tax payments
-
అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు
Bollywood highest tax-paying female actress: బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు హీరోలతో ధీటుగా తమ యాక్టింగ్ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే హీరోలతో పోలిస్తే రెమ్యనరేషన్ విషయంలో మాత్రం వివక్ష తప్పడం లేదు. అయితే నటనతో పాటు ఎండార్స్మెంట్స్, యాడ్స్ ద్వారా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ ఎవరో తెలుసా? 500 కోట్లు నికర విలువ దీపికా పడుకోన్ బాలీవుడ్ విమెన్ సెలబ్రిటీలలో టాప్ టాక్స్పేయర్గా నిలుస్తోంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) బాలీవుడ్ సెలబ్రిటీలు, సినిమాలు చేయడంతో పాటు, విభిన్న వ్యాపారాలలో కూడా నిమగ్నమై భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు హీరోయిన్లు. ఇందులో తోటివారిలో ప్రత్యేకంగా నిలుస్తోంది దీపికా పడుకోన్. దీపికా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించిందట. ఇదే పరపరంలో తరువాత సంవత్సరాల్లో కొనసాగుతోందని బహుళ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికా పదుకోన్. దీపికా పదుకోన్ సంపాదన సంవత్సరానికి రూ. 40 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేస్తోంది. ఇక ఎండార్స్మెంట్ల కోసం 7-10 కోట్లు వసూలు చేస్తుందట. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, దీపిక ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్మెంట్లు. 2019లో 48 కోట్లు సంపాదించింది. పద్మావతి మూవీకోసం ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేసిందని బీటౌన్ టాక్. అంతేకాడదు అదే ఏడాది రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజనీకాంత్ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. (డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?) ఈ రేంజ్లో టాక్స్ కంటిన వారిలో దీపికానే టాప్. గతంలో ఈ ప్లేస్‌లో కత్రినా కైఫ్ ఉంది.2013-2014 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. రూ.10 కోట్ల మార్కుకు చేరుకోనప్పటికీ ఇక ఈలిస్ట్లోఆ లియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాది 5-6 కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు సమాచారం. భారతీయ మహిళా సెలబ్రిటీలలో ధనవంతులైన హీరోయిన్లల లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది. ప్రియాంక చోప్రా జోనాస్ నెట్‌వర్త్ 620 కోట్లు. కరీన్ కపూర్ ఖాన్, దాదాపు రూ. 485 కోట్లు, -
ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా..? దేనివల్ల అధిక ప్రయోజనం
సొంతంగా ఇల్లు సమకూర్చుకోవాలా..? లేదంటే అద్దె ఇంట్లో ఉంటే ప్రయోనమా? ఈ విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి గణాంకాల సహితంగా తెలుసుకుంటే కానీ, తీరే సందేహం కాదు ఇది. అప్పు తీసుకుని అయినా ఇల్లు సమకూర్చుకోవాలని, అదే లాభదాయకమని కొందరు బలంగా నమ్ముతుంటారు. భూ మి ధర ఎప్పటికైనా పెరిగేదే కదా, దీనితో ఆస్తి విలువ ఇతోధికం అవుతుందని భావిస్తుంటారు. కానీ, గతంలో ఉన్నంతగా భూమి విలువ వృద్ధి ఇక ముందూ ఉంటుందని చెప్పలేం. అలాగే, సొంతిల్లు పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉంటుందని కూడా చెప్పలేం. ఇదే నిజమైతే కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు రోజూ అదనపు సమయం, ఇంధనం రూపేణా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కానీ, ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. ఎన్నో జ్ఞాపకాలు, కలల నిలయం అని ఎక్కువ మంది చెబుతారు. కనుక సొంతింటి కలను రుణం రూపంలో నెరవేర్చుకుంటే లేదా అద్దె ఇంట్లో ఉంటే పన్ను కోణంలో ఉండే లాభ, నష్టాలను తెలుసుకుందాం. సొంతింటి కల.. రుణంపై సొంత ఇంటిని సమకూర్చుకుంటే మంచి పన్ను ఆదా ప్రయోజనాలు ‘ఆదాయపన్ను పాత విధానం’లో ఉన్నాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐ మొత్తంలో అసలు, వడ్డీ రెండు భాగాలు. ఈఎంఐలో భాగంగా చెల్లించే రుణం అసలును సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే, ఇంటి కొనుగోలుకు చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. వడ్డీ విషయానికొస్తే.. కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉండేవారు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ భాగం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.2 లక్షల మొత్తంపై పన్ను చెల్లించక్కర్లేదు. అంటే ఆదాయంలో రూ.2 లక్షల మేర గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీ కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే.. ఆ ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీతోపాటు ఆ ఇంటికి చెల్లించే మున్సిపల్ ట్యాక్స్, అద్దె ఆదాయంలో 30 శాతాన్ని స్టాండర్డ్ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈఈఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే సదరు రుణం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో మంజూరై ఉండాలి. ఇంటి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45లక్షలు మించకూడదన్నది షరతు. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రయోజనాలు ఆదాయపన్ను కొత్త విధానంలో లేవు. సెటాఫ్, క్యారీఫార్వార్డ్ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిలో సొంతంగా నివసించే వారు అద్దె రూపంలో ఎలాంటి ఆదాయం లేనట్టయితే.. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీని నష్టంగా చట్టం పరిగణిస్తుంది. దీన్ని వేతనం, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం కింద సర్దుబాటు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ మొత్తం ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఆ నష్టాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో (క్యారీ ఫార్వార్డ్) ఇతర ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ ఇళ్లు కలిగి ఉంటే నోషనల్ రెంట్ అంశం తెరపైకి వస్తుంది. రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగించుకుంటున్నారని అనుకుంటే, మిగిలిన ఇళ్లను అద్దెకు ఇచ్చినా ఇవ్వకపోయినా.. చట్టం కింద ఇచ్చినట్టుగానే పరిగణిస్తారు. మార్కెట్లో ఉన్న సగటు అద్దె ధరలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలతలు: అద్దె ఇంటితో పోలిస్తే సొంతిల్లు తీసుకోవడం వల్ల ఆస్తి సమకూరుతుంది. ఇంటి రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతికూలతలు: రుణంపై తీసుకున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారుడు డౌన్ పేమెంట్ కింద తన వంతు వాటా కట్టాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్‌లను ఏటా చెల్లించాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు అదనం. ఇంటికి మరమ్మతుల కోసం వెచ్చించాలి. విక్రయించాలంటే వెంటనే అమ్ముడుపోకపోవచ్చు. అంటే లిక్విడిటీ తక్కువ. ప్రాపర్టీ ధర పెరుగుతుందని, గణనీయంగా పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఉద్యోగం లేదా ఆదాయం నిలిచిపోయినా రుణం, దానిపై వడ్డీ చెల్లించాల్సిందే. చిన్న ఇంటికి వెళ్లి అద్దె భారం తగ్గించుకునే అవకాశం ఉండదు. అద్దె ఇంట్లో ఉండే వారికి కంపెనీలు తమ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ని వేతనంలో భాగంగా ఇస్తుంటాయి. ఈ భాగానికి పన్ను ప్రయోజనం ఉంటుంది. స్థూల పన్ను వేతనంలో గరిష్టంగా రూ.5,000 వరకు ఉంటుంది. కాకపోతే హెచ్ఆర్ఏకి పన్ను మినహాయింపు పొందాలంటే పనిచేస్తున్న కార్యాలయం ప్రాంతంలోనే సొంత ఇల్లు కలిగి ఉండకూడదనేది షరతు. పన్ను ప్రయోజనాలు: అద్దె ఇంట్లో ఉండేవారు, వేతనంలో భాగంగా పొందిన హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే, హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపునకు కొన్ని షరతులు ఉన్నాయి. మూల వేతనం, కరువు భత్యం మొత్తంలో 10 శాతం. లేదంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో నివసించే వారు వేతనంలో 50 శాతం, మిగిలిన పట్టణాల్లో నివసించే వారు 40 శాతాన్ని హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. లేదా అసలు హెచ్ఆర్ఏ రూపంలో తీసుకున్న మొత్తం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తంపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయపన్ను చట్టం అనుమతిస్తుంది. అనుకూలతలు: రుణంతో ఇల్లు కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన ఈఎంఐ కంటే, అద్దె ఇంటి కోసం చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. అద్దె ఇల్లు అయితే పనిచేసే ప్రాంతానికి అతి సమీపంలో లేదా కావాల్సిన చోట ఉండొచ్చు. సొంతిల్లు అయితే అందుబాటు ధర కోసం, పట్టణానికి వెలుపలి ప్రాంతాల్లో కొనుగోలు చేయాల్సి (ఎక్కువ మంది విషయంలో) వస్తుంది. అద్దె ఇ్లలు అయితే కోరుకున్నప్పుడు ఇల్లు మారిపోవడం సులభం. చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. ప్రతికూలతలు: అద్దె ఇంట్లో ఉంటే ఆస్తి సమకూరదు. ఏటా అద్దె పెరుగుతూ ఉంటుంది. నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకోలేరు. ఇంటి యజమానికి నచ్చకపోయినా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరికి ఎలా ప్రయోజనం..? ఎక్స్ అనే వ్యక్తి స్థూల వార్షిక ఆదాయం రూ.20లక్షలు. నెలవారీగా అద్దె కింద రూ.30వేలు చెల్లిస్తున్నాడు. వై అనే వ్యక్తి వార్షిక ఆదాయం కూడా రూ.20 లక్షలే. కానీ, అతడు సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటి రుణంపై ఏటా రూ.3 లక్షలు వడ్డీ కింద, రూ.1.5 లక్షలు అసలు కింద చెల్లిస్తున్నాడు. ఇప్పుడు వీరికి నికర పన్ను భారం (ఆదాయపన్ను పాత విధానం కింద) ఎలా ఉంటుందని చూస్తే.. (పక్క బాక్స్‌లో) -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 17తో ముగిసిన కాలానికి స్థూలంగా 30 శాతం పురోగతితో రూ.8.36 లక్షల కోట్లకు చేరాయి. మహమ్మారి తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఎకానమీ, ముందస్తు పన్ను చెల్లింపులు దీనికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, విలువ రూ.6,42,2876 కోట్ల నుంచి రూ.8,36,225 కోట్లకు చేరినట్లు ప్రకటన వివరించింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ రంగం వాటా రూ.4.36 లక్షల కోట్లుకాగా, వ్యక్తిగత పన్ను విభాగం వాటా రూ.3.98 లక్షల కోట్లు. ఒక్క అడ్వాన్స్ పన్ను విసూళ్లు 17 శాతం వృద్ధితో రూ.2.29 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్ రూ.1.36 లక్షల కోట్లు ఇక మొత్తం వసూళ్లలో రిఫండ్స్ విలువ రూ.1.36 లక్షల కోట్లు. దీనితో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
ఇకపై రైల్వే స్టేషన్లలో బిల్లులు కట్టొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైలు, బస్సు, విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) కియోస్క్‌ల ద్వారా అందిస్తారు. వీటికి ‘రైల్‌వైర్ సాథీ కియోస్క్’గా రైల్టెక్ నామకరణం చేసింది. ఈ కియోస్క్‌లను తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారు. దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు ఈ కియోస్క్ సేవలను విస్తరిస్తారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో 44, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 13, నార్త్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 13, వెస్టర్న్ రైల్వేలో 15, నార్తర్న్ రైల్వేలో 25, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 12, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 56 కియోస్క్‌లను ఏర్పాటుచేయనున్నారు. కొత్త కియోస్క్‌లను సీఎస్సీ ఇ–గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తాయని రైల్టెక్ తెలిపింది. భారతీయ రైల్వే, రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం కలిసి రైల్‌టెక్‌ను ఏర్పాటుచేశాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కియోస్క్‌లను తెస్తున్నట్లు రైల్టెక్ సీఎండీ పునీత్ చావ్లా చెప్పారు. -
పన్ను కట్టే విధమెట్టిదనిన...
ఈ కాలంలో అందరూ మాట్లాడుకునేది కేవలం ఆదాయపు పన్ను గురించే.. దీన్ని ఎలా చెల్లించాలి అంటే .. ఇప్పుడు నగదు చెల్లింపులు లేవు. అన్నీ బ్యాంకు ద్వారా చేయడమే. చలాన్ సరిగ్గా నింపి మీకు ఏ బ్యాంకులో అకౌంటు ఉందో అందులో ‘యువర్–సెల్ఫ్‘ అని మీ చెక్ రాసి ఇస్తే, బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడో లేదా ఆ తర్వాతో మీకు చలాన్ ఇస్తారు. ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చు. తగిన జాగ్రత్తలు వహించి చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా చలాన్ జనరేట్ అవుతుంది. ఈ చలాన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. మీ పేరు, పాన్, అసెస్మెంట్ సంవత్సరం మొదలైనవన్నీ జాగ్రత్తగా రాయండి. ప్రస్తుతం అందరూ రిటర్నులు వేస్తున్నారు. పన్ను భారాన్ని లెక్కించి, అందులోనుంచి అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ మినహాయించగా ఇంకా భారం చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని చెల్లించడాన్ని ‘సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్‘ అంటారు. దీనితో సాధారణ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు, తప్పులు, తడకలు లేకపోతే పన్నుభారం ఏర్పడదు. టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర ’300’ నంబర్ దగ్గర టిక్ చేయాలి. రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేస్తారు. దీనినే మదింపు లేదా అసెస్మెంట్ అని అంటారు. ఈ అసెస్మెంట్ వలన ఆదాయం మారవచ్చు. డిడక్షన్లు మారవచ్చు. మినహాయింపు మారవచ్చు. ఫలితంగా పన్నుభారం మారవచ్చు. ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటే ’డిమాండ్’ అని చెప్తారు ఆర్డర్లో. ఆ మొత్తం చెల్లించేటప్పుడు ’400’ అనే కాలం దగ్గర టిక్ చేయాలి. దీనిని ’ట్యాక్స్ ఆన్ రెగ్యులర్ అసెస్మెంట్’ అని అంటారు. ఒకవేళ రిఫండ్ ఉంటే దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. స్థిరాస్తి అమ్మకం మీద టీడీఎస్ చెల్లించేటప్పుడు కాలం ’800’ దగ్గర టిక్ చేయాలి. మరో ముఖ్యమైన పద్ధతి.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం. ఈ మొత్తాన్ని చెల్లించేటప్పుడు కాలం ’100’ దగ్గర టిక్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని ముందుగానే లెక్కించి, టీడీఎస్ మొత్తాన్ని తీసివేయగా.. మిగిలిన మొత్తం రూ. 10,000 (పది వేల రూపాయలు) దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించాలి. మొదటి విడతలో 15 శాతం (జూన్ 15 లోగా), రెండో విడత 30 శాతం (సెప్టెంబర్ 15 లోగా), మూడో విడత 30 శాతం (డిసెంబర్ 15 లోగా), చివరి విడత 25 శాతం (మార్చి 15 లోగా) కట్టాలి. దీనికి సంబంధించి జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో గడువు తేదీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారం చెల్లించినప్పుడు సరిగ్గా వివరాలు రాయండి. ఈ విధంగా ఒక అసెసీ తన పన్ను భారాన్ని అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ అసెస్మెంట్ సంవత్సరం, ఏ టైప్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. తదనుగుణంగా పన్ను భారం చెల్లించాలి. -
వొడాఫోన్‌కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విజయం సాధించామని టెలికాం దిగ్గజం వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ 12,000 కోట్లతో పాటు, రూ 7900 కోట్ల పెనాల్టీల చెల్లింపుపై అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉపశమనం లభించిందని పేర్కొంది. వాయుతరంగాల వాడకం, లైసెన్స్ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్ 2016లో సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఆశ్రయించింది. చదవండి : వొడాఫోన్ కొత్త ‘ఐడియా’ వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం మోపిన పన్ను భారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రిబ్యునల్ రూలింగ్ ఇచ్చిందని వొడాఫోన్ పేర్కొంది. ఇక నష్టాలతో సతమతమవుతున్న టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన రూలింగ్ ఊరట కల్పించింది. ప్రభుత్వ బకాయిల చెల్లింపును పదేళ్లలోగా పూర్తిచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం టెలికాం కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. -
పట్టణాల ‘ఆస్తి’ .. కరోనాతో నాస్తి
మండపేట: ఆస్తి పన్నుల వసూలుపై కూడా కరోనా ప్రభావం చూపింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ రూ.139.65 కోట్లు కాగా మార్చి నెలాఖరు నాటికి 50 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. 78.9 శాతం పన్నుల వసూలుతో పెద్దాపురం పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పన్నుల వసూలుకు ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు. జిల్లాలోని నగర, పురపాలక సంస్థల్లో 2,55,418 అసెస్మెంట్లకు గాను గతేడాది ఆస్తిపన్ను డిమాండ్ రూ.139.65 కోట్లుగా ఉంది. సాధారణంగా మార్చి చివరి వారంలో అధిక శాతం యజమానులు పన్నులు చెల్లిస్తారు. అదే సమయంలో కలకలం రేపిన కరోనా వైరస్ పన్నుల వసూలుపైనా ప్రభావం చూపింది. మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ అమలులోకి రాగా పన్నుల వసూలు మందగించాయి. ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా పన్నుల వసూలుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలపై ఒత్తిడి తీసుకురాలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 87.09 శాతం పన్నులు వసూలు కాగా 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 69.82 కోట్లుతో 50 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. అత్యధికంగా పెద్దాపురంలో 78.9 శాతం పన్నులు వసూలు కాగా 77.4 శాతంతో గొల్లప్రోలు నగర పంచాయతీ ద్వితీయ స్థానంలో ఉంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్లో 48.4 శాతం, కాకినాడలో 51.7 శాతం, మండపేట మున్సిపాలిటీలో 56.9 శాతం, అమలాపురంలో 46.1 శాతం, రామచంద్రపురంలో 34.9 శాతం, పిఠాపురంలో 33.4 శాతం, తునిలో 64.3 శాతం, సామర్లకోటలో 53.3 శాతం, ఏలేశ్వరం నగర పంచాయతీలో 58.1 శాతం, ముమ్మిడివరంలో 48 శాతం పన్నులు వసూలయ్యాయి. -
జనాభా 130 కోట్లు పన్ను కట్టింది 1.46 కోట్లు
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్ల ఖరీదైన కార్లు అమ్ముడుపోయాయి. రూ.కోటికి తక్కువ కాని ఫ్లాట్లు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో మూడు కోట్ల మందికిపైగా పర్యాటకం, వ్యాపారాల పేరుతో విదేశాలను చుట్టివచ్చారు. కానీ మన దేశంలో ఆదాయం పన్ను కడుతున్న వారెంతమందో తెలుసా? 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.46 కోట్ల మంది ఆదాయ పన్ను కట్టినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ ప్రకటించింది. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసింది 5.78 కోట్ల మందే. అంతేకాదు లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వృత్తినిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నా... వీరిలో సంవత్సరానికి రూ.కోటి ఆదాయం దాటిన వారు మాత్రం 2,200 మందే!!. నిజానికి ఈ సమాచారం చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ముక్కున వేలేసుకున్నారు!!. దీనిపై ఆయన ఘాటుగానే స్పందించారు. కోటి రూపాయల ఆదాయం దాటిన వృత్తినిపుణుల సంఖ్య కేవలం 2,200 ఉందంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఈ గణాంకాలు ఎంత మంది పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారన్నది స్పష్టం చేస్తున్నాయని, దేశాభివృద్ధికి అందరూ పన్నులు చెల్లించాలని కోరారాయన. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారిపై ఈ భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ వెల్లడించిన మరిన్ని వివరాలు ఇవీ... (ఆదాయం రూ.కోట్లలో) ♦ 5 కోట్ల ఆదాయం దాటిన వారు: 8,600 ♦ 50 లక్షల ఆదాయం దాటినవారు: 3,16,000 ♦ 10 లక్షల పైన ఆదాయం చూపిన వారు: 46 లక్షలు ♦ 5–10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు: కోటి మంది ♦ 2.50 లక్షలు– 5 లక్షల మధ్య ఉన్న వారు: 3.29 కోట్లు ♦ 2.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు: 1.03 కోట్లు ♦ మొత్తం రిటర్నులు దాఖలు చేసిన వారు: 5.78 కోట్లు ♦ రూ.5 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు కనక 4.32 కోట్ల మంది ఎలాంటి పన్నూ కట్టలేదు ♦ నికరంగా పన్ను చెల్లించిన వారు: 1.46 కోట్లు... దాదాపుగా 1%. -
పన్ను చెల్లింపును బాధ్యతగా భావించండి
న్యూఢిల్లీ: పన్ను వ్యవస్థలో మార్పులు చేసేందుకు గత ప్రభుత్వాలు జంకాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పన్ను వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువచ్చామని, పన్ను చెల్లింపుదారుడు కేంద్రంగా ఆ వ్యవస్థను మార్చామని వివరించారు. ఆంగ్ల వార్తాచానెల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన ఒక సదస్సులో బుధవారం ప్రధాని ప్రసంగించారు. దేశాభివృద్ధికి పన్ను ఆదాయం అవసరమని, అందువల్ల పన్ను పరిధిలో ఉన్నవారంతా తమ పన్నులను చెల్లించాలని కోరారు. పన్ను చెల్లింపును ఒక బాధ్యతగా, గౌరవంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు చేసే ప్రయత్నాల వల్ల నిజాయితీగా పన్ను చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘పన్ను చెల్లింపుదారుల హక్కులను స్పష్టంగా పేర్కొన్న అత్యంత పారదర్శక పన్ను చట్టం అమల్లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో పన్ను చెల్లింపుదారులను వేధింపులకు గురి చేసే కాలం త్వరలోనే అంతరించిపోతుందని మీకు హామీ ఇస్తున్నా’ అన్నారు. పన్నులు చెల్లించకుండా ఉండేందుకు దారులు వెతికే కొందరివల్ల నిజాయితీగా తమ పన్నులను చెల్లిస్తున్నవారిపై అదనపు భారం పడుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోటి రూపాయల వార్షికాదాయం చూపిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కేవలం 2200 మాత్రమే అన్నది నమ్మశక్యం కాని నిజం’ అన్నారు. -
మొబైల్ వాలెట్లతో పన్ను చెల్లింపులు..!
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపులను చేసే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తేనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సోమవారం చెప్పారు. ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్‌తో పాటు కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులను చేయడానికి వీలుంది. ఈ పరిధిని విస్తరించడం, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించడం వంటి పలు సౌకర్యాలపై కసరత్తు చేస్తున్నట్లు మరో అధికారి మీడియాకు చెప్పారు. -
ముంబై కేంద్రంగా అమెరికన్లకు టోకరా!
సాక్షి, రంగారెడ్డి: ముంబై ముఠా అమెరికా వాసుల్ని లక్ష్యంగా చేసుకుంది... ఆ దేశంతోపాటు ఇక్కడి అనేక నగరాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది... ముఠా సభ్యులు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారుల అవతారం ఎత్తారు... పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వాయిస్ మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో అమెరికన్లను బెదిరించారు... కొన్ని గిఫ్ట్‌కార్డ్స్ కొనాలంటూ వారి డెబిట్ కార్డుల వివరాలు తెలుసుకుని నిండా ముంచారు... ఈ పంథాలో రూ.కోట్లలో టోకరా వేసిన ఈ ఘరానా ముఠాను గతవారం ముంబై పోలీసులు పట్టుకున్నారు. వీరికి ఆ డేటా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌తోపాటు హైదరాబాద్ నుంచీ అందిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తుతోపాటు నగరంలో ఉన్న ఏజెంట్లను పట్టుకోవడానికి ముంబై నుంచి ప్రత్యేక బృందం సిటీకి రానుంది. అప్పులపాలై తప్పుదారి... ముంబైకి చెందిన ఈ గ్యాంగ్ సూత్రధారి యోగేశ్ శర్మ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పాడు. ఆరు నెలల క్రితం అక్కడి వెస్ట్ గోరేగావ్‌లో ఉన్న ఛావ్ల్ ప్రాంతంలోని భవనంలో కొంతభాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. అందులో బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నష్టాలు చవి చూశాడు. తర్వాత మరొకరితో కలసి అందులోనే ఆయుర్వేద ఉత్పత్తుల్ని విదేశీయులకు విక్రయించడానికి ఓ కాల్ సెంటర్ ప్రారంభించాడు. ఇదీ ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు. ఫలితంగా నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి మోసాల బాటపట్టాడు. ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభిషేక్ సాలియన్, నయీమ్ ఖాన్, ఆసిఫ్, ప్రదీప్‌కుమార్‌లతో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. యోగేష్ అమెరికాతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తుల నుంచి అమెరికా జాతీయులకు చెందిన సోషల్ సెక్యూరిటీ నంబర్ల (ఎస్ఎస్ఎన్) డేటాను సంగ్రహించాడు. దీని ఆధారంగా ఈ ముఠా సభ్యులు అమెరికాకు చెందిన ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారుల అవతారమెత్తారు. వాయిస్ మెయిల్స్ సృష్టించి... ఆ డేటా ఆధారంగా ఒక్కో నిందితుడు వాయిస్ మెయిల్స్ సృష్టించి వెయ్యిమందికి పంపేవారు. ఐఆర్ఎస్ అధికారులమంటూ పరిచయం చేసుకుని పన్ను చెల్లింపులో కొన్ని అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి జరిమానాలు చెల్లించాల్సి ఉందని బెదిరించేవారు. అమెరికా ఐఆర్ఎస్ విభాగం కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుందని, దీని ప్రకారం జరిమానా మొత్తం నుంచి 25 శాతం వెచ్చించి ఆయా సంస్థల గిఫ్ట్‌కార్డ్స్ కొనాల్సి ఉంటుందని వారి డెబిట్‌కార్డుల డేటా సంగ్రహించేవారు. ఇతర రహస్య వివరాలు అమెరికన్ల నుంచి తెలుసుకుని వారి ఖాతాల్లోని డబ్బును వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ల ఖాతాల్లోకి మళ్లించి మోసం చేసేవారు. ఆపై ఫోన్ నంబర్లు మార్చేసి అందుబాటులో లేకుండాపోయేవారు. గడిచిన 45 రోజులుగా ఈ పంథాలో అనేకమంది అమెరికన్ల నుంచి రూ.కోట్లు కాజేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి గురువారం ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్ లింకులు బయటకురాడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు దర్యాప్తుతోపాటు డేటా అందించిన ఏజెంట్లను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపారు. ముంబై ముఠాకు సహకరించిన హైదరాబాదీలు ఎవరనే విషయంపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. -
మహా దూకుడు
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుం డా అధికారులు, సిబ్బంది బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తూ, షాపులు, నల్లాలు సీజ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీస్లతోపాటు వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు పంపించడానికి సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పోలీసుల సహకరంతో ప్రత్యేకంగా 13 బృందాలు రంగంలోకి దిగాయి. జీపులకు మైకులకు ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పన్ను బకాయిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ సిబ్బంది వరంగల్ మహానగర పాలక సంస్థకు పన్నులే ప్రధాన వనరు. ఆదాయ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న యంత్రాంగం వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది ఎలాగైనా వందశాతం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో వేగం పెంచారు. ఫస్ట్ ఆఫ్‌లో పన్ను వసూళ్ల టార్గెట్‌లో బల్దియా విఫలం చెందింది. పదకొండు నెలల పాటు మీనిమేషాలు లెక్కిస్తూ వస్తున్న గ్రేటర్ రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరిది కావడంతో స్పీడ్ పెంచారు. మొండిబకాయిదారులను డివిజన్ల వారీగా విభజించి వారం రోజులుగా తిరుగుతున్నారు. ‘ఆన్లైన్’లో టాప్ బకాయిదారుల పేర్ల ప్రదర్శన ఆస్తి, నీటి పన్నుల బడా బకాయిదారుల పేర్లను ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నాయి. ఆయా డివిజన్లలో ప్లెక్సీలపై వారి పేర్లను ప్రదర్శించిన అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. టాప్–100 బడాబకాయిదారుల పేర్లను జీడబ్ల్యూఎంసీ వెబ్సైల్లో పెంటారు. 27 రోజులు.. రూ.30కోట్లు గ్రేటర్ పరిధిలో 18,106 ఆస్తులున్నాయి. పాత బకాయిలు రూ.5.56 కోట్లు ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను రూ.56.10 కోట్లతో కలిపి రూ.61.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు పాత, కొత్త బకాయిలు రూ.45 కోట్లు వసూలు చేశారు. రూ.16.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇకపోతే నల్లా కనెక్షన్లు 1,05,041 ఉన్నాయి. వీటి పాత బకాయిలు రూ.9.70కోట్లు ఉండగా కొత్త బకాయిలు రూ.15.72 కోట్లు కలిపి మొత్తం ఈ ఏడాది రూ.25.42కోట్లకు చేరింది. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10.88 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.13.34 కోటుŠల్ వసూలు చేయాల్సి ఉంది. మరో 24 రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నులు రూ.30కోట్లు వసూలు చేసి లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు. వసూళ్లల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, వందశాతం పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం ప్రత్యేక బృందాలుగా 13 ఏరియాల వారీగా ఆర్ఐలు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేయాలని రోజు వారీగా వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓలు, ఆర్ఐ, బిల్ కలెక్టర్, కారోబార్, లైన్మెన్లు, 28 మంది పోలీస్ సిబ్బంది సహకారంతో పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా జీపులతో బల్దియా రెవెన్యూ సిబ్బంది ఆస్తులు జప్తు, సీజ్ మొండి బకాయిదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బకాయి చెల్లించని వారి ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లను సీజ్ చేస్తున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి పన్నులు చెల్లించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచి నగర అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది. పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు చెల్లించాలి. వసూళ్ల కోసం వచ్చే కార్పొరేషన్ సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందించాలి. – శాంతికుమార్, టాక్సేషన్ ఆఫీసర్ -
ఒక్క రోజే గడువు
ప్రొద్దుటూరు టౌన్ :ప్రభుత్వం ఈ ఏడాది పన్ను వసూలుకు విధించిన గడువు శనివారంతో ముగియనుంది. వంద శాతం పన్ను బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అమలు కాలేదు. పన్ను బకాయి ఉన్న వారి ఇళ్ల వద్దకు, వాణిజ్య సముదాయాల వద్దకు వెళ్లి గంటకొడుతున్నా, విద్యుత్, కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు వసూళ్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాలు వదలి రోడ్లపైనే ఉంటున్నారు. అయినా జిల్లాలోని ఏ మున్సిపాలిటీ వంద శాతం పన్ను వసూలు చేయాలేదు. మరొక్క రోజే గడువు ఉండటంతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన మొదలైంది. వసూళ్లలో వెనుకబడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో బకాయిలు ఇచ్చేంత వరకు అధికారులు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారానికి పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో పులివెందుల మున్సిపాలిటీ ఉండగా, చివరి స్థానంలో రాయచోటి మున్సిపాలిటీ నిలిచింది. పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల బ కాయిలు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ప్రొద్దుటూరు పట్టణం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి రూ.74లక్షలు బకాయి వసూలు కావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కమిషనర్ బండి శేషన్న, ఆర్ఓ మునికృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి పన్ను చెల్లించాలని నిరసన వ్యక్తం చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ విధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఉంది. గత ఏడాది కంటేరూ.2కోట్లు అధికంగా వసూలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రూ.14.82 కోట్లు ప్రైవేటు ఆస్తులపై, కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో శుక్రవారానికి రూ.11.84 కోట్లు వసూలైంది. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.2కోట్లు అధికంగా వసూలు చేశాం. ప్రభుత్వ బకాయిలు రూ.1.80 కోట్లు ఉండగా రూ.18 లక్షలు మాత్రమే వసూలైంది. శనివారంలోగా 80 శా తానికిపైగా పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తాం. – మునికృష్ణారెడ్డి, మున్సిపల్ ఆర్ఓ, ప్రొద్దుటూరు. -
అర్ధరాత్రి వరకూ పన్నులు చెల్లించే సదుపాయం
విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లించేందుకు శనివారం తుది గడువు కావడంతో అర్ధరాత్రి వరకూ ట్యాక్స్ కట్టే సౌకర్యం కల్పిస్తున్నామని డీసీఆర్ సోమన్నారాయణ తెలిపారు. ఇందుకోసం అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలతోపాటు మీ సేవా కేంద్రాలు అర్ధరాత్రి వరకూ పనిచేసే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండానే ఇంటి పన్ను, నీటిఛార్జీలు, వీఎల్టీ చెల్లించుకోవచ్చన్నారు. నిర్ణీత గడువులోపు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, అపరాధ రుసుం విధిస్తామనీ, అలాంటి చర్యలకు ఉపక్రమించకముందే పన్ను చెల్లింపులు చెయ్యాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 2 శాతం వడ్డీతో పన్నులు చెల్లించాల్సి వస్తుందనీ, ఈ అదనపు భారం లేకుండానే నగర ప్రజలు ట్యాక్స్‌లు కట్టాలని సోమన్నారాయణ విజ్ఞప్తి చేశారు. -
జీఎస్టీ రిటర్నులకు గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: వర్తకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) ఫైలింగ్‌లో దేశవ్యాప్తంగా వర్తకులు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఫైలింగ్ గడువును ప్రభుత్వం ఐదు రోజులు పెంచింది. ఆఖరి తేదీ రేపటితో(ఆగస్టు 20) తో ముగుస్తున్న క్రమంలో ఆగస్టు 25 వరకు ఈ గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది. పన్ను చెల్లింపులకు కూడా చివరి తేదీ ఆగస్టు 25నేనని పేర్కొంది. రిటర్నులకు చివరి తేది ముగస్తుండంతో, జీఎస్టీ ఫైలింగ్ వెబ్సైట్ కొంత సమయం పనిచేయడం ఆగిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వర్తకులకు జీఎస్టీ వెబ్సైట్లో సమస్యలు ఏర్పడటం ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు అసలు సర్వీసులు అందుబాటులో లేవు. దీంతో వర్తకులు ఆందోళనకు గురయ్యారు. వారి ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జీఎస్టీ రిటర్నుల గడువులను పెంచింది. -
మూడు రోజుల్లో రూ.12 కోట్లు
- వరంగల్ రీజియన్‌లోని కార్పొరేషన్లలో భారీగా వసూళ్లు గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లతో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించేందుకు అవకాశం కల్పించడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ప్రజలు పెద్ద ఎత్తున చెల్లింపులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. వరంగల్ రీజినల్ పరిధిలోని 31 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో బకాయిలు, తాజా పన్నులకు సంబంధించి రూ.170.66 కోట్ల వార్షిక డిమాండ్ ఉండగా గత ఏడు నెలల్లో (మార్చి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు) రూ.47.64 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కానీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను కూడా తీసుకోవడానికి మొదట 11వ తేదీ అర్ధరాత్రి వరకు, తర్వాత 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. దీంతో 11 నుంచి 13వ తేదీ వరకు వరంగల్ రీజియన్‌లో 15 జిల్లాల పరిధిలోని 31 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రూ.12.32 కోట్లు వసూలయ్యాయి. చివరి రోజు సోమవారం కూడా పెద్ద మొత్తంలోనే పన్నులు వసూలయ్యే అవకాశం ఉంది. మూడు రోజుల్లో వసూళ్ల తీరిది గత మూడు రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్లో రూ.1.69 కోట్లు, వరంగల్ కార్పొరేషన్లో రూ.4.58 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో రూ.1.25 కోట్లు, రామగుండం కార్పొరేషన్లో రూ.26.38 లక్షలు వసూలయ్యాయి. మధిర నగర పంచాయతీలో రూ.5.55 లక్షలు, సత్తుపల్లి నగర పంచాయతీలో రూ.13.43 లక్షలు, కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.19.18 లక్షలు, మణుగూరు మున్సిపాలిటీలో రూ.4.08 లక్షలు, పాల్వంచ మున్సిపాలిటీలో రూ.14.03 లక్షలు, ఎల్లందు మున్సిపాలిటీలో రూ.5.92 లక్షలు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.31.81 లక్షలు, భైంసా మున్సిపాలిటీలో రూ.4.80 లక్షలు, నిర్మల్ మున్సిపాలిటీలో రూ.20 లక్షలు, పెద్దపల్లి నగర పంచాయతీలో రూ.15.99 లక్షలు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో రూ.6.54 లక్షలు, మంచిర్యాల మున్సిపాలిటీలో రూ.89.47 లక్షలు, మందమర్రి మున్సిపాలిటీలో రూ.2.05 లక్షలు వసూలయ్యాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.11 లక్షలు, హుజురాబాద్ నగర పంచాయతీలో రూ.7.80 లక్షలు, జమ్మికుంట నగర పంచాయతీలో రూ.16.87 లక్షలు, భూపాలపల్లి నగర పంచాయితీలో 11.93 లక్షలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ.17.35 లక్షలు, వేములవాడ నగర పంచాయతీలో రూ.13.69 లక్షలు, జగిత్యాల మున్సిపాలిటీలో రూ.43.12 లక్షలు, కోరుట్ల మున్సిపాలిటీలో రూ.17.31 లక్షలు, మెట్పల్లి మున్సిపాలిటీలో రూ.12.73 లక్షలు, జనగామ మున్సిపాలిటీలో రూ.16.67 లక్షలు వసూలయ్యాయి. అలాగే కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.5.52 లక్షలు, నర్సంపేట నగర పంచాయతీలో రూ.22.78 లక్షలు, పరకాల నగర పంచాయతీలో రూ.17.46 లక్షలు, హుస్నాబాద్‌లో రూ.6.64 లక్షలు వసూలయ్యాయి. చివరి రోజు సోమవారం మరింత ఎక్కువగా వసూలు కానున్నాయని రీజినల్ డెరైక్టర్ డి.జాన్‌శ్యాంసన్ తెలిపారు. -
నాలుగేళ్లలో 2,250 కోట్ల డాలర్లు
అమెరికాకు భారత టెక్నాలజీ కంపెనీల పన్ను చెల్లింపులు న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలోనే పన్నులు కూడా చెల్లిస్తున్నాయి. 2011-15 ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ కంపెనీలు 2,250 కోట్ల మేర పన్నులు చెల్లించాయని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీలు 200 కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఆమె పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,11,000 ఉద్యోగాలను కల్పించాయని వివరించారు. కాగా అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసాపై 4,000 డాలర్లు, ఎల్1 వీసాపై 4,500 డాలర్ల ప్రత్యేకమైన ఫీజులను విధించింది. -
ట్యాక్స్ చెల్లించాలంటే హిజ్రాలు రావలసిందేనా ?
ఆస్తి, నీటి... పన్నులు సకాలంలో చెల్లిస్తే పౌర సేవలు సత్వరం అందించేందుకు నగరపాలక సంస్థలు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతూనే ఉంటారు. మధ్య తరగతి వారు పన్నులు చెల్లించకపోతే నయానో భయానో బెదిరిస్తే చాలు సదరు పన్నులు ఒక రోజు ఆలస్యంగా అయినా కడుతుంటారు. అదే కోట్లకు పడగలెత్తిన వారు మాత్రం పన్నులు కట్టేందుకు ముందుకు రావడం లేదు. భవనాలు సీజ్ చేస్తామని, నల్లా కనెక్షన్ కట్ చేస్తామని, భవనాలు స్వాధీనం చేసుకుంటామని... బెదిరించినా బడాబాబులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. దాంతో వారి నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కోట్లాది రూపాయిలు కొండలా పేరుకుపోయాయి. కోట్లలో బకాయిలు పడ్డ పన్నులు వసూలు చేసేందుకు కార్పొరేషన్ ఓ ఐడియాను అమలు చేసింది. ఇందు కోసం 'చెత్త డబ్బా'నే వాడుకుంది. జీహెచ్ఎంసీకి భారీగా బకాయిలు చెల్లించాల్సిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌ల గుమ్మం ముందు ఏకంగా పెద్దపెద్ద చెత్త డబ్బాలను పెట్టింది. దీంతో సిగ్గు పడి కొంతమంది ఈ 'చెత్త' గోల ఎందుకని పన్నులు చెల్లిస్తుంటే...మరికొందరు ఇది మామూలే అని దులిపేసుకుంటున్నారు. దాంతో పన్నుల కోసం వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులను చెత్తడబ్బా కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో నీరసపడిపోతున్నారు. ఇదే విషయంలో పొరుగు రాష్ట్రం తమిళనాడులోని చెన్నై నగర పాలక సంస్థ ఓ అడుగు ముందుకేసింది. మొండి బకాయిల వసూలు కోసం వినూత్న పద్థతిని అమల్లో పెట్టింది. కార్పొరేషన్‌కు పన్ను ఎగవేసిన బడాబాబుల భారీ కాంప్లెక్స్‌లు, ఎస్టేట్ల ఎదుట హిజ్రాలతో గానా భజాన పెట్టింది. దీంతో హిజ్రాల దెబ్బకు దిమ్మదిరిగిన బడాబాబులు పన్ను చెల్లించేందుకు చెన్నై కార్పొరేషన్‌కు క్యూ కడుతున్నారు. పన్నులు కట్టండి అని నయానో భయానో చెప్పిన దారికి రాని బాబులు హిజ్రాల దెబ్బకు దిగిరావడంతో చెన్నై కార్పొరేషన్ అధికారులకు ఆనందం అవధులు లేకుండా పోయింది. దీంతో బడాబాబుల నుంచి పన్నులు వసూళ్ల కోసం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్.. హిజ్రాలను కాంట్రాక్ట్‌పై నియమించినట్లు సమాచారం. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెన్నైలో అమలు చేసిన టెక్నిక్‌ను మనం కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చెత్తడబ్బాతో కాని పని హిజ్రాల దెబ్బతో అయినా పన్నులు వసూలు అయితే చాలనుకుంటున్నారు సదరు అధికారులు. -
ఖాతాల సమాచార మార్పిడికి 46 దేశాలు ఓకే!
కెయిర్న్స్(ఆస్ట్రేలియా): దేశాలు పన్ను చెల్లింపుదారులు, బ్యాంకింగ్ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్న సూచనకు భారత్ మద్దతు పలికింది. నల్లధనం వెలికితీతకు నిధానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. జీ-20 ఆర్థిక మంత్రుల భేటీకి భారత మంత్రి నిర్మలా సీతారామన్ హాజరై మాట్లాడారు. భారత్‌తోపాటు 46 దేశాలు ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. -
ప్రాంతాల వారీగా వివరాల్లేవు
అప్పులు, ఆస్తులపై సర్కారు స్పష్టీకరణ రాజధాని హైదరాబాద్‌లోనే వివిధ రకాల పన్నుల చెల్లింపు కేంద్ర, రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి ప్రాంతాల వారీగా లేదు ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, ప్రస్తుత విలువ ప్రాంతాల వారీగా లేదు జిల్లా ట్రెజరీల వారీగా ఆదాయ, వ్యయాలు రంగారెడ్డి ట్రెజరీ ద్వారా రూ.21064.62 కోట్లు హైదరాబాద్ ట్రెజరీ ద్వారా 15,754.82 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రాంతాల వారీగా అప్పులు, ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఒకే చోట అందుబాటులో లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌గా ఉన్నందున అనేక రకాల పన్నులను వివిధ సంస్థలు హైదరాబాద్ ట్రెజరీ ద్వారానే చెల్లిస్తున్నారని, ఏ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం అనేది ప్రస్తుతం జిల్లా ట్రెజరీల ఆధారంగానే చెప్పగలమని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ లోటు వివరాలకు సంబంధించిన సమాచారం కూడా ప్రాంతాలు, జీహెచ్ఎంసీ వారీగా లేవని రాష్ట్రం మొత్తానికి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో ఆదాయ, వ్యయాలకు సంబంధించి జిల్లా ట్రెజరీల వారీగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సభ్యులకు అందచేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.1,127.9 కోట్ల రెవెన్యూ మిగులు తేలిందని... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి రూ.1,739.91 కోట్ల రెవెన్యూ మిగులు తేలిందని అందులో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 31 డిసెంబర్ నాటికి ట్రెజరీలో నిలిచిన బిల్లుల విలువ రూ.3,941.27 కోట్లని తెలిపింది. అదేవిధంగా గత 55 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ర్ట పెట్టుబడులకు సంబంధించి ప్రాంతాల వారీగా సమాచారం లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, ఆ సంస్థల విలువ ప్రాంతాల వారీగా లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల వరకు రంగారెడ్డి జిల్లా ట్రెజరీ నుంచి అత్యధికంగా రూ.21,064.62 కోట్ల రూపాయల ఆదాయం రాగా హైదరాబాద్ (పట్టణ) ట్రెజరీ నుంచి రూ.15,754.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా వివిధ రంగాలకు చేసిన వ్యయం రూ.20,009.90 కోట్ల రూపాయలు. జిల్లా ట్రెజరీల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 30 వరకు వచ్చిన ఆదాయం, వ్యయాలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యయానికి సంబంధించి ప్రణాళిక, ప్రణాళికేతర కలిసి ఉన్నాయి.