నాలుగేళ్లలో 2,250 కోట్ల డాలర్లు
అమెరికాకు భారత టెక్నాలజీ కంపెనీల పన్ను చెల్లింపులు
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలోనే పన్నులు కూడా చెల్లిస్తున్నాయి. 2011-15 ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ కంపెనీలు 2,250 కోట్ల మేర పన్నులు చెల్లించాయని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీలు 200 కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఆమె పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 4,11,000 ఉద్యోగాలను కల్పించాయని వివరించారు. కాగా అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసాపై 4,000 డాలర్లు, ఎల్1 వీసాపై 4,500 డాలర్ల ప్రత్యేకమైన ఫీజులను విధించింది.