అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన కోహ్లి! | Virat Kohli Says Thanks To His Fans For Reaches 50 Million Followers In Instagram | Sakshi
Sakshi News home page

కోహ్లికి ఖాతాలోకి మరో రికార్డు!

Feb 18 2020 6:52 PM | Updated on Feb 18 2020 7:37 PM

Virat Kohli Says Thanks To His Fans For Reaches 50 Million Followers In Instagram  - Sakshi

భారత క్రికెట్‌ జట్టు సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌లో దూసుకుపోతున్న విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో అత్యంత అరుదైన ఘనత చేరింది. బ్యాట్‌తో పరుగుల రికార్డులు సృష్టిస్తున్న కోహ్లికి వీరాభిమానులెం తక్కువ లేరని మరోసారి రుజువైంది. బ్యాట్‌తో మైదానంలో అడుగు పెడితే చాలు స్టేడియం అంతా కోహ్లి పేరుతో మారుమ్రోగాల్సిందే. ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించిన కోహ్లికి మైధానంలోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్‌ను సంపాదించి తొలి భారతీయుడిగా నిలిచాడు. టాప్‌ బాలీవుడ్‌ సెలబ్రెటీలను వెనక్కు నెట్టి అత్యధికంగా 5 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ముందంజలో ఉన్నాడు. దీంతో ఆయన తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో ‘హాయ్‌ గాయ్స్.. మీ అందరికి ధన్యవాదాలు, మనం ఇప్పుడు ఇన్‌స్టాలో 50 మిలియన్‌ మైలు రాయిని సాధించాం. ఇదంతా మీ ప్రేమ, మద్దతునే సాధ్యమైంది.. మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ కోహ్లి షేర్‌ చేసిన ఈ వీడియో ఆయన అభిమానులను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటొంది. (యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్‌)

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌ధిక మంది ఫాలోవ‌ర్స్‌ ఉన్న భారత సెలబ్రేటి జాబితాలో కోహ్లీ త‌ర్వాత బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకోనేలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20 కోట్ల మంది ఫాలోవ‌ర్లతో పోర్చుగ‌ల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. ప్ర‌ముఖ మ్యూజిషియ‌న్ ఆరియానా గ్రాండే ఖాతాలో 17.5 కోట్ల మంది ఫాలోవ‌ర్లతో రెండవ స్థానంలో నిలవగా,హాలీవుడ్ న‌టుడు డ్వేన్ జాన్సన్(ది రాక్‌) 17.2 కోట్ల మంది ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement