బ్యాక్‌ డోర్‌లో... | Back Door Movie Launch | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ డోర్‌లో...

Published Thu, Oct 15 2020 12:32 AM | Last Updated on Thu, Oct 15 2020 12:32 AM

Back Door Movie Launch - Sakshi

నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. ఇందులో పూర్ణ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఆర్కిడ్‌ ఫిలిం స్టూడియోస్‌ పతాకంపై బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా సహజం అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన బ్యాక్‌ డోర్‌ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసేందుకు కర్రి బాలాజీ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ చేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement