
నార్వే యువరాణి మార్తా లూయిస్ (52), అమెరికాకు చెందిన డురెక్ వెర్రెట్ (49) వివాహం అట్టహాసంగా జరిగింది. నార్వేలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, కైరుంగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మార్తా తండ్రి, కింగ్ హెరాల్డ్ (87), ఇతర రాజకుటుంబీకులు హాజరయ్యారు.
మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, రియాలిటీ స్టార్లు, టీవీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మార్తాకిది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు 21, 19, 15 ఏళ్ల వయస్సున్న కూతుళ్లున్నారు. వాళ్లు కూడా వేడుకలో పాల్గొన్నారు. తనకు దేవదూతలతో మాట్లాడే శక్తి ఉందని మార్తా; ఆత్మలతో సంభాíÙంచగలనని, వ్యాధులను నయం చేయగలనని వెర్రెట్ చెప్పుకుంటారు. తమ కుటుంబానికి ఆరు తరాలుగా అతీత శక్తులు సక్రమిస్తూ వస్తున్నాయని వెర్రెట్ ప్రకటించుకున్నారు. – ఓస్లో