అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. అతనికి 93, ఆమెకు 67! | 5th Wife Of Media Mogul Rupert Murdoch; Details About Elena Zhukova | Sakshi
Sakshi News home page

అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. అతనికి 93, ఆమెకు 67!

Published Mon, Jun 3 2024 10:52 AM | Last Updated on Mon, Jun 3 2024 11:24 AM

5th Wife Of Media Mogul Rupert Murdoch; Details About Elena Zhukova

ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త,  ప్రముఖ పెట్టుబడాదారుడు మీడియా దిగ్గ‌జం రూపెర్ట్ ముర్డోక్  93 ఏళ్ల వయసులో ఐదోసారి వివాహం చేసుకున్నారు.  శనివారం ఎలెనా జుకోవా (67)ను పెళ్లాడాడు.  ప్రస్తుతం వీరి పెళ్లివార్త హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  ఇంతకీ  ముర్డోక్‌ పెళ్లాడింది ఎవరిని?  తెలుసుకుందాం ఈ కథనంలో..!

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మ‌ర్దోక్‌ లాస్ ఏంజెల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో  త‌న కంటే 25 ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్ర‌వేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు.  గత సంవత్సరం ఫాక్స్, న్యూస్ కార్పొరేషన్ బోర్డుల నుండి పదవీ విరమణ చేసిన మీడియా మొగల్, లాస్ ఏంజిల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో ఇరువురూ జంటగా మారారు. ఈ వివాహ వేడుక‌కు పలువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ జంట మార్చిలో తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి విదితమే.

ఎమీలియా విక్‌స్టెడ్ రూపొందించిన అద్భుతమైన వైట్‌ గౌనులో మెరిసిపోగా, మ‌ర్డోక్‌ స్నీకర్స్‌ బ్లేక్‌ సూట్‌లో  కనిపించారు. వీరి పెళ్లికి విచ్చసిన ప్రముఖ అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ సీఈఓ రాబర్ట్ థామ్సన్ తదితరులు ఉన్నారు.

ఎలెనా జుకోవా ఎవరు?
మాస్కో మేధావి వర్గం కుటుంబానికి చెందిన ఎలెనా జుకోవా ఒక రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. మధుమేహం పరిశోధనలో ఆమె ప్రత్యేకతను సాధించారు. ఈ రంగంలో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె విశేష కృషి చేశారు. 1991లో మాస్కో నుండి అమెరికాకు వలస వచ్చారు. 

రష్యన్ రాజకీయవేత్త, బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్‌తో వివాహం,  మూడేళ్ల తర్వాత వీరు విడిపోయారు. వీరికి దశా జుకోవా అనే కుమార్తె ఉంది. ఇన్నాళ్లకు జుకోవాకు మార్చిలో ముర్డోక్‌తో నిశ్చితార్థం జరిగింది.

వాల్ స్ట్రీట్ జర్నల్, ది సన్, ది టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, హెరాల్డ్ సన్, ఫాక్స్ న్యూస్‌, ది డైలీ టెలిగ్రాఫ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా అవుట్‌లెట్‌లకు యజమాని. 2022  నాటికి అమెరికాలోని 31వ ధనవంతుడు. అలాగే ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 71వ కుబేరుడు. రూప‌ర్ట్ మ‌ర్దోక్‌ నికర విలువ 21.7 బిలియన్ డాల‌ర్లు.

ఇక మ‌ర్దోక్‌కు మొద‌ట పాట్రీషియా బుక‌ర్‌తో పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ త‌ర్వాత మ‌రియామ‌న్‌, విన్‌డీ డెండ్‌, జెర్రీ హాల్‌ల‌నూ ప‌రిణ‌య‌మాడి ప‌లు కార‌ణాల‌తో విడాకులు తీసుకున్నారు.నాల్గవ భార్య, సూపర్ మోడల్ జెర్రీ హాల్‌కి 2022లో విడాకులు ఇచ్చాడు. అతగాడికి వెండి డెంగ్, అన్నా ముర్డోక్ మాన్ , ప్యాట్రిసియా బుకర్ అనే మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం  పదవీ విరమణ అనంతరం, తన కుమారుడు లాచ్‌లాన్‌కు న్యూస్ కార్ప్‌లో తన ప్రధాన పాత్ర నుండి పగ్గాలను అప్పగించాడు. నలుగురు ద పిల్లలు వాటాలతో కుటుంబ ట్రస్ట్ ద్వారా  కంపెనీ నిర్వహణ సాగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement