ఇన్‌స్టా‘హామ్’ | Someone just hijacked Taylor Swift's Twitter and Instagram accounts | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా‘హామ్’

Published Fri, Jan 30 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

ఇన్‌స్టా‘హామ్’

ఇన్‌స్టా‘హామ్’

మరో సెలబ్రిటీ హ్యాకింగ్ బారిన పడింది. పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వాల్స్‌పై అసభ్యకర పోస్టులు చేయడమే కాదు... ఆమె న్యూడ్ పిక్చర్స్ కూడా అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారట ఆకతాయిలు. దీనికి చిర్రెత్తిన స్విఫ్ట్... వెంటనే ఆ పోస్టులు తొలగించేసింది. ఫొటోషాపులతో మార్ఫింగ్‌లు చేసి పొందే శునకానందులను తానేమీ చేయలేనంటూ ఘాటుగా స్పందించింది. ట్విట్టర్‌లో స్విఫ్ట్‌కు ప్రస్తుతం 51.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  ఈ హ్యాకింగ్ ది లిజర్డ్ స్క్వాడ్ పనిగా కొందరు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement