వ‌చ్చే నెల‌లో నితిన్ వివాహం | Nithiin And Shalini Prepone Their Wedding In July | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్‌లో నితిన్ పెళ్లి!

Published Tue, Jun 23 2020 5:46 PM | Last Updated on Tue, Jun 23 2020 7:01 PM

Nithiin And Shalini Prepone Their Wedding In July - Sakshi

నాగర్ కర్నూల్‌కు చెందిన‌ షాలినితో నితిన్ చాలాకాలంగా ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ప్రేమ‌ను పెళ్లి పీట‌లెక్కించేందుకు ఫిబ్ర‌వ‌రి 15న హైద‌రాబాద్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అన్నీ క‌లిసొస్తే నితిన్‌ ఈపాటికే ఓ ఇంటివాడ‌య్యేవాడు. కానీ క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల అన్ని ప్లాన్‌లు ర‌ద్ద‌య్యాయి. దీంతో దుబాయ్‌లో ఏప్రిల్ 16న జ‌ర‌గాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పెడింది. అయితే వ‌చ్చే నెల‌లోనే నితిన్ వివాహానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. (కరోనా ఎఫెక్ట్‌: అభిమానులకు నితిన్‌ విజ్ఞప్తి )

తొలుత‌ డిసెంబ‌ర్‌లో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాజా స‌మాచారం ప్ర‌కారం జూలైలోనే వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌ట్లో క‌రోనా స‌మ‌స్య ముగిసే సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో పెళ్లి ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి ప్లాన్‌ను విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు మార్చారు. న‌గ‌ర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని టాక్. ఇక‌ ఈ విష‌యాన్ని నితిన్‌, షాలినీ కుటుంబ స‌భ్యులు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. (అలా షాలినీతో ప్రేమలో పడ్డా : నితిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement