
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ కి మద్దతుగా నిధులు సేకరిస్తున్నారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను టేలర్ స్విప్ట్ అస్త్రంగా మలుచుకున్నారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్విప్టీస్ ఫర్ కమలా అని పిలిచే టేలర్ స్విప్ట్ అభిమానుల సంస్థ కమలా హారిస్ ప్రచారం కోసం 40వేల డాలర్లకు పైగా నిధుల్ని సేకరించినట్లు ప్రకటించింది.
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్కి తాను ఓటు వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే టేలర్ స్విఫ్ట్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు హారిస్ కు మద్దతు పలికిన టేలర్ స్విఫ్ట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను ఉపయోగించిన టేలర్ స్విప్ట్ అభిమానులు ఈ భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా .. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను మేం ఒక అవకాశంగా మరల్చుకున్నాం. సోషల్ మీడియాలో ట్రంప్ కామెంట్స్ ను ఉపయోగించి ప్రచారం చేశాం. ప్రచారం మంచి ఫలితాల్ని అందించింది.
మేము ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మీమ్‌లను ఉపయోగిస్తాము. వాటి అనుగుణంగా నెటిజన్ల భావోద్వేగాల్ని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో తెలుసు. వాస్తవానికి ద్వేషించేవారు ద్వేషిస్తారని మాకు (టేరల్ స్విప్ట్ అభిమానులు)తెలుసు. అలా ద్వేషించేవాళ్ల కంటే మేం ఇంకా మంచి పనులు చేయగలమని తెలుసు అని కమల ఫర్ స్విఫ్టీస్ కమ్యూనికేషన్స్ టీమ్ మెంబర్ కార్లీ లాంగ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment