
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్‌ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను)
నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్‌లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్‌బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్‌ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్‌బీఐ కీలక ఆదేశాలు )
2022 జూన్‌లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్‌తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్‌ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్‌అని పేర్కొంది.
అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్‌తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
.
Comments
Please login to add a commentAdd a comment