International court
-
పాలస్తీనాకు ఫేవర్‌గా అంతర్జాతీయ కోర్టు.. చరిత్ర ఇదీ అంటూ నెతన్యాహు..
దిహేగ్: పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇప్పుడు ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకోవడం చట్టవిరుద్దమని కోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని కోర్టు ఆదేశించింది.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, పాలస్తీనా అంశంపై తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్ పాలస్తీనా విషయంపై కీలక తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అధీనంలో తీసుకోవడం చట్ట విరుద్ధం. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి వెంటనే వైదొలగాలని పేర్కొంది. అక్కడ కాలనీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ''It is a big blow to Israel as a state, as an establishment, as a government, as settlers.''Palestinian officials welcomed the International Court of Justice’s opinion that called for an end to Israel’s occupation of the Palestinian territories.pic.twitter.com/pIzavp1ZGq— Rachael Swindon #WeAreCollective (@Rachael_Swindon) July 20, 2024 ఇదే సమయంలో 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్రమణలు కరెక్ట్ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే, వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెం ప్రాంతాలపై నియంత్రణ, సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. అన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని మండిపడింది. వెంటనే పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రావాలని ఆదేశించింది.ఇక, అంతర్జాతీయ కోర్టు ఆదేశాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు స్పందించారు. కోర్టు తీర్పు హస్యాస్పదమని ఖండించారు. ఆక్రమిత మూడు ప్రాంతాలు యూదుల చారిత్రాక మాతృభూమిలో భాగమన్నారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టబడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. కోర్టు చారిత్రాక విషయాలను వక్రీకరించింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలోని హమాస్ కీలక నేతలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో దాదాపు 80 మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
కెయిర్న్ వివాద పరిష్కారంపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్‌తో పన్ను వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మెరుగైన మార్గాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించి ట్యాక్సేషన్ విషయంలో భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా, కెయిర్న్‌కు అనుకూలంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడం తప్పు ధోరణులకు దారి తీసే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. భారత విభాగాన్ని గతంలో పునర్వ్యవస్థీకరణ చేసిన కెయిర్న్ దాదాపు రూ. 10,247 కోట్ల మేర పన్నులు, వడ్డీ కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులివ్వడం, కంపెనీకి చెందాల్సిన డివిడెండ్లను.. ట్యాక్స్ రీఫండ్లను జప్తు చేసుకోవడం తెలిసిందే. దీనిపై కెయిర్న్ వివిధ న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు భారత ప్రభుత్వం 1.725 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,600 కోట్లు) చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భారత ప్రభుత్వం సవాలు చేసింది. రికవరీ బాటన పరిశ్రమ: పారిశ్రామిక రంగం రికవరీ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల నేపథ్యంలోనూ పెట్టుబడి ఉపసంహరణసహా బడ్జెట్ ప్రతిపాదనలు అన్నింటినీ అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. -
వొడాఫోన్‌కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్ధానంలో విజయం సాధించామని టెలికాం దిగ్గజం వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ 12,000 కోట్లతో పాటు, రూ 7900 కోట్ల పెనాల్టీల చెల్లింపుపై అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉపశమనం లభించిందని పేర్కొంది. వాయుతరంగాల వాడకం, లైసెన్స్ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్ 2016లో సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఆశ్రయించింది. చదవండి : వొడాఫోన్ కొత్త ‘ఐడియా’ వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం మోపిన పన్ను భారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రిబ్యునల్ రూలింగ్ ఇచ్చిందని వొడాఫోన్ పేర్కొంది. ఇక నష్టాలతో సతమతమవుతున్న టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన రూలింగ్ ఊరట కల్పించింది. ప్రభుత్వ బకాయిల చెల్లింపును పదేళ్లలోగా పూర్తిచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం టెలికాం కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. -
అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు. ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని ఆరోపించారు. ‘మాకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి, మమ్మల్ని బలిపశువులుగా మార్చారు. దీనిపై ఐసీజే జోక్యం చేసుకుని తక్షణమే విచారణ జరపాలి’ అని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు దోషులకు న్యాయపరమైన వెసులుబాటు మార్గాలు ఇంకా మిగిలి ఉండగానే తీహార్ జైలు అధికారులు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష అమలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని దోషుల తరఫున లాయర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన దోషులు ముకేశ్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్‌గుప్తా(25), వినయ్ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఈనెల 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు తలారి పవన్ జల్లాడ్‌ను పంపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ అధికారులకు లేఖ రాశారు. ముకేశ్, పవన్, వినయ్‌లు ఆఖరిసారిగా తమ కుటుంబసభ్యులను ముఖాముఖి కలుసుకున్నారు. అక్షయ్ కుటుంబసభ్యులు కూడా ఒకట్రెండు రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. -
కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్
ఇస్లామాబాద్/జమ్మూ/శ్రీశ్రీనగర్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాక్ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఇటీవల చెప్పారు. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారు. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వెంబడి కృష్ణా ఘటి, మెందర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పాకిస్తాన్ బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో బిహార్‌కు చెందిన రవిరంజన్ సింగ్ (36) మరణించగా నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, బాలాకోట్ దాడుల సమయంలో పాక్ విమానాలను మిగ్–21తో ఎంతో ధైర్యంగా తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్.. భారత సైన్యం కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఆగస్టు 17వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుం డగా నక్యాల్ సెక్టార్లో సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మరణించినట్లు సమాచారం. మిగ్ 21 జెట్ విమానాన్ని కూల్చేయడంతో తప్పించుకున్న అభినందన్‌ను పాక్ సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, జమ్మూ కశ్మీర్లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దాదాపు 15 రోజుల తర్వాత మంగళవారం శ్రీనగర్‌లో వాణిజ్య కేంద్రం లాల్ చౌక్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్‌ను జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకుని తిరిగి ఢిల్లీకి పంపేశారు. -
క్షమాభిక్షపై తేలేవరకూ ఉరి తీయం
జాధవ్ వ్యవహారంపై పాక్ ఇస్లామాబాద్: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను ఉరి తీస్తున్నారన్న వార్తలపై పాకిస్తాన్ స్పందించింది. జాధవ్ క్షమాభిక్ష అభ్యర్థనలపై నిర్ణయం తీసుకొనే వరకూ అతడిని ఉరితీసేది లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకీరియా గురువారం స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ అండతో అక్కడి మీడియా... అంతర్జాతీయ కోర్టులో కేసు గెలిచే లక్ష్యంతో పాక్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. అతడి క్షమాభిక్ష అభ్యర్థనలు ప్రస్తుతం పాక్ అధ్యక్షుడు, ఆర్మీ స్టాఫ్ చీఫ్ వద్ద పరిశీలనకు ఉన్నాయ న్నారు. వీటిపై నిర్ణయం తీసుకొనేవరకూ జాధవ్ జీవించే ఉంటాడన్నారు. దీనిపై అవగాహన లేకుండా ఇరుదేశాల ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. -
భారత్‌పై కూడా అంతర్జాతీయ కోర్టుకెళితే..
కశ్మీర్లో గతనెల అల్లరి మూకల రాళ్లదాడి నుంచి తప్పించుకునేందుకు ఓ కశ్మీరీని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టేసిన సైనిక మేజర్ నితిన్ గొగోయ్‌కి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసాపత్రాన్ని అందజేయడంపై ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ సంఘటనను విమర్శించినందుకు.. రాళ్లు రువ్వే వ్యక్తికి బదులుగా అరుంధతీ రాయ్‌ని ఆ జీపుకు కట్టేసి ఉండాల్సిందని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. యుద్ధాలు, సంఘర్షణల సందర్భంగానే కాకుండా తిరుగుబాటుదారుల అణచివేతలో భాగంగా కూడా ఓ పౌరుడిని మానవ కవచంగా భద్రతా దళాలు ఉపయోగించడం అనైతికమే కాకుండా న్యాయవిరుద్ధం. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (రోమ్ న్యాయ శాసనం), జెనీవా అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం శిక్షార్హమైన నేరం. దీన్ని యుద్ధనేరంగా పరిగణించాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయశాసనం చెబుతోంది. భారతీయుడైన కులభూషణ్ జాదవ్ ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టును భారత్ ఆశ్రయించి ప్రాథమిక విజయాన్ని సాధించిన నేపథ్యంలోనే సైనిక మేజర్ నితిన్‌ను ప్రశంసించడం ఏ మేరకు సబబు. అంతర్జాతీయ కోర్టులో పాక్‌ను మట్టికరిపించామని మురిసిపోతున్న నేపథ్యంలో అరుంధతీరాయ్ లాంటి వాళ్లు ఇదే అంశంపై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయిస్తే దేశం పరువేం గాను! బ్రిటీష్ ఇండియా ఆర్మీ నుంచే భారత దేశ త్రివిధదళాలు పుట్టుకొచ్చినా మన దళాలకు ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో లాగా రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయవని, అసలు రాజకీయాల జోలికే వెళ్లవన్నది ఆ ప్రత్యేకత. అందుకని భారత దళాల దృక్పథాన్ని ‘విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ (వామ్) అని పిలుస్తారు. అందుకనే దేశంలో అక్కడక్కడ జరుగుతున్న తిరుగుబాటు ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం పౌరులను మానవ కవచంగా ఉపయోగించుకున్న సందర్భాలు కశ్మీరు సంఘటన వరకు లేవు. ఇప్పుడు మన సైన్యాలకు రాజకీయ జబ్బు సోకినట్లు ఉంది. అయినా ఓ కశ్మీరీనీ మానవ కవచంగా ఉపయోగించుకోవడం వల్ల సాధించినదేంటి? కశ్మీర్లో అప్పటికీ ఇప్పటికీ ప్రజాందోళనలు పెరిగాయి తప్ప తగ్గలేదే! కశ్మీరీల హృదయాలను గెలుచుకున్నప్పుడే నిజమైన విజయాన్ని సాధించగలం. – ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
పాక్‌కు భంగపాటు
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో విచారణ సాగుతున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మన దేశానికి నైతిక విజయం లభించింది. ఆ కేసులో తుది తీర్పు వెలువరించేంత వరకూ తదుపరి చర్యలేమీ తీసుకోవద్దని ఐసీజే పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఆయనపై గూఢచారిగా అభివర్ణించి, ఉగ్రవాద ఘటనలతో సంబంధము న్నదని అభియోగాలు మోపి హడావుడిగా మరణశిక్ష విధించిన పాకిస్తాన్‌కు న్యాయ స్థానంలో చుక్కెదురు కావడం మన విదేశాంగ శాఖ సమర్ధతకూ, ప్రత్యేకించి సీని యర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనా పటిమకూ లభించిన విజయం. భారత్– పాకిస్తాన్‌లు క్రీడల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడినప్పుడల్లా రెండు దేశాల్లోనూ ఉత్కంఠ, ఉద్రేకాలు పెరుగుతాయి. ఈసారి ఆ పోటీ మైదానాల్లోకాక న్యాయ స్థానంలో జరగడం... ఆ కేసు మన పౌరుడి ప్రాణాలకు సంబంధించింది కావడం కలవరపాటును కూడా కలిగించింది. రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య సమస్య లుండటం వింతేమీ కాదు. కానీ ఆ సమస్యల పర్యవసానంగా వైషమ్యాలు ఏర్ప డటం, అవి అంతకంతకూ జటిలమవుతూ పోవడం భారత్–పాక్‌ల విష యంలోనే కనిపిస్తుంది. రెండు దేశాల్లోని ప్రభుత్వాలూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తే చాలు...సరిహద్దుల్లో కాల్పుల మోతలు మొదలవుతాయి. పాక్‌లోని పౌర ప్రభు త్వం తీసుకునే చొరవను అక్కడి సైన్యం వమ్ము చేస్తుంది. ఈసారి దాని ఎత్తు గడలకు ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్ జాదవ్ బలి పశు వయ్యాడు. ఆయనను పాక్ ఏజెంట్లు అపహరించి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి తీవ్రమైన అభియోగాలు మోపారు. పాక్‌లోని బలూచిస్తాన్‌లో ఆయన ఉగ్ర వాద కార్యకలాపాలు నడిపాడని, పలువురి మృతికి కారకుడయ్యాడని ఆ అభియో గాల సారాంశం. ఈ కేసు విషయంలో పాకిస్తాన్ చర్యలు ఆది నుంచీ నిగూఢంగానే ఉన్నాయి. కుల్‌భూషణ్‌పై మోపిన అభియోగాలను ఒక ప్రకటన ద్వారా వెల్లడించడమే తప్ప అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని బయటపెట్టలేదు. ఆయనకు వ్యతి రేకంగా తమ దగ్గరున్న సాక్ష్యాలేమిటో చెప్పలేదు. మన దేశం కోరినా ఇవ్వలేదు. ఆయన ఒకప్పుడు భారత నావికా దళంలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడని, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడని మన దేశం అంటుంటే ఆయన ఇప్పటికీ నావికాదళ అధికారేనని అది వాదిస్తోంది. ఆయనను కలిసేందుకు మన దౌత్యా ధికారులకు అవకాశం ఇవ్వాలని డజనుసార్లు మన దేశం అర్ధించింది. కానీ పాక్ వినలేదు. విచారణ ప్రక్రియ సైతం అనుమానాలు రేకెత్తించేలా సాగింది. విచారణ జరగడం నిజమో కాదో కూడా తెలియదు. ఇలాంటి గోప్యత ఏ విలువలకూ, ప్రమాణాలకూ అనుగుణమైనదో పాకిస్తాన్‌కే తెలియాలి. కనీసం న్యాయంగా వ్యవహరిస్తున్నట్టు కనబడినా ఇవాళ ఐసీజే ముందు దానికి తలవంపులు తప్పేవి. పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు 1963 నాటి వియన్నా ఒడంబడికకు విరుద్ధమని మన దేశం చేసిన వాదనతో ఐసీజే ఏకీభవించింది. కుల్‌భూషణ్ ఉరి తేదీని ప్రకటించలేదు గనుక ఈ దశలో తాత్కాలిక ఆదేశాలు ఇవ్వనవసరం లేదన్న పాక్ వాదన వీగిపోయింది. నిజానికి ఐసీజే తుది తీర్పు వెలువరించే వరకూ మరణశిక్ష అమలు ఉండదని పాకిస్తాన్ హామీ ఇచ్చి ఉంటే ప్రస్తుత ఆదేశాలు అవసరమయ్యేవి కాదు. ఈ కేసులో పాకిస్తాన్ మరో రకమైన వాదన కూడా చేసింది. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం దేశ భద్రతతో ముడిపడి ఉన్న కేసుల్లోని నిందితులకు దౌత్య అధికారులు కలిసే అవకాశం ఉండదని ఐసీజేకు తెలిపింది. గతంలో తమ దేశ పౌరులు పట్టుబడినప్పుడు భారత్ కూడా ఇలాగే చేసిందని వాదించింది. కానీ మన దేశంలో అలాంటివారిపై వచ్చిన అభియోగా లను పౌర న్యాయస్థానాలు బహిరంగంగా విచారించాయి. పాక్ తీరు ఇందుకు భిన్నం. కుల్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకే రెండు వారాల వ్యవధి తీసుకుంది. దానికి ముందు ఆయనతో ‘ఒప్పుకోలు ప్రకటన’ చేయించింది. న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలం నమోదులోనూ ఎడతెగని జాప్యం చేసింది. ఇదంతా భారత్‌ను కవ్వించడమే. ఈ విషయంలోమన స్పందనేమిటో చూడాలని పాక్ సైన్యం తహతహలాడినట్టుంది. అయితే ఐసీజే ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు మన దేశానికి నైతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. తమ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాల్లో ఐసీజే జోక్యాన్ని అంగీకరించబోమని పాకిస్తాన్ ఇప్పుడు అంటోంది. తనకు వ్యతిరేకమైన తీర్పు వచ్చినాక చేస్తున్న ఈ వాదన వల్ల దెబ్బతినేది ఆ దేశ పరువే. ఆ అభిప్రాయమేదో ముందే చెప్పి ఐసీజే విచారణను బహిష్కరించి ఉంటే వేరుగా ఉండేది. నిజానికి నిరుడు ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించినప్పుడు కుల్‌భూషణ్ ప్రస్తావన తీసుకురానందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్కడి సైనిక అధికారులు విరుచుకుపడ్డారు. తీరా ఐసీజే ముందుకు ఈ కేసు వచ్చినప్పుడు సమర్ధవంతమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యారు. ఇంతకూ ఐసీజే తీర్పు ఇవ్వగలదు తప్ప దాన్ని అమలు చేయించలేదు. అలా అమలు చేయించే అధికారం భద్రతామండలికి ఉన్నా అది అంతర్జాతీయ శాంతి సుస్థిరతలకు భంగం వాటిల్లే సందర్భాల్లో మాత్రమే. ఈ కేసు ఆ పరిధిలోనికి రాదని చెప్పి అది తప్పించుకోవచ్చు. అసలు పాకిస్తానే కేసు విచారణను బేఖాతరు చేయొచ్చు. అమెరికా, చైనాలు అలా చేసిన సందర్భాలున్నాయి. అవి పెద్ద దేశాలు గనుక చెల్లు బాటు అయిందిగానీ పాక్ అలా సాహసించబోదన్న వాదనలున్నాయి. ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో భారత్ తీసుకునే చర్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి న్యాయం కావాలని కోరే నైతిక హక్కు అది కోల్పోతుంది. ఇప్పుడు కుల్‌భూషణ్ సురక్షితంగా వెనక్కి రావడంతోపాటు ఉగ్రవాదం విషయంలో మనపై పాక్ చేస్తున్న వాదనల్లోని డొల్లతనం బయటపడటం కూడా ఎంతో అవసరం. ఈ కేసులో మరింత జాగ్రత్తగా అడుగులేసి విజయం సాధించేందుకు మన న్యాయవాదులు కృషి చేయవలసి ఉంటుంది. -
కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
-
కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం...ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ () మంగళవారం స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు పాక్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించడం, ఆయనను ఉరి తీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. -
భారత్‌ను చూసి నేర్చుకోండి : అమెరికా
వాషింగ్టన్ : సముద్ర జలాలకు సంబంధించిన వివాదాల్లో పొరుగు దేశాలతో భారత్ అనుసరిస్తున్న విధానాన్ని చూసి చైనా నేర్చుకోవాలని అమెరికా సూచించింది. 2014లో భారత్-బంగ్లాదేశ్ మధ్య తలెత్తిన సముద్రసంబంధ వివాదంలో అంతర్జాతీయ కోర్టు బంగ్లాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. దీన్ని భారత్ గౌరవించిన విషయాన్ని గుర్తుచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దేశాలకు సంబంధం లేకుండా.. తీర ప్రాంతంలోని వనరులన్నీ తనవేనంటున్న చైనా.. పొరుగుదేశాల విషయంలో భారత్ అనుసరించే పద్ధతిని గమనించాలని సూచించింది. -
ఆర్ఆర్సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం
1. 2014 కామన్వెల్త్ క్రీడలను ఏ దేశంలో నిర్వహించారు? 1) ఆస్ట్రేలియా 2) కెనడా 3) దక్షిణాఫ్రికా 4) స్కాట్లాండ్ 2. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంత మంది న్యాయమూర్తులు ఉంటారు? 1) 10 2) 15 3) 30 4) 25 3. రెడ్‌క్రాస్ సంస్థను ఎవరు ప్రారంభించారు? 1) హెన్రీ డ్యునాంట్ 2) పీటర్ బెన్సన్ 3) ఐసన్ హోవర్ 4) మదర్ థెరిసా 4. ‘యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’ పుస్తక రచయిత ఎవరు? 1) రవీంద్రనాథ్ ఠాగూర్ 2) అరబిందో ఘోష్ 3) బాలగంగాధర్ తిలక్ 4) సర్వేపల్లి రాధాకృష్ణన్ 5. శిలీంద్రాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? 1) ఫైకాలజీ 2) మైకాలజీ 3) కాంకాలజీ 4) టాక్సికాలజీ 6. ‘హిరోషిమా డే’ను ఏ తేదీన నిర్వహిస్తారు? 1) ఆగస్ట్ - 6 2) ఆగస్ట్ - 8 3) ఆగస్ట్ - 9 4) ఆగస్ట్ - 12 7. {పపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1) న్యూయార్క 2) రోమ్ 3) వియన్నా 4) జెనీవా 8. కిందివాటిలో మిలిటరీ కూటమి ఏది? 1) కామన్వెల్త్ 2) అలీనోద్యమ కూటమి 3) నాటో 4) జీ - 8 9. కిందివాటిలో ద్రాక్షతోటల పెంపకానికి సంబంధించింది? 1) ఎపికల్చర్ 2) వర్మికల్చర్ 3) సెరికల్చర్ 4) విటికల్చర్ 10. కిందివాటిలో సబ్‌సోనిక్ క్షిపణి ఏది? 1) నిర్భయ్ 2) బ్రహ్మోస్ 3) శౌర్య 4) అస్త్ర 11. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడెవరు? 1) సి.వి. రామన్ 2) హరగోవింద్ ఖురానా 3) వెంకట్రామన్ రామకృష్ణన్ 4) ఏదీకాదు 12. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2013లో ఎవరికి లభించింది? 1) ప్రాణ్ 2) వి.కె. మూర్తి 3) డి. రామానాయుడు 4) గుల్జార్ 13. 2015 జూలైలో బ్రిక్స్ ఏడో సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు? 1) బ్రెజిల్ 2) ఇండియా 3) రష్యా 4) చైనా 14. కీవ్ అనేది ఏ దేశ రాజధాని నగరం? 1) సెర్బియా 2) సిరియా 3) క్రొయేషియా 4) ఉక్రెయిన్ 15. 2014లో జరిగిన ఏ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించింది? 1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) వింబుల్డన్ 3) యూఎస్ ఓపెన్ 4) ఏదీకాదు 16. విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? 1) హాకీ 2) క్రికెట్ 3) టెన్నిస్ 4) టేబుల్ టెన్నిస్ 17. సెంట్రల్ రైస్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? 1) కటక్ 2) హైదరాబాద్ 3) నాగ్‌పూర్ 4) కోల్‌కతా 18. కిలిమంజారో పర్వత శిఖరం ఏ ఖండంలో ఉంది? 1) ఆసియా 2) ఆఫ్రికా 3) దక్షిణ అమెరికా 4) ఉత్తర అమెరికా 19. కింద పేర్కొన్నవారిలో రెండుసార్లు రాష్ట్రపతిగా పనిచేసిందెవరు? 1) సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) జాకీర్ హుస్సేన్ 3) వి.వి. గిరి 4) బాబూ రాజేంద్రప్రసాద్ 20. ఆరుగురు మిత్రుల్లో ఐదుగురి సరాసరి ఖర్చు *40. ఆరో వ్యక్తి ఖర్చు ఆరుగురి మిత్రుల సరాసరి ఖర్చు కంటే *50 ఎక్కువ. అయితే ఆరుగురి మిత్రుల మొత్తం ఖర్చు ఎంత? 1) * 290 2) * 300 3) * 310 4) * 400 21. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 200 మార్కులు రావడం వల్ల 40 మార్కు లతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షను మొత్తం ఎన్ని మార్కులకు నిర్వహించారు? 1) 400 2) 500 3) 600 4) కనుగొనలేం 22. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. వాటి గ.సా.భా. 6. వాటి క.సా.గు. ఎంత? 1) 1 2) 12 3) 48 4) 72 23. తండ్రి ప్రస్తుత వయసు కొడుకు వయసుకు 5 రెట్లు. మూడేళ్ల కిందట తండ్రి వయసు కొడుకు వయసుకు 7 రెట్లు. అయితే తండ్రి ప్రస్తుత వయసెంత? 1) 45 ఏళ్లు 2) 42 ఏళ్లు 3) 40 ఏళ్లు 4) 55 ఏళ్లు 24. అ ఒక పనిని 12 రోజుల్లో ఆ అదేపనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. వారిద్దరూ కలిసి పని ప్రారంభించిన 6 రోజుల తర్వాత అ తప్పుకున్నాడు. మిగిలిన పనిని ఆ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 1) 1 2) 2 3) 4 4) 8 25. 250 మీ. పొడవున్న రైలు 90 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తోంది. అది 150 మీ. పొడవున్న ప్లాట్ఫారంను ఎంత సమ యంలో దాటుతుంది? 1) 8 సెకన్లు 2) 10 సెకన్లు 3) 12 సెకన్లు 4) 16 సెకన్లు 26. ఒక వ్యక్తి వస్తువులను కొన్నధరకే అమ్ము తున్నాడు. కానీ తూకం కిలోగ్రాముకు బదు లుగా 800 గ్రాముల సరుకునే ఇస్తున్నాడు. అయితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 20 2) 25 3) 162/3 4) 121/4 27. అ, ఆ, ఇలు వరుసగా *40,000, *50,000, *60,000ల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ సంవత్స రం చివరన వారికి * 45,000 లాభం వస్తే అందులో అ వాటా ఎంత? 1) * 12,000 2) * 16,000 3) * 24,000 4) * 28,000 28. *2,000 అసలు.. సంవత్సరానికి 10 శాతం చక్రవడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాల్లో * 2662ల మొత్తం అవుతుంది? 1) 4 2) 3 3) 2 4) 1 29. ఒక పడవ 160 కి.మీ. దూరాన్ని ప్రవా హదిశలో 2 గంటలు, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 4 గంటలు ప్రయాణించింది. నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? 1) 20 కి.మీ./గం. 2) 30 కి.మీ./గం. 3) 40 కి.మీ./గం. 4) 60 కి.మీ./గం. 30. నలుగురు వ్యక్తుల బృందంలో 60 కి.గ్రా. బరువున్న ఒక వ్యక్తి బయటకు వెళ్లి, అతడి స్థానంలో కొత్త వ్యక్తి వచ్చాడు. దీంతో వారి సరాసరి బరువు 2కి.గ్రా. పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువెంత? 1) 60 కి.గ్రా. 2) 62 కి.గ్రా. 3) 66 కి.గ్రా. 4) 68 కి.గ్రా. 31. ఒక చతురస్ర వైశాల్యం 6050 చ.మీ. దాని కర్ణం పొడవు ఎంత? 1) 98.99 మీ. 2) 110 మీ. 3) 116 మీ. 4) చెప్పలేం 32. 28 ÷ 4+ 5 *2 – 7= ? 1) 0.78 2) 2 3) 10 4) 12 33. 16 *15 ÷4 + 7 – 5 = ? 1) 62 2) 36 3) 54 4) 24.25 34. A, B, D, G, K,? 1) M 2) N 3) O 4) P 35. అ ఒక పనిని 3 రోజుల్లో, ఆ అదే పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తిచేయడం వల్ల వారికి * 500 వస్తే అందులో అ వాటా ఎంత? 1) * 200 2) * 250 3) * 300 4) చెప్పలేం 36. రెండు సంఖ్యల క.సా.గు. 64. అయితే కిందివాటిలో ఆ రెండు సంఖ్యల గ.సా.భా. ఏది కాకపోవచ్చు? 1) 4 2) 8 3) 12 4) 16 37. 10 వస్తువుల కొన్నవెల, 8 వస్తువుల అమ్మిన వెలకు సమానం. అయితే ఎంత శాతం లాభం/నష్టం వస్తుంది? 1) 20 % లాభం 2) 25 % లాభం 3) 20 % నష్టం 4) 25 % నష్టం 38. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 40,000. ఏటా 5 శాతం జనాభా పెరిగితే రెండేళ్ల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? 1) 44,100 2) 44000 3) 42000 4) 41400 39. ఒక వృత్తం వైశాల్యం 616 చ.మీ. దాని చుట్టుకొలత ఎంత? 1) 44 మీ. 2) 88 మీ. 3) 96 మీ. 4) 172 మీ. 40. అతి పెద్ద పుష్పం ఏది? 1) లిమ్నా 2) ఉల్ఫియా 3) రఫ్లీషియా 4) అరటి 41. ఫర్నీచర్‌ను తయారు చేసేందుకు ఉపయో గించే గడ్డి జాతి? 1) వరి 2) గోధుమ 3) మొక్కజొన్న 4) వెదురు 42. జంతు రాజ్యంలో అతి పెద్ద వర్గం (ఫైలా)? 1) మొలస్కా 2) ఆర్థ్రోపొడా 3) అనిలిడా 4) సరీసృపాలు 43. ఒక వ్యక్తి రక్తంలో యాంటీజెన్స ఆ, యాంటీ బాడీస్ అ ఉన్నట్లయితే, అది ఏ రక్త వర్గం? 1) A 2) O 3) B 4) AB 44. ఆకుకూరలను ఎక్కువగా ఉడికిస్తే కోల్పోయే విటమిన్? 1) విటమిన్-B1 2) ఫాంటోథినిక్ ఆమ్లం 3) C 4) ఫోలిక్ ఆమ్లం 45. గుడ్లు పెట్టి పాలిచ్చే జీవి? 1) ప్లాటిపస్ 2) కంగారు 3) పెంగ్విన్ 4) ఒరంగుటాన్ 46. కపాలంలో ఉండే ఎముకల సంఖ్య? 1) 14 2) 206 3) 8 4) 22 47. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి? 1) పిట్యూటరీ 2) కాలేయం 3) అధివృక్క 4) గోనాడ్స 48. మానవుడు ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? 1) 10 2) 32 3) 18 4) 26 49. పక్షులు ఎగరడానికి తోడ్పడే అంశం? 1) వాయు పూరిత ఎముకలు 2) ఉడ్డయక కండరాలు 3) దేహ నిర్మాణం 4) 1, 2 50. నీలిమందు దేని నుంచి లభిస్తుంది? 1) ఇండిగో ఫెరా 2) సింఖోనా 3) క్రిసాంథియం 4) కలమంద 51. కిందివాటిలో పశ్చిమం వైపునకు ప్రవహిం చని నది? 1) నర్మదా 2) సబర్మతి 3) మహానది 4) తపతి 52. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ ఎక్కడ ఉంది? 1) డెహ్రాడూన్ 2) కోల్‌కతా 3) ముంబయి 4) పనాజీ 53. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఏ తీర ప్రాంతంలో ముందుగా ప్రవేశిస్తాయి? 1) కొంకణ్ తీరం 2) సర్కార్ తీరం 3) కోరమాండల్ తీరం 4) మలబార్ తీరం 54. భారతదేశంలో మొదటిదైన ‘శివసముద్రం’ జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? 1) శరావతి 2) కావేరి 3) మహానది 4) తపతి 55. సూర్యుడు, భూమికి మధ్య దూరం గరిష్టంగా ఉండే రోజు? 1) జూలై 4 2) జనవరి 20 3) సెప్టెంబర్ 22 4) డిసెంబర్ 22 56. ఆర్థ్రత (ఏఠఝజీఛీజ్టీడ)ను కొలిచే పరికరం? 1) భారమితి 2) థర్మామీటర్ 3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్ 57. భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగా రాన్ని 1904లో ఎక్కడ నిర్మించారు? 1) కోల్‌కతా 2) ముంబయి 3) సూరత్ 4) చెన్నై 58. రోజ్‌వుడ్, ఎబోని, మహాగని లాంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? 1) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 2) ఉష్ణమండల సతత హరిత అడవులు 3) మధ్యధరా అడవులు 4) శృంగాకార అడవులు 59. భారతదేశంలోని పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? 1) భంగర్ 2) ఖాదర్ 3) బాబర్ 4) టెరాయ్ 60. ‘గొప్ప జనాభా విభాజక సంవత్సరం’ ఏది? 1) 1933 2) 1921 3) 1936 4) 1951 61. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని ఏ ప్రాంతా న్ని పిలుస్తారు? 1) కావేరి డెల్టా ప్రాంతం 2) మహానది డెల్టా ప్రాంతం 3) సువర్ణ రేఖా డెల్టా ప్రాంతం 4) కృష్ణా - గోదావరి డెల్టా ప్రాంతం 62. భారతదేశ మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏది? 1) శ్రీహరికోట 2) తుంబ 3) త్రివేండ్రం 4) బెంగళూరు 63. రాజస్థాన్‌లోని ‘ఖేత్రి’ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి? 1) యురేనియం 2) అల్యూమినియం 3) రాగి 4) బంగారం 64. దేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఏది? 1) 1వ నెంబర్ 2) 9వ నెంబర్ 3) 5వ నెంబర్ 4) 7వ నెంబర్ 65. చంద్రకాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం? 1) 8 నిమిషాలు 2) 4 నిమిషాలు 3) 24 గంటలు 4) 1.3 సెకన్లు 66. స్వదేశీ ఉద్యమం ఏ ఉద్యమంలో భాగంగా ప్రారంభమైంది? 1) శాసనోల్లంఘన ఉద్యమం 2) సహాయ నిరాకరణోద్యమం 3) వందేమాతర ఉద్యమం 4) క్విట్ ఇండియా ఉద్యమం 67. అద్వైతాన్ని ప్రచారం చేసిన భక్తి ఉద్యమ కారుడు? 1) రామానందుడు 2) శంకరాచార్యులు 3) రామానుజాచార్యులు 4) మధ్వాచార్యులు 68. ఏకశిలా దేవాలయాలను నిర్మించిన రాజ వంశం? 1) పల్లవులు 2) గుప్తులు 3) కాకతీయులు 4) శాతవాహనులు 69. రైత్వారీ పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టిన వారెవరు? 1) అక్బర్ 2) షేర్షా 3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) బాల్బన్ 70. ‘మదర్’ పుస్తక రచయిత? 1) సరోజిని నాయుడు 2) మదర్ థెరిసా 3) మాక్సింగోర్కి 4) రవీంద్రనాథ్ ఠాగూర్ 71. {పధానమంత్రి పదవికి కనీస అర్హతా వయసు ఎంత? 1) 21 ఏళ్లు 2) 25 ఏళ్లు 3) 30 ఏళ్లు 4) 35 ఏళ్లు 72. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేవారు? 1) లోక్‌సభ స్పీకర్ 2) రాజ్యసభ స్పీకర్ 3) ప్రధానమంత్రి 4) రాష్ట్రపతి 73. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం గురించి ఏ రాజ్యాంగ ప్రకరణ లో పేర్కొన్నారు? 1) 352 2) 356 3) 360 4) 362 74. మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ? 1) బల్వంత్రాయ్ మెహతా కమిటీ 2) అశోక్ మెహతా కమిటీ 3) సర్కారియా కమిటీ 4) పైవన్నీ 75. సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు? 1) 2005 2) 2006 3) 2007 4) 2008 76. ‘యునెటైడ్ నేషన్స ఆర్గనైజేషన్ డే’ను ఏ రోజున నిర్వహిస్తారు? 1) జనవరి 24 2) డిసెంబర్ 24 3) అక్టోబర్ 24 4) మే 24 77. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? 1) న్యూయార్క 2) వాషింగ్టన్ 3) జెనీవా 4) టోక్యో 78. వ్యాట్ (VAT) అంటే? 1) విలువ ఆధారిత పన్ను 2) విలువతో కూడిన పన్ను 3) బ్యాంకు లావాదేవీలపై విధించే అద నపు రుసుం 4) అమ్మకం పన్నుపై వేసే సర్‌చార్జీ 79. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉన్నదేది? 1) హర్యానా 2) కేరళ 3) మహారాష్ట్ర 4) కర్ణాటక 80. ఏ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతుంది? 1) కార్పొరేషన్ పన్ను 2) ఆదాయ పన్ను 3) ఎక్సైజ్ పన్ను 4) కస్టమ్స్ పన్ను 81. {పస్తుతం అమల్లో ఉన్న (12వ) పంచవర్ష ప్రణాళిక కాలం? 1) 2007-12 2) 2009-14 3) 2010-15 4) 2012-17 82. NABARDపూర్తి రూపం? 1) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 2) నేషనల్ అసెస్మెంట్ బోర్డ ఫర్ అకడ మిక్ అండ్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ 3) నేషనల్ అకడమిక్ బోర్డ ఫర్ అగ్రికల్చ రల్ రీసెర్చ డెవలప్మెంట్ 4) నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ అసెస్మెంట్ అండ్ రికన్స్ట్రక్షన్ 83. డ్వాక్రా ప్రధాన లక్ష్యమేమిటి? 1) స్త్రీలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం 2) మహిళా సాధికారత సాధించడం 3) మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో ఐక్యతను పెంపొందించడం 4) మహిళల్లో నిరుద్యోగాన్ని నిర్మూ లించడం 84. భూమి సహజ ఉపగ్రహం? 1) బుధుడు 2) ఆర్యభట్ట 3) చంద్రుడు 4) పాలపుంత 85. బంగారం సాంద్రత (గ్రా/సెం.మీ3లలో)? 1) 8.9 2) 0.8 3) 13.6 4) 19.3 86. హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రం ఆధా రంగా పనిచేస్తాయి? 1) పాస్కల్ 2) ఆర్కిమెడిస్ 3) బాయిల్ 4) బెర్నౌలీ సూత్రం 87. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం? 1) ఆల్టీమీటర్ 2) లాక్టోమీటర్ 3) బారో మీటర్ 4) హైగ్రోమీటర్ 88. ఒక రోగి ఉష్ణోగ్రత 102°F. సెల్సియస్ మానంలో దీని విలువ ఎంత? 1) 42.3 °C 2) 38.8 °C 3) 36.8 °C 4) 43.2 °C 89. తిర్యక్ తరంగాలకు ఉదాహరణ? 1) తీగలపై ఏర్పడే తరంగాలు 2) కాంతి తరంగాలు 3) ధ్వని తరంగాలు 4) 1, 2 90. ఈఎన్టీ వైద్యులు ఏ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు? 1) కుంభాకార 2) పుటాకార 3) సమతల 4) వాలు దర్పణాలు 91. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి. 1) క్రోమియం 2) కోబాల్ట్ 3) నికెల్ 4) ఉక్కు 92. టెలిఫోన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? 1) మార్కోని 2) గ్రాహంబెల్ 3) బయర్డ 4) రాంట్జన్ 93. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు? 1) ఆల్కహాల్ 2) భారజలం 3) బోరాన్ 4) యురేనియం 94. తినే సోడా ఫార్ములా? 1) Na2CO3 2) Na2SO4 3) NaHCO3 4) NaOH 95. ఇసుక (సిలికా) అణుభారం? 1) 80 2) 40 3) 60 4) 100 96. {పొడ్యూసర్ వాయువు సంఘటనం? 1) CO + H2 2) CO + H2 + N2 3) CO + N2 4) ఏదీకాదు 97. కిందివాటిలో పాలీ శాకరైడ్? 1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్ 3) స్టార్‌చ 4) మాల్టోజ్ 98. అత్యంత స్థిరమైన సల్ఫర్ రూపాంతరం? 1) రాంబిక్ సల్ఫర్ 2) మోనోక్లినిక్ 3) ప్లాస్టిక్ 4) ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ 99. స్పర్శా విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది? 1) Ni 2) Fe 3) V2O5 4) Mo 100. వేరు బొడిపెలు కలిగి నత్రజని స్థాపన చేయగలిగే మొక్క? 1) మొక్క జొన్న 2) చిక్కుడు 3) వరి 4) వెదురు