సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విజయం సాధించామని టెలికాం దిగ్గజం వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ 12,000 కోట్లతో పాటు, రూ 7900 కోట్ల పెనాల్టీల చెల్లింపుపై అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉపశమనం లభించిందని పేర్కొంది. వాయుతరంగాల వాడకం, లైసెన్స్ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్ 2016లో సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఆశ్రయించింది. చదవండి : వొడాఫోన్ కొత్త ‘ఐడియా’
వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం మోపిన పన్ను భారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రిబ్యునల్ రూలింగ్ ఇచ్చిందని వొడాఫోన్ పేర్కొంది. ఇక నష్టాలతో సతమతమవుతున్న టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన రూలింగ్ ఊరట కల్పించింది. ప్రభుత్వ బకాయిల చెల్లింపును పదేళ్లలోగా పూర్తిచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం టెలికాం కంపెనీలకు వెసులుబాటు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment