Bollywood highest tax-paying female actress: బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు హీరోలతో ధీటుగా తమ యాక్టింగ్ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే హీరోలతో పోలిస్తే రెమ్యనరేషన్ విషయంలో మాత్రం వివక్ష తప్పడం లేదు. అయితే నటనతో పాటు ఎండార్స్‌మెంట్స్, యాడ్స్ ద్వారా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ ఎవరో తెలుసా? 500 కోట్లు నికర విలువ దీపికా పడుకోన్ బాలీవుడ్ విమెన్ సెలబ్రిటీలలో టాప్ టాక్స్‌పేయర్‌గా నిలుస్తోంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? )
బాలీవుడ్ సెలబ్రిటీలు, సినిమాలు చేయడంతో పాటు, విభిన్న వ్యాపారాలలో కూడా నిమగ్నమై భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు హీరోయిన్లు. ఇందులో తోటివారిలో ప్రత్యేకంగా నిలుస్తోంది దీపికా పడుకోన్. దీపికా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించిందట. ఇదే పరపరంలో తరువాత సంవత్సరాల్లో కొనసాగుతోందని బహుళ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికా పదుకోన్. దీపికా పదుకోన్ సంపాదన సంవత్సరానికి రూ. 40 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేస్తోంది. ఇక ఎండార్స్‌మెంట్‌ల కోసం 7-10 కోట్లు వసూలు చేస్తుందట. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!)
ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, దీపిక ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్‌మెంట్లు. 2019లో 48 కోట్లు సంపాదించింది. పద్మావతి మూవీకోసం ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేసిందని బీటౌన్ టాక్. అంతేకాడదు అదే ఏడాది రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజనీకాంత్ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. (డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?)
ఈ రేంజ్‌లో టాక్స్ కంటిన వారిలో దీపికానే టాప్. గతంలో ఈ ప్లేస్‌లో కత్రినా కైఫ్ ఉంది.2013-2014 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. రూ.10 కోట్ల మార్కుకు చేరుకోనప్పటికీ ఇక ఈలిస్ట్‌లోఆ లియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాది 5-6 కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు సమాచారం. భారతీయ మహిళా సెలబ్రిటీలలో ధనవంతులైన హీరోయిన్లల లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది. ప్రియాంక చోప్రా జోనాస్ నెట్‌వర్త్ 620 కోట్లు. కరీన్ కపూర్ ఖాన్, దాదాపు రూ. 485 కోట్లు,
Comments
Please login to add a commentAdd a comment