలన్న పరిస్థితి దగ్గర మేము నిలబడి ఉన్నాం. ఈ క్రమంలో మేము చాలా విషయాలను చర్చించాము. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కలిసి జీవితాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాం. మొదట్లో దీని గురించి జోక్స్ చేసుకునేవాళ్లం కానీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నాం. ఒక బంధంలో ఉన్నప్పుడు చాలా పాజిటివ్‌గా, సురక్షితంగా ఉన్నామనిపించాలి. అర్జున్ నాకు ఆ రెండింటినీ అందించాడు. ఎందుకంటే అతడు నావాడు' అని చెప్పుకొచ్చింది. మొత్తానికి మలైకా త్వరలోనే అర్జున్‌తో ఏడడుగులు నడవనున్నట్లు ఓ హింట్ ఇచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్. చదవండి: నోరా ఫతేహితో డేటింగ్‌పై స్పందించిన కొరియోగ్రాఫర్ అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య -
వచ్చే నెలలో నితిన్ వివాహం
నాగర్ కర్నూల్‌కు చెందిన షాలినితో నితిన్ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమను పెళ్లి పీటలెక్కించేందుకు ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అన్నీ కలిసొస్తే నితిన్ ఈపాటికే ఓ ఇంటివాడయ్యేవాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల అన్ని ప్లాన్లు రద్దయ్యాయి. దీంతో దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పెడింది. అయితే వచ్చే నెలలోనే నితిన్ వివాహానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (కరోనా ఎఫెక్ట్: అభిమానులకు నితిన్ విజ్ఞప్తి ) తొలుత డిసెంబర్లో పెళ్లి జరగనుందని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం జూలైలోనే వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇప్పట్లో కరోనా సమస్య ముగిసే సూచనలు లేకపోవడంతో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి ప్లాన్‌ను విదేశాల నుంచి హైదరాబాద్‌కు మార్చారు. నగర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ వివాహం జరగనుందని టాక్. ఇక ఈ విషయాన్ని నితిన్, షాలినీ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. (అలా షాలినీతో ప్రేమలో పడ్డా : నితిన్) -
ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కాబోయే భార్య మిహీకా బజాజ్‌ల రోకా కార్యక్రమం ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రానాతో సన్నిహతంగా ఉన్న పలు ఫొటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశారు. ఇందులో రానా తన చెవిలో గుసగుసలాడుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇదే నాకు సంతోషాన్నిచ్చేది’ అంటూ 3 హార్ట్ ఎమోజీలతో నవ్వుతూ ఉండే రెండు ఎమోజీలను జత చేసి షేర్ చేశారు. ఇక మిహీకా పోస్టుకు హీరో వెంకటేష్ కూతురు అశ్రిత దగ్గుబాటి ‘‘పట్టలేనంత సంతోషంగా ఉంది. నేను అక్కడ లేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, మీ ఇద్దరికి నా పెద్ద హగ్’’ అంటూ కామెంట్ చేశారు. అంతేగాక బాలీవుడ్ బామ సోనమ్ కపూర్ భర్త అనంద్ అహుజీ కూడా మిహీక-రానాలకు శుభకాంక్షలు తెలిపాడు. (నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన రానా) చదవండి: నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత View this post on Instagram My happy place! 🥰🥰 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 21, 2020 at 12:03am PDT రానాతో ఉన్న మరో ఫొటోను షేర్ చేస్తూ, ‘ఇది ఆరంభం...