అంతా అమ్మ ఇష్టం | Actress Poorna Says about her Marriage | Sakshi
Sakshi News home page

అంతా అమ్మ ఇష్టం

Published Sat, Oct 13 2018 6:10 AM | Last Updated on Sat, Oct 13 2018 6:10 AM

Actress Poorna Says about her Marriage - Sakshi

మీ పెళ్లెప్పుడు అని హీరోయిన్స్‌ని అడిగిన వెంటనే తరచుగా వినిపించే సమాధానాలు ‘నచ్చినవాడు దొరకలేదు, అప్పుడే పెళ్లేంటి? కానీ ‘అవును’ ఫేమ్‌ పూర్ణ మాత్రం అంతా అమ్మ ఇష్టం అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ప్లాన్స్‌ గురించి పూర్ణ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు పెళ్లి అనే ప్రశ్న ఎక్కువగా మా ఇంట్లో మాత్రమే వినిపించేది ఇప్పుడు సినిమా సెట్స్, షోస్‌లో ఎక్కడికి వెళ్లినా సరే పెళ్లి ఎప్పుడు అనే అడుగుతున్నారు.  ఇంట్లో అమ్మ నా పెళ్లి గురించే మాట్లాడుతుంటుంది.

పెళ్లి అనేది మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకుంటే అయ్యేది. అలాగే పెళ్లి చేసుకుందాం అని వచ్చే వాళ్లందరూ యాక్టింగ్‌ మానేయాలి, డ్యాన్స్‌ వదిలేయాలి అంటూ డిమాండ్స్‌ పెట్టేవాళ్లే. పెళ్లి అనేది కేవలం త్యాగాలమీదే జరక్కూడదు అని నా అభిప్రాయం. అదికూడా కేవలం పెళ్లికొడుకుల తరఫు నుంచి మాత్రమే. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా, మా సంప్రాదాయలు తెలియని వారైతే మా అమ్మ అప్‌సెట్‌ అవుతుంది. అలా చేయడం ఇష్టం లేదు. అమ్మ సంతోషమే నా సంతోషం. అందుకే నా పెళ్లికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మా ఫ్యామిలీకే వదిలేశాను’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement