భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను ఉరి తీస్తున్నారన్న వార్తలపై పాకిస్తాన్ స్పందించింది.
భారత ప్రభుత్వ అండతో అక్కడి మీడియా... అంతర్జాతీయ కోర్టులో కేసు గెలిచే లక్ష్యంతో పాక్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. అతడి క్షమాభిక్ష అభ్యర్థనలు ప్రస్తుతం పాక్ అధ్యక్షుడు, ఆర్మీ స్టాఫ్ చీఫ్ వద్ద పరిశీలనకు ఉన్నాయ న్నారు. వీటిపై నిర్ణయం తీసుకొనేవరకూ జాధవ్ జీవించే ఉంటాడన్నారు. దీనిపై అవగాహన లేకుండా ఇరుదేశాల ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.