ఇక ఎప్పటికీ’ అనే క్యాప్షన్‌కు హార్ట్ ఎమోజీలను జత చేయగా, గతవారం మిహీకా తన ప్రేమను అంగికరించిందని ఇప్పుడు తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామంటూ రానా తన ప్రేమను సోషల్ మీడియాలో అధికారింగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో మంగళవారం వీరిద్దరి నిశ్చితార్థం, వివాహా వేడులకు ముహుర్తం ఖారారు చేసేందుకు బుధవారం రామనాయుడు స్టూడియోలో రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో వీరిద్దరికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. (నిశ్చితార్థం కాదు.. రోకా) -
నిశ్చితార్థం కాదు.. రోకా
ప్రేయసి మిహికాతో కలసి దిగిన కలర్‌ఫుల్ ఫొటోలను గురువారం షేర్ చేశారు రానా. ఆ ఫొటోలు చూసినవాళ్లు నిశ్చితార్థం జరిగిందని ఊహించుకున్నారు. కానీ, జరిగినది ‘రోకా ఫంక్షన్’. అంటే.. ఇరు కుటుంబ సభ్యులు కలుసుకుని పెళ్లి విశేషాలు మాట్లాడుకుంటారు. స్వీట్లు, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఉత్తరాదిన (పంజాబీలో ముఖ్యంగా) ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ రోకా వేడుక సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రానా. డిసెంబర్లో రానా–మిహికా బజాజ్‌ల వివాహం జరగనుందని సమాచారం. -
అలా పెళ్లి చేసుకోవాలని ఉంది
పెళ్లి విషయాల్లో అమ్మాయిలకు ఎన్నో కలలుంటాయి. ‘రెక్కల గుర్రం మీద రాకుమారుడు రావాలి, ఊరంతా చెప్పుకునేలా పెళ్లి జరగాలి’ అని ఎవరి కలలు వాళ్లవి. మరి మీ డ్రీమ్ వెడ్డింగ్ ఏంటి? అనే ప్రశ్నను అదితీరావ్ హైదరీని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘‘నా పెళ్లిలో నేను అచ్చు రాజారవివర్మ బొమ్మను తలపించేలా ఉండాలి. మా అమ్మగారి వివాహం జరిగినప్పుడు ఆమె మేకప్ లేకుండా సింపుల్‌గా ఉన్నారు. నేనూ అలానే ఉంటాను. నా పెళ్లి బీచ్ ఒడ్డున ఉండే రాజుల నాటి భారీ కోటలో జరగాలి. పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక చెప్పులు తీసేసి బీచ్‌లో పరిగెడతాను. రాత్రంతా డ్యాన్స్ చేస్తూనే ఉంటాను. నేను చెప్పేవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకపోవచ్చు. కానీ నేనంతే. నా ఆలోచనలన్నీ ఒకేలా ఉండవు’’ అన్నారు. ఇదిలా ఉంటే అదితీరావ్కి ఆల్రెడీ పెళ్లయింది. కానీ భర్త నుంచి విడిపోయారామె. -
చేదు అనుభవాలు ఎదురయ్యాయి
గతేడాది ప్రియాంకా చోప్రా, సోనమ్ కపూర్, దీపికా పదుకోన్‌లతో పాటు మరికొందరు బాలీవుడ్ కథానాయికలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి..‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని 31 ఏళ్ల కంగనా రనౌత్‌ని అడిగితే–‘‘ప్రేమ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. నా రొమాంటిక్ యాంగిల్ నాకు ఉంది. ప్రేమలో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ తొందరగానే జీవితంలో ముందుకు వెళ్లగలిగాను. ప్రేమ పట్ల నా ఆలోచనా ధోరణి కూడా మారింది. మంచి కుటుంబం కావాలి. లైఫ్‌లో నన్ను ఇన్స్పైర్ చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు కంగనా. ప్రస్తుతం ‘పంగా’ సినిమాతో బిజీగా ఉన్నారు కంగనా రనౌత్. -
నటి పూర్ణ పెళ్లికి అడ్డంకులు
తన పెళ్లికి పలు అంశాలు అడ్డంకులుగా మారుతున్నాయని వాపోతోంది నటి పూర్ణ. మాతృకం మలయాళం అయినా కోలీవుడ్, టాలీవుడ్ అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేస్తున్న ఈ బహు భాషానటి మొదట్లో మోడలింగ్, బుల్లితెర యాంకరింగ్ చేసి 2004లో నటనకు శ్రీకారం చుట్టింది. కోలీవుడ్‌కు 2008లో మునిరయాండి విలంగియల్ మూండ్రామాండు చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తాజాగా నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతోంది. పూర్ణ మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉంటే స్టేజీ పోగ్రామ్స్ ఇవ్వడానికి ఇష్ట పడుతుంది. ఆ అమ్మడికి ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడన్నదే.కారణం ఈ అమ్మడికన్నా వెనుక వచ్చిన చాలా మంది నటీమణులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో సంసారం చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి నటి పూర్ణ ఇటీవల ఒక టీవీ.ఛానల్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ తన పెళ్లి గురించి తన తల్లి మాట్లాడని రోజు లేదని అంది. తనకూ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందనీ, అందుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పింది. అందులో ముఖ్యంగా జాతి సమస్య అని పేర్కొంది. అది మీరి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటున్న వారూ వివాహానంతరం నేను నటనను, నాట్యాన్ని మానుకోవాలని షరతులు విధిస్తున్నారని చెప్పింది. ఇక ప్రేమ వివాహం చేసుకుందామన్నా, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావని గ్యారెంటీ ఉంటుందా? అని ప్రశ్నించింది. అందుకే తన వివాహం వాయిదా పడుతోంది అని చెప్పింది. కాగా జాతి జాడ్యం లేని, ఎలాంటి షరతులు విధించని వ్యక్తి తారస పడితే వివాహం చేసుకోవడానికి తాను రెడీ అని అంటోంది. ఇస్లామ్ మతానికి చెందిన పూర్ణ అసలు పేరు షమ్నాఖాసీం అన్న విషయం చాలా మందికి తెలిసుంటుంది. మరి ఈ అమ్మడిని అర్థం చేసుకుని ఆమె మనసును గెలుసుకునే వ్యక్తి ఎక్కడున్నాడో? ఆ కల్యాణ ఘడియలు ఎప్పుడు వస్తాయో? పూర్ణ ఇంట బాజా భజంత్రీలు మ్రోగేదెప్పుడో చూద్దాం. ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగులో సువర్ణసుందరి, తమిళంలో అడంగ మను, ఇవనుక్కు ఎంగయో మచ్చ ఇరుక్కు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. -
అంతా అమ్మ ఇష్టం
మీ పెళ్లెప్పుడు అని హీరోయిన్స్‌ని అడిగిన వెంటనే తరచుగా వినిపించే సమాధానాలు ‘నచ్చినవాడు దొరకలేదు, అప్పుడే పెళ్లేంటి? కానీ ‘అవును’ ఫేమ్ పూర్ణ మాత్రం అంతా అమ్మ ఇష్టం అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ గురించి పూర్ణ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు పెళ్లి అనే ప్రశ్న ఎక్కువగా మా ఇంట్లో మాత్రమే వినిపించేది ఇప్పుడు సినిమా సెట్స్, షోస్‌లో ఎక్కడికి వెళ్లినా సరే పెళ్లి ఎప్పుడు అనే అడుగుతున్నారు. ఇంట్లో అమ్మ నా పెళ్లి గురించే మాట్లాడుతుంటుంది. పెళ్లి అనేది మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకుంటే అయ్యేది. అలాగే పెళ్లి చేసుకుందాం అని వచ్చే వాళ్లందరూ యాక్టింగ్ మానేయాలి, డ్యాన్స్ వదిలేయాలి అంటూ డిమాండ్స్ పెట్టేవాళ్లే. పెళ్లి అనేది కేవలం త్యాగాలమీదే జరక్కూడదు అని నా అభిప్రాయం. అదికూడా కేవలం పెళ్లికొడుకుల తరఫు నుంచి మాత్రమే. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా, మా సంప్రాదాయలు తెలియని వారైతే మా అమ్మ అప్సెట్ అవుతుంది. అలా చేయడం ఇష్టం లేదు. అమ్మ సంతోషమే నా సంతోషం. అందుకే నా పెళ్లికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మా ఫ్యామిలీకే వదిలేశాను’’ అని చెప్పారు. -
పెళ్లికి కంచిపట్టు చీర కట్టుకుంటా
అబ్బాయి ఇలా ఉండాలి. అలా ఉండాలని కాబోయే భర్త గురించి అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. పెళ్లి ఎలా చేసుకోవాలో కూడా కొంతమంది ఊహించుకుంటారు. మీ పెళ్లి ఎలా జరగాలని మీరు కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నను శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ముందుంచితే.. పెళ్లికొడుకు లక్షణాలు ఎలా ఉండాలో ప్రస్తుతానికి చెప్పలేదు కానీ ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయంపై మాత్రం మనసు విప్పారు. ‘‘కొన్నేళ్ల క్రితం ఫ్లోరెన్స్ (ఇటలీ)ప్రాంతానికి వెళ్లాను. పెళ్లి చేసుకుంటే అక్కడే చేసుకోవాలి అనేంతలా అక్కడి ప్రదేశాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంది. అలాగే పెళ్లికి బంగారు జరీ ఉన్న కంచిపట్టు చీర కట్టుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు జాన్వీ. మరి.. జాన్వీ చేయి పట్టుకుని ఏడడుగులు వేసే అబ్బాయి ఎవర్నది అందరికీ తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే ఈ బ్యూటీ వయసు జస్ట్ 21 మాత్రమే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ధడక్’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘తక్త్’ కోసం రెడీ అవుతున్నారు. అలాగే సౌత్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి కోసమేనా?
ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా బాలీవుడ్లో ‘భారత్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆమె అభిమానులు ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని తెలిసి రెట్టింపు ఆనందపడుతున్నారు. ప్రియాంక సినిమా చేయకపోతే హ్యాపీ ఫీలవ్వాల్సిన అవసరం ఏంటీ? అంటే.. ఓ స్పెషల్ రీజన్ ఉంది. ‘భారత్’ సినిమా డేట్స్‌ను క్యాన్సిల్ చేసిన ప్రియాంకా, పెళ్లికి డేట్స్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘భారత్’. ఈ సినిమా నుంచి సడన్‌గా ప్రియాంక తప్పుకున్నారు. ఈ విషయంపై దర్శకుడు జాఫర్ క్లారిటీ ఇస్తూ– ‘‘అవును..‘భారత్’ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించడం లేదు. ఈ నిర్ణయాన్ని ఆమె నిక్ ఆఫ్ టైమ్ (చివరి నిమిషం) లో చెప్పారు. హ్యాపీ లైఫ్‌ని ప్రియాంక గడపాలని ‘భారత్’ టీమ్ కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ పేరు వచ్చేట్లు ‘నిక్ ఆఫ్ టైమ్’ అని దర్శకుడు జాఫర్ ప్రస్తావించడంతో.. నిక్‌తో ప్రియాంక పెళ్లికి రెడీ అయిట్లు ఆయన హింటు ఇచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
'కత్రినా పెళ్లి ఇప్పట్లో లేదు'
బాలీవుడ్ హాట్ జంట కత్రినా కైఫ్.. రణబీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారని, ముగ్గురు పిల్లలను కంటారని ఇటీవలి కాలంలో విపరీతంగా మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. అయితే.. కత్రినా మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోవట్లేదని ఆమె ప్రతినిధి స్పష్టం చేశారు. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. వచ్చే ఏడాది కత్రినా - రణబీర్‌ల పెళ్లి ఉందని ఇప్పటికే జాతీయ మీడియాలో పలు రకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నెలాఖరులోనే వాళ్ల నిశ్చితార్థం కూడా జరుగుతుందన్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'ఫితూర్', అనురాగ్ బసు తీస్తున్న 'జగ్గా జాసూస్' చిత్రాల్లో కత్రినా నటిస్తోంది. ప్రస్తుతం తొలిసారిగా కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొనేందుకు ఫ్రెంచి రివెరాకు వెళ్లింది.