కల నెరవేరుతుందా? | Dream Boy Movie Press Meet | Sakshi
Sakshi News home page

కల నెరవేరుతుందా?

Published Mon, May 27 2019 2:37 AM | Last Updated on Mon, May 27 2019 2:37 AM

Dream Boy Movie Press Meet - Sakshi

తేజ, హరిణి రెడ్డి

తేజ హీరోగా, హరిణి రెడ్డి హీరోయిన్‌గా రాజేష్‌ కనపర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డ్రీమ్‌ బాయ్‌’. మాస్టర్‌ ఎన్‌.టి. రామ్‌చరణ్‌ సమర్పణలో 7 వండర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్‌ కనపర్తి మాట్లాడుతూ– ‘‘మంచి కథాబలం ఉన్న చిత్రమిది. వైవిధ్యమైన కథతో రూపొందుతున్న మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

‘‘ఇది నా తొలి సినిమా. కథాబలం ఉన్న చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు, సూర్య, హేమ, ధనరాజ్‌ లాంటి సీనియర్‌ నటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తేజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. త్వరలో వైజాగ్‌లో చిత్రీకరించనున్నాం’’ అని సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ అన్నారు. ‘‘పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు త్వరలో పూర్తి చేసుకొని జూలై నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వీరబాబు తెలిపారు. చమ్మక్‌ చంద్ర, రాకింగ్‌ రాకేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాని–సుభాష్‌ బొంతు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement