Malaika Arora Opened Up About Her Wedding Plans With Her Long-Time Boyfriend Arjun Kapoor - Sakshi
Sakshi News home page

Malaika Arora: మేమిద్దరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం.. మలైకా అరోరా

Published Thu, May 5 2022 4:24 PM | Last Updated on Thu, May 5 2022 4:52 PM

Malaika Arora Hints Wedding With Arjun Kapoor: We Want a Future Together - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా, హీరో అర్జున్‌ కపూర్‌ లవ్‌లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే! త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన జంట నెక్స్ట్‌ ఏంటి? అని ఆలోచిస్తున్నారట. తాజాగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ..  'మేమిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఇది నాకు చాలా ముఖ్యమైనది. నెక్స్ట్‌ ఏం చేయాలి, ఎటువైపు అడుగులు వేయాలన్న పరిస్థితి దగ్గర మేము నిలబడి ఉన్నాం.

ఈ క్రమంలో మేము చాలా విషయాలను చర్చించాము. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కలిసి జీవితాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాం. మొదట్లో దీని గురించి జోక్స్‌ చేసుకునేవాళ్లం కానీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నాం. ఒక బంధంలో ఉన్నప్పుడు చాలా పాజిటివ్‌గా, సురక్షితంగా ఉన్నామనిపించాలి. అర్జున్‌ నాకు ఆ రెండింటినీ అందించాడు. ఎందుకంటే అతడు నావాడు' అని చెప్పుకొచ్చింది. మొత్తానికి మలైకా త్వరలోనే అర్జున్‌తో ఏడడుగులు నడవనున్నట్లు ఓ హింట్‌ ఇచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: నోరా ఫతేహితో డేటింగ్‌పై స్పందించిన కొరియోగ్రాఫర్‌

అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement