హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. యువ నటుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్రలో నటించాడు. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది. పూర్ణ కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూర్ణ పెర్ఫార్మెన్స్, గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అన్నారు కర్రి బాలాజీ. పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్‌తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి, నటిగా నాకు, నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డిగారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను.
Comments
Please login to add a commentAdd a comment