బ్యాక్‌డోర్‌ ఎంట్రీ | Backdoor movie press meet | Sakshi
Sakshi News home page

బ్యాక్‌డోర్‌ ఎంట్రీ

Published Thu, Nov 12 2020 12:45 AM | Last Updated on Thu, Nov 12 2020 12:45 AM

Backdoor movie press meet - Sakshi

పూర్ణ

పూర్ణ ప్రధాన పాత్రలో యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌ డోర్‌’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం పూర్ణ కెరీర్‌లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది’’ అన్నారు బి.శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు రావడం ఖాయం’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఓంకార్‌ యూనిట్, సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్‌ నారోజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రేఖ, సహ నిర్మాత: ఊట శ్రీను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement