vulgar posts
-
సీఎం జగన్‌పై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
అమరావతి(పెదకూరపాడు) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తను శుక్రవారం గుంటూరు జిల్లా అమరావతి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం అమరావతిలోని గోపాల్‌నగర్‌కు చెందిన పెద్దిబోయిన వెంకట శివరావు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పని చేశాడు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫేస్బుక్లో మార్చి 12వ తేదీన రవిచౌదరి అనే వ్యక్తి పోస్టు చేసిన, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్న పోస్టును ఈ నెల ఒకటో తేదీన ఫేస్బుక్లో తన స్నేహితులకు, పబ్లిక్కు వెంకట శివరావు షేర్ చేశాడు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్యకర్త బైనబోయిన సురేష్ తుళ్ళూరు డీఎస్పీ కేశప్పకు ఫిర్యాదు చేశారు. అమరావతి సీఐ శివనాగరాజు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం సత్తెనపల్లి కోర్టుకు తరలించారు. -
నటికి అసభ్య సందేశం.. స్ట్రాంగ్ రిప్లై
సాక్షి, సినిమా : ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33). అయితే పెద్దగా సక్సెస్ రాకపోవటంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్రిటీష్ సింగర్ ఆ మధ్య సన్యాసం స్వీకరించి ఆమె వార్తల్లో నిలిచారు. మళ్లీ ఏమనిపించిందో ఏమో బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసి అతన్ని వివాహం చేసుకుంది. తర్వాత భర్తతో తరచూ హాట్ ఫోటోలు పెడుతూ.. చీప్ ట్రిక్స్ చేస్తోందంటూ ఫాలోవర్స్ నుంచి ఛీత్కారాలను ఆమె ఎదుర్కున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం చేశాడు. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఆమె అందుకు ప్రతిగానే బదులు ఇవ్వగా.. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిషేక్ సింగ్ అనే వ్యక్తి సోఫియాతో ఒక రాత్రి తనతో గడపాలని.. అందుకు రూ. 20 లక్షలు ఇస్తానంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. అంతే ఆమెకు కోపం తెప్పించింది. ఆపై దానిని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వ్యక్తికి సరైన సమాధానం ఇచ్చావ్ శభాష్.. అంటూ సోఫియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోఫియా చేసిన పోస్ట్ -
ఇన్‌స్టా‘హామ్’
మరో సెలబ్రిటీ హ్యాకింగ్ బారిన పడింది. పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వాల్స్‌పై అసభ్యకర పోస్టులు చేయడమే కాదు... ఆమె న్యూడ్ పిక్చర్స్ కూడా అప్లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారట ఆకతాయిలు. దీనికి చిర్రెత్తిన స్విఫ్ట్... వెంటనే ఆ పోస్టులు తొలగించేసింది. ఫొటోషాపులతో మార్ఫింగ్‌లు చేసి పొందే శునకానందులను తానేమీ చేయలేనంటూ ఘాటుగా స్పందించింది. ట్విట్టర్లో స్విఫ్ట్‌కు ప్రస్తుతం 51.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హ్యాకింగ్ ది లిజర్డ్ స్క్వాడ్ పనిగా కొందరు అనుమానిస్తున్నారు.