కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం...ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ () మంగళవారం స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు పాక్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించడం, ఆయనను ఉరి తీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే.