Kulbhushan Jadhav
-
కుల్‌భూషణ్‌కు కోర్టులో ఊరట
ఇస్లామాబాద్: మరణశిక్ష పడి, పాకిస్తాన్ జైల్లో మగ్గుతోన్న కుల్‌భూషణ్ జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవడానికి, భారత్‌కి మరో అవకాశం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షని సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణకు చేపట్టింది. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది.కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని భారత్‌కు తెలపాలని ఈ కేసుని అక్టోబర్ 3కి వాయిదా వేసింది. -
కుల్‌భూషణ్ కేసు: లాయర్‌ను నియమించొచ్చు
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ను ఆ దేశ హైకోర్టు సోమవారం విచారించింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అంతేగాక పాక్ సమర్పించిన రివ్యూ పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ గురువారం విచారిస్తుందని కోర్టు తెలిపింది. అనంతరం పాక్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు భారత్‌కు అనుమతినిచ్చింది. (అడుగడుగునా అడ్డుకున్నారు) కోర్టు రెండు ఆప్షన్స్ ఇచ్చింది. మేం కులభూషణ్ తరఫున న్యాయవాదిని మార్చవచ్చు. లేదా భారత్ అతడి తరఫున ఒక న్యాయవాదిని నియమించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. అయితే కేవలం పాక్ న్యాయవాదులను మాత్రమే నియమించుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. మా దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్నవారిని మాత్రమే కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిగా నియమించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతానికి భారత న్యాయ ప్రతినిధి ఇంకా ఎవరినీ నియమించలేదు. ఏం జరగనుందో చూడాలి’ అని తెలిపారు. కాగా, కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించాలని కోరుతూ పాక్ జూలై 22న ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు భారత ప్రభుత్వంతో సహా ప్రధాన పార్టీలను పాక్ సంప్రదించలేదు. -
అడుగడుగునా అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలుసుకునేందుకు తమ దౌత్యాధికారులకు స్వేచ్ఛాయుత, బేషరతు అనుమతి ఇవ్వలేదని భారత్ గురువారం ఆరోపించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శించింది. జాధవ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని తెలిపింది. దాంతో, పాక్ ఇచ్చిన దౌత్య అనుమతి అర్థరహితంగా మారిందని పేర్కొంటూ ఆ అధికారులు తమ నిరసనను అక్కడే వ్యక్తం చేశారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘జాధవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకున్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా పాక్ అధికారులు ఆ ప్రదేశానికి అత్యంత సమీపంలో ఉన్నారు. బెదిరించే ధోరణిలో వారు ప్రవర్తించారు. భారతీయ అధికారులు నిరసన తెలిపినా వారు పట్టించుకోలేదు. దాంతో జాధవ్‌తో స్వేచ్ఛగా సంభాషించే వీలు లభించలేదు. అదీకాకుండా, జాధవ్‌తో భారత అధికారుల సంభాషణను రికార్డు చేశారు. అందుకు అక్కడే ఉన్న కెమెరానే సాక్ష్యం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వివరించారు. పాకిస్థాన్ సైనిక కోర్టు జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఈ నెల 20 వరకు మాత్రమే గడువున్న తరుణంలో గురువారం సాయంత్రం జాదవ్‌ను కలుసుకోవడానికి భారత అధికారులకు పాక్ అనుమతించింది. పాకిస్తాన్ మిలటరీ కస్టడీలో ఉన్న జాదవ్‌ను కలుసుకున్న అధికారులు రెండు గంటల సేపు చర్చించారు. రివ్యూ పిటిషన్‌కు సంబంధించి ఆయన నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుందామని భావిస్తే అక్కడి అధికారులు అడ్డుపడ్డారని శ్రీవాస్తవ తెలిపారు. -
కుల్‌భూషణ్ కేసులో పాక్ కొత్త కుట్ర
ఇస్లామాబాద్: ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ యాదవ్ కేసులో పాకిస్తాన్ కొత్త కుట్రకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఆయన తన కేసులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి నిరాకరించారని పేర్కొంది. అంతేకాక పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌తోనే ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారని పాక్ ప్రభుత్వం తెలిపింది. జూన్ 17న కుల్‌భూషణ్‌ను రివ్యూ పిటిషన్ వేసుకోవాల్సిందిగా ఆహ్వానించామని.. అందుకు ఆయన నిరాకరించారని పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ తెలిపారు. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు పాక్ మీడియా బుధవారం (జులై 8) వెల్లడించింది. ఆయనపై మోపిన ఆరోపణలు, విధించిన మరణశిక్షను పున:సమీక్షించడానికి అవకాశం కల్పించగా.. న్యాయపరంగా తన హక్కులను దృష్టిలో ఉంచుకొని రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఆయన తిరస్కరించారని పాక్ మీడియా తెలిపింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ బలగాలు కుల్భుషణ్ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్ ఫిర్యాదు చేసింది.(మౌనం వీడని శాంతి కపోతం) దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ 2019 జులై 17న తీర్పు చెప్పింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. దీంతో భారత్‌లో ఆశలు చిగురించాయి.16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని గతంలో పాక్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. -
జాధవ్‌ను కలిసిన భారత రాయబారి
న్యూఢిల్లీ: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను భారత సీనియర్ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాన్సులర్ అనుమతి లభించడంతో ఓ భారత దౌత్యాధికారి సోమవారం జాధవ్‌ను కలిశారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. అయితే, జాధవ్‌ను కలిసిన దౌత్యాధికారి ఎవరు? వారు ఎక్కడ సమావేశమయ్యారనే వివరాలు వెల్లడించలేదు. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు పాక్ విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. -
జాధవ్‌ను కలిసేందుకు పాక్ అనుమతి
ఇస్లామాబాద్: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను దౌత్యాధికారులు కలుసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ‘కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయమై చర్చలు జరిగిన ఆరు నెలల తర్వాత పాక్ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం భారత దౌత్యాధికారులు జాదవ్‌ను కలుసుకోనున్నారు. -
కులభూషణ్ జాధవ్ కేసు: పాక్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తమ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు రాయబార అనుమతిని ఇస్తామంటూ దాయాది పాకిస్థాన్ గురువారం వెల్లడించింది. ఆగస్టు 2న కులభూషణ్‌ను కలిసేందుకు భారత్ అధికారులకు కాన్సులర్ యాక్సెస్ ఇస్తామని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై భారత్ జవాబు ఇవ్వాల్సి ఉంది. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు భారత్‌కు కాన్సులర్ అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు కాన్సులర్ అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మున్సిపల్ ఎన్నికలు అంత త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నిచింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిల్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలకు ఇంకా 109 రోజులు గడువు ఉన్నా.. ఇప్పుడే ఎందుకంత హడావుడి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి లోక్‌సభలో నొక్కి చెప్పారు. ఆయన గురువారం లోక్‌సభలో హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ గురువారం మరణించారు. మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి.. -
ఉరి.. సరి కాదు
ద హేగ్: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విజయం. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్ పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 21నే కోర్టు రిజర్వ్‌లో ఉంచి బుధవారం వెలువరించింది. ఇండియా తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ‘నిర్బంధంలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు న్యాయపరమైన సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘జాధవ్ కేసులో భారత విధానం సరైనదేనని ఈ చరిత్రాత్మక తీర్పు స్పష్టం చేస్తోంది. జాధవ్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయించి భారత్‌కు తీసుకొచ్చేందుకు మేం మా పనిని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.. జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించగా, ఆ శిక్ష అమలును నిలిపివేయాలంటూ భారత్ ఐసీజేను ఆశ్రయించడం తెలిసిందే. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోకి జాధవ్ ఇరాన్ నుంచి ప్రవేశించారనీ, 2016 మార్చి 3న ఆయనను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయనీ, జాధవ్ గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేది పాక్ వాదన. అయితే ఈ అంశంలో భారత్ వాదన మరోలా ఉంది. నౌకాదళం నుంచి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం జాధవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా, పాక్ అక్కడి నుంచి ఆయనను అపహరించి బలూచిస్తాన్‌కు తీసుకొచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. సైనిక కోర్టులో రహస్య విచారణ జరిపిన అనంతరం 2017 ఏప్రిల్‌లో పాక్ ఆయనకు మరణ శిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది మే నెలలో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తుది తీర్పు చెప్పే వరకు జాధవ్‌కు శిక్ష అమలును నిలిపివేయాలని అప్పట్లో ఐసీజే మధ్యంతర తీర్పు చెప్పింది. తర్వాత 2017 డిసెంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి పాక్ అనుమతి ఇచ్చింది. భారత్‌కు భారీ విజయం: బీజేపీ నేతలు జాధవ్ కేసులో ఐసీజేలో భారత్‌కు భారీ విజయం లభించిందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఐసీజే తీర్పు భారత్‌కు లభించిన భారీ విజయం’ అని రాజ్‌నాథ్ అన్నారు. జాధవ్ కుటుంబ సభ్యలకు త్వరలోనే తగిన పరిహారం దక్కుతుందని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తీర్పు తమకు లభించిన విజయమని పాక్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ ‘అలా అనుకోవడం మీ తప్పు కాదు. ఎందుకంటే తీర్పును ఇంగ్లీష్‌లో చెప్పారు కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు ఐసీజే తీర్పును స్వాగతించారు. మూడేళ్ల నాలుగు నెలలుగా... ► 2016, మార్చి 3: కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు. ► మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్. ► మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన. ► మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్. ► 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు. ► మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్. ► మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే. ► మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్. ► మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే. ► జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి. ► నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్. ► డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి. ► 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే. ► ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే. ► జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు. సిగ్గరి.. మంచివాడు కులభూషణ్‌పై అనెవాది గ్రామస్థుల భావన మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు. కుల్‌భూషణ్ బిడియంతో ఉండేవాడనీ, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదని, తనపనేదో తాను చూసుకునే వాడని అనెవాది గ్రామస్థులు అంటున్నారు. ఏటా రెండు సార్లు స్వగ్రామానికి వచ్చేవాడనీ, రోజులో ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేవాడని వారు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకునే కుల్‌భూషణ్ పట్ల అందరికీ సదభిప్రాయమే ఉంది. కుల్‌భూషణ్ చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేవాడని ఆయన బాల్య స్నేహితుడు తులసీరామ్ పవార్ చెప్పారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ ముందుకెళ్లేవాడని ప్రశంసించారు. నౌకాదళం నుంచి కుల్‌భూషణ్ పదవీ విరమణ చేశాక ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని వారు అంటున్నారు. జాధవ్‌ను అన్యాయంగా నిర్బంధించిన పాక్, ఆయనకు ఉరి శిక్ష విధించడం ఎంత మాత్రమూ సరికాదని అనెవాది గ్రామస్థులంటున్నారు. భారత్‌కు ఒక్క రూపాయి, పాక్‌కు 20 కోట్లు ఐసీజేలో తమ వాదనలు వినిపించేందుకు భారత్ కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టగా, పాక్ ఇందుకు రూ. 20 కోట్లు వ్యయం చేసింది. ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుటున్నారని 2017 మే 15న నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సత్యం, న్యాయం నిలిచాయి: మోదీ కుల్‌భూషణ్ జాధవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పును ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. సత్యం, న్యాయం నిలిచాయని మోదీ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడి సంక్షేమం, భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని మోదీ వెల్లడించారు. ‘ఐసీజే ఈ రోజు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తాం. న్యాయం, సత్యం నిలిచాయి. వాస్తవాలను విస్తృతంగా పరిశీలించి ఈ తీర్పు చెప్పినందుకు ఐసీజేకు అభినందనలు’ అని మోదీ బుధవారం ఓ ట్వీట్లో తెలిపారు. జాధవ్‌కు తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్దోషిగా తేల్చలేదు: పాక్ ఐసీజే ఇచ్చిన తీర్పు పాక్‌కే అనుకూలంగా ఉందని ఆ దేశం అంటోంది. తాము ఇప్పుడు ఐసీజే తీర్పును అనుసరించి చట్టం ప్రకారం ముందుకెళ్తామని పాక్ వెల్లడించింది. పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘అంతర్జాతీయ సమాజంలో బాధ్యత గల సభ్యదేశంగా ఈ కేసులో తొలి నుంచీ మా వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. కోర్టు తీర్పును విన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు చట్టం ప్రకారం ముందుకెళ్తుంది. జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించాలనీ, విడుదల చేయాలని భారత్ ఐసీజేలో కోరింది. కానీ భారత వాదనను ఐసీజే పట్టించుకోకుండా, కేవలం పాక్ విధించిన మరణశిక్షను, జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని పునఃసమీక్షించాలని మాత్రమే తీర్పు చెప్పింది. వీసా లేకుండా, భారత పాస్పోర్టుతో, హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారుపేరుతో జాధవ్ పాక్‌లోకి ప్రవేశించారని మేం పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొంది. పాకిస్తాన్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ ‘పునఃసమీక్షలు పూర్తయ్యే వరకే జాధవ్‌కు మరణ శిక్ష అమలు చేయకుండా ఉండేలా పాక్‌ను ఐసీజే నివారించింది. ఈ తీర్పు పాక్‌కి అనుకూలంగా ఉంది. కేవలం జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించలేదన్న విషయంలో మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఈ తీర్పు ఉంది. మిగిలిన అన్ని అంశాలు/కోణాల్లోనూ భారత్ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. పునఃసమీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే మరణ శిక్ష అమలుకాదు’ అని పేర్కొన్నారు. ముంబైలో స్వీట్లు తినిపించుకుంటున్న జాదవ్ స్నేహితులు -
జాధవ్ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కులభూషన్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్ గెలుపుపై ప్రధానితో సహ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ వేదికపై భారత్ గెలుపులో ఆ కేసును వాదించిన భారత న్యాయవాది హరీష్ సాల్వే కృషి వర్ణించలేనిది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఐసీజేని ఆశ్రయించింది. భారత పిటిషన్‌ను స్వీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం పలుమార్లు ఇరు దేశాల వాదనలను విన్నది. అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం భారత్ తరఫున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే.. పాక్ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. అంతేకాదు కులభూషన్ జాదవ్ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుధీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్ పైచేయి సాధించింది. పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని తీర్పు వెలువరించింది. అయితే సాల్వే గురించి మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుష్మాస్వరాజ్ ట్విట్లో వెల్లడించారు. దీనిపై ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ఇప్పటికే సుష్మాస్వరాజ్ ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా సరే అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారిని బయటకు పంపివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు సవరించిన ప్రతిపాదనలు అందలేదని పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్ చేజారినప్పటికీ కివీస్ కెప్టెన్ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి.. -
జాధవ్ కేసుపై ఐసీజే తీర్పు నేడే
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌కి పాకిస్థాన్ విధించిన మరణ శిక్ష విషయంలో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తీర్పు వెలువరించనుంది. ఇండియాకు అనుకూలమైన తీర్పు రాగలదని మన ప్రభుత్వం భావిస్తోంది. ఐసీజే ఇచ్చే తీర్పును తాము స్వీకరిస్తామని పాకిస్తాన్ అధికారులు కూడా చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కోసం కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పాకిస్థాన్ ఆయనను బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 2016 మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. ఇరాన్లో వ్యాపారం చేసే భారత నౌకాదళ మాజీ అధికారి అయిన జాధవ్‌ను పాక్ ఉద్దేశపూర్వకంగా అపహరించినట్టు భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన ఆ దేశంపై ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. జాధవ్ మరణ శిక్షను రద్దు చేయాలని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా ఐసీజే పాక్‌ను గతంలో ఆదేశించింది. 2017 డిసెంబరులో జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లిని, భార్యను భయపెట్టే విధంగా పాకిస్థాన్ వ్యవహరించినట్టు అప్పట్లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది. వారిద్దరి చేత బలవంతంగా దుస్తులు మార్పింపచేయడం, మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. పునర్విచారణ జరుగుతుందా? గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇండియాకు చెందిన సరబ్జిత్ సింగ్‌కు సైతం గతంలో పాకిస్థాన్ మరణ శిక్ష విధించింది. 22 ఏళ్ల పాటు పాక్ జైలులో మగ్గిపోయిన సింగ్ జైలులో తన తోటి ఖైదీలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ముంబయి టెకీ అన్సారీని కూడా గతంలో ఆ దేశం లాహోర్ జైలులో నిర్బంధించింది. ఇండియా జోక్యంతో నిరుడు అతణ్ణి విడుదల చేసింది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో జాధవ్ కేసుపై పునర్విచారణ జరపాల్సిందిగా ఐసీజే ఆదేశించవచ్చుననే మాటలు వినిపిస్తున్నాయి. కాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు పాకిస్థాన్ మూడుసార్లు ప్రయత్నించినట్టు ప్రముఖ భారతీయ న్యాయవాది హరీశ్ సాల్వే గతంలో తెలిపారు. ఐసీజేను ఓ నాటకశాలగా మార్చిందంటూ భారత్‌పై ఆడిపోసుకుంటున్న పాకిస్థాన్.. జాధవ్‌ను రక్షించేందుకు పెట్టిన కేసును కొట్టేయాలని వాదిస్తోంది. -
పాక్ భాషపై భారత్ తీవ్ర అభ్యంతరం
హేగ్ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48) కేసు విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో పాకిస్తాన్ వాడిన భాషపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. బుధవారం భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ..‘పాక్ న్యాయవాది ఖవార్ ఖురేషీ వాడిన భాష ఈ కోర్టులో ప్రతిధ్వనించింది. సిగ్గులేని, అర్థంలేని, అవమానకరమైన, పొగరుబోతు అనే పదాలను ఐసీజేకు సమర్పించిన పత్రాల్లో పాక్ వాడింది. పాకిస్తాన్ న్యాయవాది దుర్భాషను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రకమైన భాషను వాడకుండా భారత సంస్కృతి మమ్మల్ని అడ్డుకుంటోంది. ఓ సార్వభౌమ దేశం మరో దేశంపై విమర్శలు చేసేటప్పుడు గౌరవప్రదమైన భాషను వాడాలి. చట్టంపై పట్టున్న వ్యక్తులు చట్టం ఆధారంగా వాదిస్తారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నవారు వాటి ఆధారంగానే వాదనలు వినిపిస్తారు. ఇవేమీ లేనివారు కోర్టులో బల్లను మాత్రమే చరుస్తారు. భారత్ సాక్ష్యధారాలను ఐసీజే ముందు సమర్పిస్తే, పాకిస్తాన్ మాత్రం బల్లను బాదుతోంది’ అని విమర్శించారు. జాధవ్‌కు విధించిన మరణశిక్షను వెంటనే రద్దుచేసి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేదంటే సాధారణ కోర్టులో విచారణ జరిపించడంతో పాటు దౌత్యాధికారుల్ని కలుసుకునే అనుమతి ఇవ్వాలన్నారు. నేడు పాకిస్తాన్ వాదనలు సమర్పించిన అనంతరం జాధవ్ కేసులో విచారణ ముగియనుంది. ఈ ఏడాది వేసవిలో ఐసీజే తీర్పు ఇవ్వనుంది. -
నేటి నుంచి జాధవ్ విచారణ
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో సోమవారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకూ నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కోర్టు భారత్, పాకిస్తాన్ల వాదనల్ని విననుంది. ఈ కేసులో భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే, పాకిస్తాన్ తరఫున బారిస్టర్ ఖవార్ ఖురేషీ వాదనలు వినిపించనున్నారు. 2016, మార్చి 3న ఇరాన్ నుంచి బలోచిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించింది. ముస్లిం పేరున్న నకిలీ పాస్పోర్టుతో జాధవ్ పాక్‌లో గూఢచర్యం చేసేందుకు ప్రవేశించారనే నేరంపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
పాక్ విడుదల చేసిన వీడియో
-
మోసపూరిత వీడియో విడుదల చేసిన పాక్!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరో నాటకానికి తెరతీసింది. ప్రపంచ దేశాల నుంచి సానుభూతిని పోగేసుకొనే చర్యకు దిగింది. తమ దేశానికి ధన్యవాదాలు చెబుతున్నట్లుగా ఉన్న కులభూషణ్ జాదవ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా అధికారికంగా విడుదల చేసింది. ఆ వీడియోలో జాదవ్ పాక్‌కు ధన్యవాదాలు చెబుతూ తనను కలవడంతో తల్లి, భార్య చాలా ఆనందంగా కనిపించారని, తనకు కూడా సంతోషంగా ఉందని చెప్పారు. తన ఆరోగ్యంపట్ల తల్లి కూడా చాలా సంతృప్తి చెందారని, తాను ఇక్కడ(పాక్ జైలులో) బాగానే ఉన్నానని, వారు (పాక్ జైలు అధికారులు) తనకు ఎలాంటి హానీ తలపెట్టడం లేదంటూ వివరించారు. అయితే, దీనిపై జాదవ్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పైగా ఆ వీడియో అసలు వీడియోనో నకిలీ వీడియోనో అనే స్పష్టత కూడా లేదు. ఈ అనుమానమే నిజమనేలా నేవీ అధికారి అయిన ఓ జాదవ్ స్నేహితుడిని ప్రశ్నించగా కచ్చితంగా ఆ వీడియో జాదవ్‌పై ఒత్తిడితోనే సృష్టించిందని అన్నారు. జాదవ్‌ను చూసేందుకు తల్లి, భార్య వెళ్లినప్పుడు ఆయన తలపై గాయాలు ఉన్నాయని, తాజా వీడియోలో అవి కనిపించడం లేదని చెప్పారు. అసలు ఈ వీడియో వారు ఎప్పుడు ఎక్కడ తీశారో కూడా చెప్పలేమని, అది వాస్తవమైనదో కాదోనని, ఒక వేళ నిజమైనదే అయినా అది జాదవ్‌ను బెదిరించడం ద్వారా రూపొందించిన వీడియో తప్ప స్వతహాగా జాదవ్ చెప్పింది కాదన్నారు. గూఢచర్యం నిర్వహించాడనే ఆరోపణలతో భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్‌ను పాక్ అధికారులు అరెస్టు చేసి ఉరి శిక్ష వేసి జైలులో పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలె జాదవ్‌ను కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా పాక్ పలు పొరపాట్లు చేసింది. -
తీవ్ర నిరసన : పాక్ హై కమిషన్‌కు చెప్పులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాధవ్ కుటుంబసభ్యులతో పాకిస్తాన్ వ్యవహరించిన అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత్ పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నిరసనలో భాగంగా ఢిల్లీ బీజేపీ లీడరు, పాకిస్తాన్ హై కమిషన్‌కు ఆన్లైన్లో చెప్పులను డెలివరీ చేశారు. కులభూషణ్ తల్లి, భార్యతో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ఈ చెప్పులను డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు. కులభూషణ్‌ను చూసేందుకు వెళ్లిన అతడి తల్లి, భార్య కుంకుమ, తాళిని పాక్ అధికారులు బలవంతంగా తీసేయించిన సంగతి తెలిసిందే. అది తెలియని కులభూషణ్ వారిని కలిసిన వెంటనే నాన్నకు ఏమైంది? అంటూ ప్రశ్నించారు. కులభూషణ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని, ఆయన తల్లిని, భార్యను వితంతువులుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా, ఆన్లైన్ చెప్పులను కొనుగోలు చేశారు. వాటి డెలివరీ కోసం పాకిస్తాన్ హై కమిషన్ అడ్రస్ ఇచ్చారు. ''పాకిస్తాన్‌కు మన చెప్పులు కావాలి. వారికి చెప్పులు పంపండి. నేను చెప్పులు ఆర్డర్ చేశా. పాకిస్తాన్ హై కమిషన్‌కు పంపాను'' అని తాజిందర్ పాల్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాక పాకిస్తాన్‌కు చెప్పులు పంపండంటూ ఆన్లైన్ క్యాంపెయిన్‌కు కూడా లాంచ్ చేశారు. ఈ ఆన్లైన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ హై కమిషన్‌కు వందల మంది భారతీయులు ఫుట్‌వేర్ పంపించారు. -
తల్లి, భార్యను వితంతువుల్లా మార్చారు
న్యూఢిల్లీ : బిడ్డతో ఓ తల్లి, భర్తతో ఓ భార్య సమావేశాన్ని పాకిస్తాన్ విష ప్రచారానికి వినియోగించుకుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో జాధవ్ తల్లి, భార్య సమావేశంపై రాజ్యసభ వేదికగా ప్రకటన చేశారు. సమావేశానికి వెళ్లే ముందు జాధవ్ భార్యతో మాత్రమే కాకుండా, ఆయన తల్లితో కూడా గాజులు, మంగళసూత్రం, బొట్టులను తీయించినట్లు చెప్పారు. జాధవ్ తల్లి అవంతితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. తొలిమాటగా నాన్న ఎలా ఉన్నారని? జాధవ్ అడిగినట్లు చెప్పారు. మంగళసూత్రం మెడలో లేకపోవడం చూసి జాధవ్ అలా అడిగినట్లు వెల్లడించారు. జాధవ్ భార్యతో తన బూట్లు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పాక్ అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఆ బూట్లలో కెమెరా ఉందంటూ పాకిస్తాన్ ప్రకటన చేయడం మరింత నీచానికి దిగజారడమేనని అన్నారు. పాకిస్తాన్‌కు చేరుకునేందుకు జాధవ్ భార్య రెండు సార్లు విమానం ఎక్కారని చెప్పారు. బూట్లలో ఏదైనా ఉంటే ఎయిర్‌పోర్టులో పట్టుకునేవారని అన్నారు. మావవతా దృష్టితో జాధవ్‌ను కలవడానికి అంగీకరించామని చెబుతూ పాకిస్తాన్ ఇలాంటి నీచకార్యాలకు పాల్పడటం అమానుషమని అన్నారు. జాధవ్ కుటుంబసభ్యుల మానవ హక్కులు పాకిస్తాన్లో పదే పదే ఉల్లంఘనకు గురయ్యాయని చెప్పారు. ఓ భీతావాహ వాతావరణంలో జాధవ్‌ను కుటుంబ సభ్యులు కలిశారని ఆవేదన వ్యక్తం చేశారు. జాధవ్ తల్లి చీర మాత్రమే కట్టుకుంటారని ఆమెతో సాల్వార్ కుర్తా వేయించారని తెలిపారు. జాధవ్‌తో ఆయన తల్లిని మరాఠీలో సంభాషించనివ్వలేదని వెల్లడించారు. అయినా ఆమె మరాఠీలో మాట్లాడేందుకు యత్నించడంతో ఇంటర్‌కామ్‌ను పాకిస్తాన్ అధికారులు ఆపివేసినట్లు తెలిపారు. జాధవ్‌ను సురక్షితంగా విడిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జాధవ్ తల్లి, భార్యలతో అమర్యాదగా ప్రవర్తించడాన్ని ప్రతి భారతీయుడితో అమర్యాదగా ప్రవర్తించడంగా భావిస్తున్నట్లు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజకీయ భేధాలతో సంబంధం లేకుండా దేశ ప్రజల పట్ల అగౌరవంగా నడుచుకుంటే సహించబోమని చెప్పారు. -
పాక్ మీడియా వేధింపులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ వెళ్లినప్పుడు పాక్ పాల్పడిన దురాగతాలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. అవంతి, చేతాంకుల్ వద్దకు పాక్ ప్రభుత్వమే విలేకరుల పేరుతో కొందరిని పంపించి విపరీతమైన ప్రశ్నలు అడిగించి వారిని వేధించిన విషయం వెల్లడైంది. విదేశాంగ శాఖ కార్యాలయంలో జాధవ్‌ను కలిశాక తిరిగి వెళ్లేముందు వారి వద్దకు కొందరు జర్నలిస్టులు వచ్చారు. ‘అమాయకపు పాకిస్తానీల రక్తంతో మీ భర్త హోళీ ఆడుకున్నారు. దీనికి మీరేమంటారు? హంతకుడైన మీ కొడుకును కలిశాక మీకేమనిపిస్తోంది?’ తదితర ప్రశ్నలతో జాధవ్ భార్య, తల్లికి వేదన కలిగించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ప్రశ్నలు అడిగిన విలేకరులకు ఆ తర్వాత పాక్ విదేశాంగ శాఖ నుంచి ‘బాగా పనిచేశారు’ అంటూ సంక్షిప్త సందేశాలు వచ్చాయని డాన్ పత్రికలో పనిచేసే ఓ సీనియర్ కరస్పాండెంట్ ట్వీటర్లో చెప్పారు. ‘దేశభక్తిని నిరూపించుకునేందుకు ఉత్తమ మార్గం 70 ఏళ్ల మహిళను వేధించడమే అనుకునే పాక్ జర్నలిస్టుల గురించి చెప్పేందుకు పదాలు రావడం లేదు’ అని మరో ప్రముఖ పాత్రికేయురాలు బేనజీర్ షా అన్నారు. అసలు అక్కడున్న వాళ్లంతా జర్నలిస్టులేనా లేక ఐఎస్ఐ మనుషులు ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జాధవ్‌ను ఆయన తల్లి, భార్య నేరుగా కలవకుండా గాజుతెర అడ్డుగా పెట్టడం, ఇంటర్‌కామ్ (ఫోన్)లో మాత్రమే మాట్లాడేందుకు అనుమతివ్వడం, మంగళసూత్రం, బొట్టు తీయించి, దుస్తులు మార్పించి లోపలకు పంపించడం తదితర పాక్ దుశ్చర్యలు ఇప్పటికే వెలుగుచూడటం తెలిసిందే. ‘ఫోరెన్సిక్’కు చేతాంకుల్ పాదరక్షలు చేతాంకుల్ పాదరక్షలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షకు పంపినట్లు పాక్ మీడియా తెలిపింది. షూలో కెమెరా, రికార్డింగ్ చిప్ లాంటి వస్తువేదైనా ఉందేమో తెలుసుకోడానికి ల్యాబ్‌కు పంపినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైజల్ చెప్పారంది. జాధవ్ కుటుంబ సభ్యులను వేధించామన్న భారత ఆరోపణలను నిరాధారమైనవిగా పాక్ కొట్టిపారేసింది. జాధవ్ భార్య, తల్లితో పాకిస్తాన్ అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మొత్తం భారతీయులకు అవమానం: కాంగ్రెస్ అవంతి, చేతాంకుల్‌ను పాకిస్తానీ విలేకరులు వేధించడం మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పేర్కొంది. భారతీయులుగా మనం ఈ చర్యను ఏ మాత్రం సహించకూడదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. -
పాక్ తీరుపై సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కులభూషణ్ జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును జాతీయ పార్టీల నాయకులు తీవ్రంగా గర్హించారు. జాధవ్ తల్లి, భార్యను పొరుగుదేశం అవమానించడాన్ని ఖండించారు. జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ వైఖరి తలదించుకునేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు నరేశ్ అగర్వాల్ తదితరులు ధ్వజమెత్తారు. పార్లమెంట్లో రేపు ప్రకటన పాకిస్తాన్ ప్రవర్తనపై పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. జాధవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ వైఖరి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. జాధవ్‌ను తిరిగి మనదేశానికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై రేపు పార్లమెంట్లో ప్రకటన చేయనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. భారత్ గూఢచారిగా ముద్రపడి 22 నెలలనుంచి పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాధవ్‌ను ఈ నెల 25న ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై స్పందించేందుకు భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్ నిరాకరించారు. -
‘పాకిస్తాన్‌ను ఖండఖండాలుగా తెగ నరకండి’
ముంబై : పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి తనదైన శైలిలో స్పందించారు. జాధవ్‌ను కలవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ల పట్ల పాకిస్తాన్ భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం, మెడలో ఉన్న మంగళ సూత్రాలను, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాధవ్‌తో మాతృభాషలో సంభాషించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం లాంటివి విస్మయం కలిగించాయి. చివరకు జాధవ్ భార్య మంగళసూత్రాలు, ఆమె బూట్లను పాకిస్తాన్ అధికారులు వెనక్కి ఇవ్వలేదు. ఈ సంఘటనను ‘ద్రవపది వస్త్రాపహరణం’గా అభివర్ణించిన సుబ్రమణియన్ స్వామి.. జాధవ్ కుటుంబాన్ని అవమానించిన పాకిస్తాన్ గడ్డను ఖండఖండాలుగా తెగ నరకాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాలని సూచించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వాస్తవాధీన రేఖ అవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌పై కూడా ఆయన మాట్లాడారు. ఆపరేషన్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, పాకిస్తాన్‌కు ఇది సరిపోదని, దాన్ని నాలుగు ముక్కలుగా విభజించడమే రక్త దాహాన్ని ఆపగలుగుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ - పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే మరే ఇతర దేశం కూడా అందులో జోక్యం చేసుకోదని అన్నారు. ఇందుకు కారణం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై ఉన్న ముద్రేనని చెప్పారు. -
గాజుతెర అడ్డుగా.. కలిశారు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటుచేసిన పాక్ అధికారులు .. ఇరువైపులా ఫోన్ ద్వారా (ఇంటర్‌కామ్) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా రికార్డు చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు జాధవ్ కృతజ్ఞతలు తెలిపారని పాక్ విదేశాంగ అధికారులు వెల్లడించారు. కెమెరా నిఘాలోనే జాధవ్ తల్లి అవంతి, భార్య చేతాంకుల్ దుబాయ్ నుంచి ఇస్లామాబాద్‌కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. భారత హైకమిషన్ కార్యాలయంలో అరగంట గడిపాక ఒంటిగంటకు ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. వీరితోపాటు భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్, ఓ పాకిస్తాన్ అధికారిణి ఉన్నారు. లోపలకు వెళ్లగానే భద్రతా తనిఖీలు నిర్వహించారు. తర్వాత 1.35గంటలకు ఒక గదిలో వీరు కలుసుకున్నారు. మధ్యలో గాజు తెరనుంచి, ఇరువైపుల నుంచీ ఇంటర్‌కామ్ ద్వారా మాట్లాడుకునే ఏర్పాట్లు చేశారు. ఈ తతంగాన్ని కెమెరాలతో చిత్రీకరించారు. తర్వాత భారత ఎంబసీకి వచ్చిన వీరిద్దరూ ఇక్కడ కాసేపు ఉన్న తర్వాత భారత్‌కు పయనమయ్యారు. జాధవ్‌ను కలిసి బయటకొచ్చిన తర్వాత మీడియా ప్రశ్నలు సంధించినా వీరిద్దరూ మౌనంగానే వెళ్లిపోయారు. కార్యాలయం లోపలకు వెళ్లినప్పటినుంచి బయటకు వచ్చేంతవరకు తీసిన దృశ్యాలను, చిత్రాలను పాక్ విదేశాంగ శాఖ విడుదల చేసింది. తమ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా జయంతి ఉత్సవాల సందర్భంగా జాధవ్ తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు పాక్ పేర్కొంది. ‘ఇస్లామిక్ సంప్రదాయాలు, మానవతాదృక్పథంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశాం’ అని పాక్ విదేశాంగ ప్రతినిధి ఫైజల్ పేర్కొన్నారు. దౌత్య సాయమా? కాదా? సోమవారం సాయంత్రం పాకిస్తాన్ విదేశాంగ శాఖ మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఈ భేటీ వివరాలను వెల్లడించింది. జాధవ్‌తో భార్య, తల్లి కలుసుకోవటాన్ని మానవతా దృక్పథంతోనే ఏర్పాటుచేశామని.. అయితే ఇది కొంతకాలంగా భారత్ కోరుతూ వస్తున్న దౌత్యసాయం మాత్రం కాదని తెలిపింది. పాక్ విదేశాంగ కార్యాలయంలోకి భారత దౌత్యవేత్త జేపీ సింగ్ వచ్చినప్పటికీ ఆయన దూరం నుంచే జాధవ్‌ను చూసేందుకు అవకాశం కల్పించామని.. మాట్లాడనీయలేదని వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖకు ముందే చెప్పామని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి ఫైజల్ పేర్కొన్నారు. దౌత్యసాయంపై నిర్ణయాన్ని పాకిస్తాన్ చట్టం, దేశ ప్రయోజనాల ఆధారంగానే తీసుకుంటామన్నారు. ‘30 నిమిషాలసేపు మాట్లాడుకునేందుకు అవకాశం ఇస్తామని ముందే చెప్పాం. కానీ జాధవ్, ఆయన తల్లి కోరిక మేరకు మరో 10 నిమిషాల అవకాశం ఇచ్చాం. జాధవ్, కుటుంబసభ్యులు నేరుగా కలుసుకునేందుకు అవకాశం ఇవ్వమని ముందుగానే సమాచారమిచ్చాం. కుటుంబసభ్యులకు, భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు’ అని ఫైజల్ చెప్పారు. అయితే, ఆదివారం రాత్రి పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ముహ్మద్ ఆసిఫ్ మాత్రం.. భారత దౌత్యవేత్తను సమావేశంలోకి అనుమతిస్తున్నందున దీన్ని దౌత్యసాయంగానే పరిగణిస్తామన్నారు. పాక్ ఆడుతున్న నాటకం: దల్బీర్ పాక్ తీరుపై భారత్‌లో విమర్శలు వ్యక్తమయ్యాయి. తల్లికి జాధవ్‌ను హత్తుకునే అవకాశం కల్పించి ఉండాల్సిందని జాధవ్ మిత్రుడొకరు అభిప్రాయపడ్డారు. అటు, నాలుగేళ్ల క్రితం పాక్ జైల్లో హత్యకు గురైన భారతీయుడు సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్.. జాధవ్–కుటుంబ సభ్యుల భేటీని పాక్ ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. ‘ కుటుంబీకులు అతన్ని హత్తుకునేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఇదంతా పాక్ ఆడుతున్న నాటకం. అంతర్జాతీయ సమాజాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు’ అని దల్బీర్ మండిపడ్డారు. జాధవ్‌కు చిత్రహింసలు! న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌ను పాక్ జైలు అధికారులు చిత్రహింసలకు గురిచేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. సోమవారం, భార్య, తల్లితో భేటీ సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ వెల్లడించిన చిత్రాలు ఈ అనుమానాలను ఊతమిస్తున్నాయి. చిత్రాల్లో జాధవ్ చెవి కింద, మెడ భాగంలో, తలపైన గాయాలున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మానవతా దృక్పథమని పాక్ చెబుతున్నా అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితిలో ఏళ్ల పాటు భారత దౌత్యవేత్తగా పనిచేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. భారత గూఢచారినని జాధవ్‌ను ఒప్పించేందుకే చిత్రహింసలు పెడుతున్నారన్నారు. కాగా, భార్య,తల్లితో భేటీ అనంతరం.. మరోసారి తను భారత గూఢచారినే అంటూ జాధవ్ ఒప్పుకున్న వీడియోను పాక్ విడుదల చేసింది. ఇదే చివరి భేటీ కాదు ఇన్నాళ్లుగా జాధవ్‌తో కుటుంబ సభ్యులతో భేటీని తిరస్కరిస్తూ వచ్చిన పాక్ చివర్లో చల్లని మాటొకటి చెప్పింది. ‘కుటుంబ సభ్యులతో జాధవ్ భేటీ ఇదేం చివరిది కాదు. విడతల వారీగా కలిసే అంశాలను పరిశీలిస్తాం’ అని పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఫైజల్ స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి ముందుగానే భేటీలో మాట్లాడుకున్న వీడియోను ప్లే చేశారు. చివర్లో ‘నా భార్య, తల్లితో కలిసే అవకాశం ఇవ్వమని అడిగాను. అంగీకరించి అనుమతించిన పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని జాధవ్ తెలిపారు. అయితే ఉదయమే జాధవ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చినా ఆయన్ను తరలించేముందు ఎక్కడుంచారనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అసలు జాధవ్ కేసేంటి? 2016 మార్చి 3న జాధవ్‌ను ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. పాక్ వ్యతిరేక విద్రోహచర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఆ తర్వాత భారత గూఢచారిగా ముద్రవేస్తూ ఆ దేశ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్షను విధించింది. అయితే భారత్ మాత్రం ఇరాన్ నుంచి జాధవ్‌ను కిడ్నాప్ చేశారని గట్టిగా వాదిస్తోంది. భారత నావికాదళం నుంచి రిటైరయ్యాక ఇరాన్లో తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జాధవ్‌తో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టంచేసింది. భారత్ చేసిన విజ్ఞప్తితో మే 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) జాధవ్ మరణశిక్షపై స్టే విధించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు, కనీసం ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు గతంలో భారత్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలయ్యాయి. ఎవరీ జాధవ్ ? మహారాష్ట్రలోని సాంగ్లీలో కుల్‌భూషణ్ జాధవ్ జన్మించారు. తండ్రి సుధీర్ జాధవ్ ముంబై పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా రిటైరయ్యారు. జాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జాధవ్ సొంత వ్యాపారాన్ని ప్రారంభించే ఉద్దేశంతో ముందుగానే నావికాదళం సర్వీసు నుంచి రిటైరైనట్లు ఆయన కుటుంబవర్గాల సమాచారం. వంచన ద్వారానే జాధవ్‌ను పాకిస్తాన్లో అరెస్ట్ చేశారని భారత్ వాదిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ జాధవ్‌ను కలిసి బయటికొస్తున్న ఆయన తల్లి, భార్య, దౌత్యవేత్త జేపీ సింగ్ -
పాక్ దుర్మార్గం.. కనీసం తల్లిని కూడా ముట్టుకోనివ్వలేదు
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్, ఆయన తల్లి, భార్య కోరిక తీరింది. వారు ఒకరినొకరు చూసుకొని కాస్తంత ఉపశమనం పొందారు. అన్నింటికంటే ముందు ఆయన క్షేమంగానే ఉండటాన్ని స్వయంగా చూసిన తల్లి, భార్య ధైర్యంతో తిరుగుపయనం అయ్యారు. అయితే, జాదవ్‌ను కలిసే క్రమంలో పాక్ అడుగడుగునా తన బుద్ధి చూపించుకుందనే చెప్పాలి. కనీసం జాదవ్ తల్లికి, భార్యకు మర్యాద ఇవ్వని పాక్ జాదవ్‌తో మాట్లాడే సందర్భంలో వారి మధ్య గ్లాస్‌ను ఏర్పాటుచేశారు. పైగా వారు మాట్లాడేదాన్ని మొత్తం వీడియోలో షూట్ చేయడంతోపాటు రహస్యంగా ప్రత్యేక అధికారులు ఆయన ఏం మాట్లాడుతున్నారనే దాన్ని మైక్రో స్పీకర్ల ద్వారా తమ గదుల్లోని తెరలపై చూస్తూ విన్నారు. కనీసం వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేని పరిస్థితి కనిపించింది. ఇదిలా ఉండగా పాక్ మరో వీడియో విడుదల చేసింది. గతంలో జాదవ్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా ఓ కపట వీడియోను విడుదల చేసినట్లుగానే తాజాగా కూడా మరో వీడియోను విడుదల చేసింది. అందులో ‘నాతల్లిని, భార్యను కలిసే సమావేశం ఏర్పాటుచేయాలని పాక్ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేసిన పాక్ ప్రభుత్వానికి నేను మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని జాదవ్ చెప్పినట్లుగా ఆ వీడియో ఉంది. -
జాదవ్‌కు స్వల్ప ఊరటనిచ్చిన పాక్
-
'క్రిస్టమస్ రోజు ఆయన భార్య, తల్లి కలవొచ్చు'
సాక్షి, న్యూఢిల్లీ : కులభూషణ్ జాదవ్ ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు పాక్ అంగీకరించింది. క్రిస్టమస్ రోజు జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారు. అలాగే, ఆ రోజు భారత హైకమిషన్‌కు చెందిన స్టాఫ్ మెంబర్ కూడా వారితోపాటు ఉండనున్నారని తెలిపారు. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడని, ఉగ్రవాద చర్యలకు దిగాడని ఆరోపిస్తూ పాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో జాదవ్‌ను అరెస్టు చేసి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆయనకు గుఢాచారానికి ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు భారత్ చెప్పినప్పటికీ పాక్ అంగీకరించలేదు. అయితే, ఇటీవల జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు తల్లికి అవకాశం ఇవ్వాలని భారత్ కోరింది. తొలుత భార్యను మాత్రమే కలిసేందుకు అంగీకరించిన పాక్ ఆ తర్వాత సుష్మా స్వరాజ్ రంగంలోకి దిగడంతో క్రిస్టమస్ రోజు భార్యను, అతడి తల్లిని కూడా కలిసేందుకు అంగీకరించారు. -
కూర్చోని మాట్లాడుకుందాం రండి!?
ఇస్లామాబాద్ : అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో పాకిస్తాన్ వైఖరిలో మార్చు వచ్చినట్లు కనిపిస్తోంది. చతుర్భుజ కూటమితో భారత్ బలోపేతమవుతున్ననేపథ్యంలో పాకిస్తాన్.. రెండడుగులు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ సహా పలు వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలకు తాము సిద్ధమంటూ పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పద అంశంగా నలుగుతున్న కశ్మీర్ సహా, సియాచిన్, సిర్‌క్రీక్ వంటి అంశాలపై చర్చలు పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ ప్రకటించారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. భారత ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక చట్టాల ప్రకారం.. మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించాక.. ఎవరినీ కలిసేందుకు అనుమతించం..అయితే కేవలం మానవతా దృక్ఫథాన్ని దృష్టిలో పెట్టుకుని కులభూషన్ జాదవ్‌ను కలిసేందుకు ఆమె భార్యకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో భారత్ క్రూయిజ్ మిసైల్‌ను పరీక్షించడంపైనా ఆయన స్పందించారు. భారత్ మిసైల్ పరీక్షలు నిర్వహించడం వల్ల రీజియన్‌లో శాంతి భద్రతలు ప్రమాదంలో పడతాయని ఆయన అన్నారు. -
భార్యను కలిసేందుకు జాధవ్‌కు అనుమతి
ఇస్లామాబాద్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది. -
జాధవ్ క్షమాభిక్షను విశ్లేషిస్తున్నాం : పాక్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(46)కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను ఆర్మీ చీఫ్ మేజర్ ఖమర్ జవేద్ బజ్వా విశ్లేషిస్తున్నట్లు పాక్ సైన్యం తెలిపింది. అన్ని వివరాలు పరిశీలించిన అనంతరం జాధవ్ అప్పీలుపై బజ్వా తుది నిర్ణయం తీసుకుంటారని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. మరణ శిక్షను రద్దు చేయడానికి ఇక్కడి మిలటరీ అప్పీల్ కోర్టు నిరాకరించడంతో జూన్‌లో జాధవ్ పాక్ ఆర్మీ చీఫ్‌కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు గఫూర్ పేర్కొన్నా రు. ఒకవేళ ఆర్మీ చీఫ్ జాధవ్ పిటిషన్‌ను తిరస్కరిస్తే..అతను వెంటనే పాక్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది భారత్ 580 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని గఫూర్ ఆరోపించారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. సీపీఈసీకి పాక్ ఆర్మీ పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుందని గఫూర్ పేర్కొన్నారు. -
దిగొచ్చిన పాక్.. జాదవ్ తల్లికి వీసా పరిశీలన
ఇస్లామాబాద్: గూఢచర్యం కేసులో ప్రస్తుతం మరణ శిక్షను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్ తల్లి అవంతిక జాదవ్‌కు వీసాను ఇచ్చే విషయం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం చెప్పిందని పాక్ మీడియా వెల్లడించింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జోక్యం చేసుకున్న మూడు రోజుల తర్వాత గానీ, దీనికి సంబంధించిన కదలిక మొదలుకాలేదు. కులభూషణ్ జాదవ్ ప్రస్తుతం పాక్ జైలులోనే ఉరి శిక్షకు గురై జైలులో మగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని చూసేందుకు తనకు అనుమతివ్వాలని, వీసా ఇవ్వాలని జాదవ్ తల్లి అవంతిక జాదవ్ వీసా దరఖాస్తు కోరారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ గత సోమవారం తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సుష్మా వ్యక్తిగతంగా సర్తాజ్ అజీజ్‌కు లేఖ రాసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఘాటు వ్యాఖ్యలతో మండిపడుతూ సుష్మా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
భారత్ అభ్యర్థనకు పాకిస్తాన్ నో
ఇస్లామాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను తమ అధికారులు కలిసేందుకు అనుమతించాలన్న భారత విజ్ఞప్తిని పాకిస్తాన్ తిరస్కరించింది. పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్రవాదులకు భారత్ ఆర్థికసాయం చేస్తోందని, తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తోందని జకారియా ఆరోపించారు. దీని కోసమే కుల్‌భూషణ్ జాధవ్.. బలూచిస్తాన్ వచ్చారని పేర్కొన్నారు. ఆయనతో భారత్ అధికారులను కలవనిచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌తో పాటు ముంబైకి చెందిన హమీద్ నెహాల్‌ను తమ అధికారులు కలిసేందుకు అనుమతించాలని భారత విదేశాంగ శాఖ పాక్‌ను శనివారం మరోసారి కోరింది. 2012లో తన ఆన్లైన్ స్నేహితురాలిని కలుసుకోవడానికి అఫ్గాన్ నుంచి పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హమీద్ ఆ తర్వాత జాడలేకుండా పోయారు. -
భారత్ విజ్ఞప్తిని ఐసీజే నిజంగా తిరస్కరించిందా?
ఇస్లామాబాద్: కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో భారత్ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిందని పాకిస్థాన్ పేర్కొంది. సెప్టెంబర్‌లోగా ప్రతిస్పందన తెలియజేయాలంటూ భారత్‌కు ఆదేశించినట్లు వెల్లడించింది. ‘నెదర్లాండ్‌లోని మా కాన్సులేట్ ద్వారా మేం తెలుసుకున్న విషయం ఏమిటంటే కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ప్రతిస్పందన తెలియజేసేందుకు డిసెంబర్ వరకు పొడిగించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించింది. సెప్టెంబర్ 13లోగా తెలియజేయాలంటూ ఆదేశించింది’ అని పాక్ అటార్నీ జనరల్ అష్తర్ ఔషఫ్ అలీ చెప్పినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించాడనే ఆరోపణలతో భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి అయిన కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మరణ శిక్షను విధించడంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పాక్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. -
జాధవ్ ఆ ‘కీలక’ సమాచారాన్ని చెప్పాడు: పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాధవ్‌తో తమతో పంచుకున్నాడని చెప్పుకొచ్చింది. ‘ పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని జాధవ్ మాతో పంచుకుంటున్నాడు’ అని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, జాధవ్ ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టాడనే విషయాన్ని ఆయన తెలుపలేదు. గూఢచర్యం ఆరోపణలపై జాధవ్‌కు పాక్ ఆర్మీ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకపక్షంగా శిక్ష విధించడాన్ని తప్పుబడుతూ ఆయన ఉరిశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. -
జాధవ్ ఎప్పటికీ విడుదల కాలేడు
ఇస్లామాబాద్ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా విడుదల చేసే ప్రసక్తే లేదని పాకిస్తాన్ న్యాయవాది ఖావర్ ఖురేషీ స్పష్టం చేశారు. కుల్‌భూషణ్ జాధవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ తరఫున ఖావర్ ఖురేషీ వాదనలు వినిపించారు. అయితే అక్కడ పాక్‌కు చుక్కెదురు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖావర్ ఖురేషీ మాట్లాడుతూ... జాధవ్ కేసు చాలా స్పష్టమైందని, అతడిని ఎన్నటికీ నిర్దోషిగా విడుదల చేయడం జరగదని నేషన్ వార్త పత్రికిను ఉటంకిస్తూ అన్నారు. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం అటు జాదవ్‌ను నిర్దోషిగా తేల్చలేదనీ, ఇటు విడుదల చేయలేదనీ వివరించారు. ఆయన సోమవారమిక్కడ పాకిస్తాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పాకిస్తానీ అధికారులకు పాక్ మీడియా గౌరవించాలని అన్నారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తానీ మిలటరీ కోర్టు జాదవ్‌కు ఉరిశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇచ్చిన విషయం తెల్సిందే. కాగా జాధవ్ కేసులో ఐసీజేలో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిపుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. దీంతో ఐసీజేలో జాధవ్ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ సర్కారు నిర్ణయించింది. మరోవైపు జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, సెనేట్ మాజీ చైర్మన్ ఫరూక్ నయీక్ తరఫున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
‘జాధవ్‌ను తక్షణమే ఉరి తీయండి’
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను త్వరగా ఉరితీయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, సెనేట్ మాజీ చైర్మన్ ఫరూక్ నయీక్ తరఫున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ’డాన్’పత్రిక పేర్కొంది. -
భారత్ పెద్ద తప్పు చేసింది.. పాక్‌కు చాలా హ్యాపీ
న్యూఢిల్లీ: భారత్ అనవసరంగా పాకిస్థాన్‌కు అవకాశం ఇచ్చిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అన్నారు. కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భారత్ పెద్ద తప్పు చేసిందని చెప్పారు. ఈ ఒక్క చర్యతో పాక్ ఆశల పేటిక తెరుకుందని, ఇక వారు భారత్‌పై ప్రతిసారి ఐసీజే తలుపుతడతారని, భారత్ కచ్చితంగా సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ఒక్క వ్యక్తి జీవితాన్ని కాపాడేందుకు భారత్ ఈ ప్రయత్నం చేస్తే ఇప్పుడు కశ్మీర్ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై ఐసీజేకు వెళతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో కులభూషణ్ జాదవ్ కేసు, ఐసీజే విషయాన్ని ప్రస్తావిస్తూ రాశారు. ‘జాదవ్ కేసు విషయంలో ప్రపంచ న్యాయస్థానానికి వెళ్లి చాలా తీవ్రమైన తప్పుచేసింది. బహుశా.. ఐసీజే తీర్పు విషయంలో చాలామంది సంబురాలు చేసుకుంటుండొచ్చు. కానీ, నా అభిప్రాయంలో అది భారత్ చేసిన పెద్ద తప్పు. ఇది పాక్ చెప్పుచేతల్లో మనం ఆడుతున్నట్లు. ఎన్నో విషయాలు ఇప్పుడు ఐసీజే చేతుల్లో పెట్టినట్లు. కశ్మీర్ విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థను, వ్యక్తులను ఇప్పటి వరకు అనుమతించని మనం ఇప్పుడు పాక్ ఐసీజేకు వెళితే జోక్యానికి అంగీకరించాల్సి వస్తుంది. ఇది పాక్ ఆశ పేటిక తెరిచినట్లే. ఒక వ్యక్తి కోసం కశ్మీర్‌వంటి సమస్య కూడా ఐసీజేకు వెళ్లేలాగా చేశారు. పాకిస్థాన్ ఇప్పుడు నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండిఉంటుంది’ అని కట్జూ ఫేస్బుక్లో రాసుకొచ్చారు. -
కులభూషణ్ తల్లి పిటిషన్‌ను పరిగణిస్తున్నాం: పాక్
ఇస్లామాబాద్: కులభూషణ్ జాదవ్‌కు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ వేసిన ఆయన తల్లి వేసిన పిటిషన్ తమకు చేరిందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాన సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఆ పిటిషన్‌ను తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కులభూషణ్‌కు పాక్ విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్‌ను ఏప్రిల్ 26న ఆయన తల్లి పిటిషన్ వేసింది. దీనిని భారత హైకమిషనర్ పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శికి అందజేశారు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారనే ఆరోపణలతో పాకిస్థాన్ జాదవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని నెలకొల్పింది. ఇప్పటికే పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలిన విషయం తెలిసిందే. అయితే, పాక్ మాత్రం దీనిపై స్పందిస్తూ ‘పాకిస్థాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓడిపోయిందని చెప్పడం పూర్తిగా తప్పవుతుందని, కోర్టు కేవలం ఉరి శిక్షపై స్టే మాత్రమే విధించిందనే విషయం గుర్తించాలని అజీజ్ అన్నారు. -
కుల్‌భూషణ్ కేసుకు పాక్ అటార్నీ జనరల్!
ఇస్లామాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసును సరిగా రిప్రజెంట్ చేయలేదని విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో పాకిస్తాన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ది హేగ్‌లోని న్యాయస్థానంలో గురువారం జరిగిన విచారణలో పాకిస్తాన్ తరఫున ఖావర్ ఖురేషీ వాదనలు వినిపించగా.. తదుపరి విచారణలో అతడి స్థానంలో ఆ దేశ అటార్ని జనరల్ అస్తార్ ఆసఫ్ అలీ వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ కేసును తాను రిప్రజెంట్ చేయనున్నట్లు ఆసఫ్ అలీ తెలిపారని జియో టీవీ శనివారం వెల్లడించింది. తుదితీర్పు వెలువడేంతవరకు జాదవ్‌కు విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తమ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ అని పాక్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దీంతో పాక్ తరఫున అటార్నీ జనరల్ రంగంలోకి దిగుతున్నారు. -
జాధవ్ కేసులో కొత్త లాయర్లు
ఇస్లామాబాద్: కుల్‌భూషణ్ జాధవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిఫుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీజేలో జాధవ్ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వెల్లడించారు. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం జాధవ్ మరణశిక్షను నిలుపుదల చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చే వరకూ మరణశిక్షను అమలు చేయవద్దని ఐసీజే ఆదేశించింది. జాధవ్ కేసులో ఎఫ్ఓ సక్రమంగా వ్యవహరించలేదని, ఈ కేసు కోసం బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ఖావర్ ఖురేషీని ఎంచుకోవడాన్ని ప్రతిపక్షాలు, నిఫుణులు తప్పుపట్టారు. కాగా, జాధవ్ కేసులో పునర్విచారణ చేపట్టాలంటూ పాక్ ఐసీజేలో శుక్రవారం పిటిషన్ వేసింది. -
సెహ్వాగ్, కైఫ్ కలిసి ఉతికేశారు!
కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఆదేశాలు భారతీయులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించాయి. దాంతో తమకు తోచిన రీతిలో ఆ ఆనందాన్ని పదిమందితో పంచుకున్నారు. అయితే ఇది పాకిస్తానీలకు కంటగింపుగా మారింది. కుల్‌భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పడం, ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందనడం, అసలు ఉరిశిక్ష అమలు మీదే స్టే విధించడం లాంటి కోర్టు నిర్ణయాలు భారతీయులను సంబరాల్లో ముంచెత్తగా పాకిస్తానీలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ చేసిన ట్వీట్ల మీద రెచ్చిపోయి కామెంట్లు పెట్టి.. అడ్డంగా బుక్కైపోయారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయం రాగానే సెహ్వాగ్ కుల్‌భూషణ్ హ్యాష్ ట్యాగ్‌తో 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు. దానికి ఫర్హాన్ జహూర్ అనే పాకిస్తానీ వ్యక్తి స్పందించాడు. ''మీకు బుర్రలు తక్కువా? తుది నిర్ణయం ఇంకా రాలేదు, ఐసీజే స్టే ఇచ్చినా కూడా అతడిని మేం ఉరి తీస్తాం. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లంది'' అని ట్వీట్ చేశాడు. దాంతో సెహ్వాగ్‌కు ఒళ్లు మండింది. ''భారతదేశాన్ని ప్రపంచకప్‌లో ఓడించాలన్నట్లే ఇది కూడా మీకు కలగానే మిగిలిపోతుంది. కుక్కను పెంచుకోండి, పిల్లిని పెంచుకోండి గానీ, దురభిప్రాయాలను పెంచుకోకండి'' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ముల్తాన్ గడ్డ మీదే పాకిస్తాన్ మీద సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక మహ్మద్ కైఫ్ కూడా ఇదే అంశం మీద స్పందించాడు. ''కంగ్రాచ్యులేషన్స్ ఇండియా.. అంతర్జాతీయ కోర్టుకు ధన్యవాదాలు. న్యాయం నిలబడింది'' అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆమిర్ ఆక్రమ్ అనే పాకిస్తానీ ట్విట్టర్ యూజర్ రెచ్చిపోయాడు. ''ముందు నీ పేరు లోంచి మహ్మద్ అనే పదాన్ని తీసెయ్యి'' అని రాశాడు. దానికి కైఫ్ కూడా దీటుగా స్పందించాడు. 'వావ్.. నేను భారతదేశ విజయానికి మద్దతిస్తే, నేను మహ్మద్ అనే పేరు తీసెయ్యాలా.. నా పేరు అంటే నాకు గర్వంగా ఉంటుంది. ఆమిర్ అంటే పూర్తి జీవితం. అది నీకు ఉండాలి'' అంటూ కాస్తంత హెచ్చరికస్వరంతోనే కైఫ్ సమాధానం ఇచ్చాడు. Satyamev Jayate !#KulbhushanJadhav — Virender Sehwag (@virendersehwag) 18 May 2017 @virendersehwag You guys hv less brains? The final decision yet to come and even though icj stays whtever we ll hang him go where ever on ur choic#pak -
‘హేగ్’లో భారత్ గెలుపు
-
పాక్‌కు భంగపాటు
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో విచారణ సాగుతున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మన దేశానికి నైతిక విజయం లభించింది. ఆ కేసులో తుది తీర్పు వెలువరించేంత వరకూ తదుపరి చర్యలేమీ తీసుకోవద్దని ఐసీజే పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఆయనపై గూఢచారిగా అభివర్ణించి, ఉగ్రవాద ఘటనలతో సంబంధము న్నదని అభియోగాలు మోపి హడావుడిగా మరణశిక్ష విధించిన పాకిస్తాన్‌కు న్యాయ స్థానంలో చుక్కెదురు కావడం మన విదేశాంగ శాఖ సమర్ధతకూ, ప్రత్యేకించి సీని యర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనా పటిమకూ లభించిన విజయం. భారత్– పాకిస్తాన్‌లు క్రీడల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడినప్పుడల్లా రెండు దేశాల్లోనూ ఉత్కంఠ, ఉద్రేకాలు పెరుగుతాయి. ఈసారి ఆ పోటీ మైదానాల్లోకాక న్యాయ స్థానంలో జరగడం... ఆ కేసు మన పౌరుడి ప్రాణాలకు సంబంధించింది కావడం కలవరపాటును కూడా కలిగించింది. రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య సమస్య లుండటం వింతేమీ కాదు. కానీ ఆ సమస్యల పర్యవసానంగా వైషమ్యాలు ఏర్ప డటం, అవి అంతకంతకూ జటిలమవుతూ పోవడం భారత్–పాక్‌ల విష యంలోనే కనిపిస్తుంది. రెండు దేశాల్లోని ప్రభుత్వాలూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తే చాలు...సరిహద్దుల్లో కాల్పుల మోతలు మొదలవుతాయి. పాక్‌లోని పౌర ప్రభు త్వం తీసుకునే చొరవను అక్కడి సైన్యం వమ్ము చేస్తుంది. ఈసారి దాని ఎత్తు గడలకు ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్ జాదవ్ బలి పశు వయ్యాడు. ఆయనను పాక్ ఏజెంట్లు అపహరించి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి తీవ్రమైన అభియోగాలు మోపారు. పాక్‌లోని బలూచిస్తాన్‌లో ఆయన ఉగ్ర వాద కార్యకలాపాలు నడిపాడని, పలువురి మృతికి కారకుడయ్యాడని ఆ అభియో గాల సారాంశం. ఈ కేసు విషయంలో పాకిస్తాన్ చర్యలు ఆది నుంచీ నిగూఢంగానే ఉన్నాయి. కుల్‌భూషణ్‌పై మోపిన అభియోగాలను ఒక ప్రకటన ద్వారా వెల్లడించడమే తప్ప అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని బయటపెట్టలేదు. ఆయనకు వ్యతి రేకంగా తమ దగ్గరున్న సాక్ష్యాలేమిటో చెప్పలేదు. మన దేశం కోరినా ఇవ్వలేదు. ఆయన ఒకప్పుడు భారత నావికా దళంలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడని, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడని మన దేశం అంటుంటే ఆయన ఇప్పటికీ నావికాదళ అధికారేనని అది వాదిస్తోంది. ఆయనను కలిసేందుకు మన దౌత్యా ధికారులకు అవకాశం ఇవ్వాలని డజనుసార్లు మన దేశం అర్ధించింది. కానీ పాక్ వినలేదు. విచారణ ప్రక్రియ సైతం అనుమానాలు రేకెత్తించేలా సాగింది. విచారణ జరగడం నిజమో కాదో కూడా తెలియదు. ఇలాంటి గోప్యత ఏ విలువలకూ, ప్రమాణాలకూ అనుగుణమైనదో పాకిస్తాన్‌కే తెలియాలి. కనీసం న్యాయంగా వ్యవహరిస్తున్నట్టు కనబడినా ఇవాళ ఐసీజే ముందు దానికి తలవంపులు తప్పేవి. పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు 1963 నాటి వియన్నా ఒడంబడికకు విరుద్ధమని మన దేశం చేసిన వాదనతో ఐసీజే ఏకీభవించింది. కుల్‌భూషణ్ ఉరి తేదీని ప్రకటించలేదు గనుక ఈ దశలో తాత్కాలిక ఆదేశాలు ఇవ్వనవసరం లేదన్న పాక్ వాదన వీగిపోయింది. నిజానికి ఐసీజే తుది తీర్పు వెలువరించే వరకూ మరణశిక్ష అమలు ఉండదని పాకిస్తాన్ హామీ ఇచ్చి ఉంటే ప్రస్తుత ఆదేశాలు అవసరమయ్యేవి కాదు. ఈ కేసులో పాకిస్తాన్ మరో రకమైన వాదన కూడా చేసింది. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం దేశ భద్రతతో ముడిపడి ఉన్న కేసుల్లోని నిందితులకు దౌత్య అధికారులు కలిసే అవకాశం ఉండదని ఐసీజేకు తెలిపింది. గతంలో తమ దేశ పౌరులు పట్టుబడినప్పుడు భారత్ కూడా ఇలాగే చేసిందని వాదించింది. కానీ మన దేశంలో అలాంటివారిపై వచ్చిన అభియోగా లను పౌర న్యాయస్థానాలు బహిరంగంగా విచారించాయి. పాక్ తీరు ఇందుకు భిన్నం. కుల్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకే రెండు వారాల వ్యవధి తీసుకుంది. దానికి ముందు ఆయనతో ‘ఒప్పుకోలు ప్రకటన’ చేయించింది. న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలం నమోదులోనూ ఎడతెగని జాప్యం చేసింది. ఇదంతా భారత్‌ను కవ్వించడమే. ఈ విషయంలోమన స్పందనేమిటో చూడాలని పాక్ సైన్యం తహతహలాడినట్టుంది. అయితే ఐసీజే ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు మన దేశానికి నైతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. తమ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాల్లో ఐసీజే జోక్యాన్ని అంగీకరించబోమని పాకిస్తాన్ ఇప్పుడు అంటోంది. తనకు వ్యతిరేకమైన తీర్పు వచ్చినాక చేస్తున్న ఈ వాదన వల్ల దెబ్బతినేది ఆ దేశ పరువే. ఆ అభిప్రాయమేదో ముందే చెప్పి ఐసీజే విచారణను బహిష్కరించి ఉంటే వేరుగా ఉండేది. నిజానికి నిరుడు ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించినప్పుడు కుల్‌భూషణ్ ప్రస్తావన తీసుకురానందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్కడి సైనిక అధికారులు విరుచుకుపడ్డారు. తీరా ఐసీజే ముందుకు ఈ కేసు వచ్చినప్పుడు సమర్ధవంతమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యారు. ఇంతకూ ఐసీజే తీర్పు ఇవ్వగలదు తప్ప దాన్ని అమలు చేయించలేదు. అలా అమలు చేయించే అధికారం భద్రతామండలికి ఉన్నా అది అంతర్జాతీయ శాంతి సుస్థిరతలకు భంగం వాటిల్లే సందర్భాల్లో మాత్రమే. ఈ కేసు ఆ పరిధిలోనికి రాదని చెప్పి అది తప్పించుకోవచ్చు. అసలు పాకిస్తానే కేసు విచారణను బేఖాతరు చేయొచ్చు. అమెరికా, చైనాలు అలా చేసిన సందర్భాలున్నాయి. అవి పెద్ద దేశాలు గనుక చెల్లు బాటు అయిందిగానీ పాక్ అలా సాహసించబోదన్న వాదనలున్నాయి. ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో భారత్ తీసుకునే చర్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి న్యాయం కావాలని కోరే నైతిక హక్కు అది కోల్పోతుంది. ఇప్పుడు కుల్‌భూషణ్ సురక్షితంగా వెనక్కి రావడంతోపాటు ఉగ్రవాదం విషయంలో మనపై పాక్ చేస్తున్న వాదనల్లోని డొల్లతనం బయటపడటం కూడా ఎంతో అవసరం. ఈ కేసులో మరింత జాగ్రత్తగా అడుగులేసి విజయం సాధించేందుకు మన న్యాయవాదులు కృషి చేయవలసి ఉంటుంది. -
‘హేగ్’లో భారత్ గెలుపు
► అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ ► కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షపై స్టే ⇒ తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాక్‌కు ఆదేశం ⇒ జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయి ⇒ ఆయనకు దౌత్యపరమైన సాయం అందలేదు ⇒ ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.. వియన్నా ఒప్పందానికి వ్యతిరేకం ⇒ జాధవ్‌కు దౌత్యపర సాయం అందేందుకు వీలు కల్పించాలిæ ⇒ భారత్‌కు దౌత్య విజయం.. దేశంలో సంబరాలు ⇒ ప్రధాని మోదీ హర్షం.. సుష్మాపై రాజ్‌నాథ్ ప్రశంసలు ⇒ ఐసీజే తీర్పును అంగీకరించబోమన్న పాక్ ⇒ అయినా ఆగస్టు వరకూ మరణశిక్ష అమలు చేయబోమని హామీ ⇒ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమన్న పాక్ న్యాయవాది ది హేగ్/న్యూఢిల్లీ కుల్‌భూషణ్ జాధవ్‌కు మరణశిక్ష కేసులో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ తీరు సరిగా లేదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది. ఈ కేసులో తుది తీర్పు వెలువరించేవరకు జాధవ్‌కు మరణశిక్షను అమలు చేయరాదని ఆదేశిస్తూ.. స్టే విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. మరోవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పాకిస్తాన్ తప్పుబట్టింది. ఈ తీర్పును తాము అంగీకరించబోవడం లేదని పేర్కొంది. అయితే ఆగస్టు వరకూ జాధవ్‌కు మరణశిక్షను అమలుచేయబోమని, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమని పాకిస్థాన్ తరఫు న్యాయవాది అంతర్జాతీయ న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ఇక జాధవ్ మరణశిక్ష అమలుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. జాధవ్‌ను రక్షించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఐసీజే ధర్మాసనం తీర్పు భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ (46)కు గూఢచర్యం కేసులో పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్ వాదనలు వినిపించాయి. పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్ తప్పుబట్టింది. జాధవ్ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది. అరెస్టు పరిస్థితులూ వివాదాస్పదం.. జాధవ్ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయని ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం పేర్కొన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం (1977లో భారత్–పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) కుల్‌భూషణ్ జాధవ్‌కు భారత్ దౌత్యపరమైన సాయం చేసేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. తుది తీర్పు ఇచ్చేంతవరకు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించారు. ఇక దౌత్యపరమైన సాయానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాధవ్ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని స్పష్టమైందని ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ భండారి (భారత్) పేర్కొన్నారు. జాధవ్‌ను అరెస్టు చేసినప్పటినుంచి మరణశిక్ష విధించేవరకు కూడా దౌత్యపరమైన సాయానికి అనుమతించాలంటూ భారత ప్రభుత్వం 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరణకు గురైందనేది సుస్పష్టమని వ్యాఖ్యానించారు. కోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఆగస్టు వరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుచేయమని, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో భరోసా ఇవ్వలేమని పాకిస్తాన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా.. జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతకుముందే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఐసీజే లేఖ రాసింది. సుష్మా చొరవ భేష్! ఐసీజే తీర్పుపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కీలకంగా వ్యవహరించి భారత్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్ సాల్వేను అభినందించారు. కుల్‌భూషణ్ జాధవ్‌ను కాపాడటంలో ప్రతి చిన్న అవకాశాన్నీ వినియోగించుకుంటామని సుష్మాస్వరాజ్ ట్వీటర్లో ట్వీట్ చేయగా.. మోదీ దానిని రీట్వీట్ చేశారు. ‘‘పాకిస్తాన్ తప్పు చేసినట్లు తేలిపోయింది. వియన్నా ఒప్పందం ప్రకారం వారు జాధవ్‌కు దౌత్య సాయం అందించాల్సిందే..’’అని మోదీ పేర్కొన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. భారతీయులంతా ఈ తీర్పుపై ఆనందంగా ఉన్నారని, ఈ కేసులో సుష్మా వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అభినందించారు. న్యాయవ్యవస్థ పేరుతో పాక్‌లో జరుగుతున్న అపహాస్యానికి ఈ తీర్పు ఎదురుదెబ్బ అని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పాక్ ఐసీజే తీర్పును అంగీకరించబోమంటే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని... ఆ దేశం తనను తాను మరింత తప్పులోకి నెట్టేసుకున్నట్లేనని చెప్పారు. వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. ఇది భారత్‌కు గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఇక కోర్టు తీర్పు ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కల్పించిందని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే చెప్పారు. ‘40 ఏళ్లుగా న్యాయవాదిగా ఉన్నాను. న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారో అర్థమవుతుంది. కేసు వాదిస్తున్నప్పుడే పాజిటివ్‌గా అనిపించింది. ఆ పాజిటివ్ శక్తే న్యాయమూర్తులతో అనుసంధానం చేసింది’అని పేర్కొన్నారు. జాధవ్ మిత్రుల సంబరాలు జాధవ్ మరణశిక్షపై ఐసీజే స్టే విధించటంతో జాధవ్ మిత్రులు సంబరాలు చేసుకున్నారు. ముంబైలో లోయర్ పరేల్‌లోని సిల్వర్ ఓక్ అపార్ట్మెంట్ వద్ద టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశారు. ‘125 కోట్ల భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఐసీజేకు ధన్యవాదాలు’అని జాధవ్ బాల్యమిత్రుడొకరు పేర్కొన్నారు. జాధవ్ క్షేమంగా తిరిగొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తీర్పును అంగీకరించబోం: పాక్ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను షాక్‌కు గురిచేసిందని.. తమ దేశ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో ఐసీజే తీర్పును అంగీకరించడం లేదని పేర్కొంది. జాధవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లడం ద్వారా అసలురంగు బయటపడకుండా భారత్ జాగ్రత్తపడుతోందని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా విమర్శించారు. ‘‘భారత్ పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, వారికి ఆర్థికసాయం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ అంశంపై చర్చ జరగకుండా ఉండేందుకే జాధవ్ కేసులో మానవ హక్కుల ఉల్లంఘనను తెరపైకి తెచ్చింది..’’అని వ్యాఖ్యానించారు. ఇక జాధవ్ మరణశిక్ష అమలుపై స్టే విధించే హక్కు ఐసీజేకు లేదని పాక్ న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. ఐసీజేలో పాకిస్తాన్ వాదన సరిగా లేకపోవడమే పాక్‌కు వ్యతిరేకంగా తీర్పు రావటానికి కారణమైందని పేర్కొన్నారు. ‘‘జాధవ్ కేసును వాదిస్తున్న న్యాయవాదులకు కనీస అనుభవం లేదు. కోర్టు ఇచ్చిన 90 నిమిషాల్లో సరైన వాదనలు వినిపించలేక పోయారు. పాక్ వాదనలో పసలేదు.’’అని ఆ దేశ మాజీ అటార్నీ జనరల్ ఇర్ఫాన్ ఖాదిర్ వ్యాఖ్యానించారు. కోర్టులో విచారణ తీరు ఇలా... భారతీయ నావికాదళ మాజీ అధికారి కులభూషణ్జాధవ్ విషయంలో పాకిస్తాన్ వెలిబుచ్చిన అభ్యంతరాలను అంతర్జాతీయ న్యాయస్థానం హేతుబద్ధమైన వాదనలతో తిప్పికొట్టింది. అదెలా సాగిందంటే... ♦ అంతర్జాతీయ న్యాయస్థానం ముందుగా తనకు ఈ కేసును విచారించే పరిధి ఉందా? లేదా? అన్న అంశాన్ని చేపట్టింది. వియన్నా ఒప్పందం ఆప్షనల్ ప్రొటోకాల్ ఆర్టికల్ ఒకటి ప్రకారం... ఒప్పందం అమలులో ఏర్పడే వివాదాలపై కూడా విచారించే పరిధి ఐసీజేకు ఉంటుంది. భారత్ ఇందుకు అంగీకరిస్తే... పాక్ విభేదించింది. అయితే జాధవ్ అరెస్ట్ విషయాన్ని పాక్ తమకు తెలపలేదని, అతడితో మాట్లాడేందుకు దౌత్యవేత్తలనూ అనుమతించలేదని భారత్ చెప్పడాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ విషయంలో వివాదమున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి ఈ కేసును విచారించే పరిధి తమకు ఉన్నట్లేనని ఐసీజే స్పష్టం చేసింది. ♦ పాకిస్తాన్ దౌత్య పరంగా తమ హక్కులను ఉల్లంఘించిందన్న భారత్ ఆరోపణలు ఆమోదయోగ్యమైనవేనని ఐసీజే స్పష్టం చేసింది. ఇతర దేశాల పౌరులను అరెస్ట్ చేసినప్పుడు ఆ విషయాన్ని వీలైనంత తొందరగా ఆ దేశ దౌత్య కార్యాలయానికి తెలపడం, దౌత్య సిబ్బందితో మాట్లాడే అవకాశం కల్పించడం అనేవి పౌరుడిని అరెస్ట్ చేసిన దేశం బాధ్యతలు. జాధవ్ విషయంలో పాక్ వీటిని అమలు చేయకపోవడం భారత్‌కు ఉన్న హక్కులను ఉల్లంఘించడమే. ♦ జాదవ్‌కు ఉరిశిక్ష విధించారనీ, దీన్ని ఎప్పుడైనా అమలు చేయవచ్చునన్న అంశం ఈ కేసును అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని చెబుతోందని ఐసీజే తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులోపు అతడిని ఉరితీయబోమని పాకిస్తాన్ పరోక్షంగా సూచించినప్పటికీ ఆ తరువాత ఎప్పుడైనా శిక్ష అమలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసును అత్యవసరంగా విచారించి తీర్పునిస్తున్నట్లు ఐసీజే తెలిపింది. విచారణ ఆలస్యమైతే సరిదిద్దలేని అన్యాయం జరిగే అవకాశముందని అభిప్రాయపడింది. -
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగింది
ఇస్లామాబాద్: కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించడంతో పాకిస్తాన్‌కు షాక్ తగిలినట్టైందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఐసీజే నిర్ణయం పాకిస్థాన్‌కు దిగ్భ్రాంతి, అసంతృప్తి కలిగించిందని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. జాధవ్‌కు విధించిన మరణశిక్షపై స్టే విధించే అధికారం ఐసీజేకు లేదని పాకిస్తాన్ విశ్లేషకులు పేర్కొన్నట్టు తెలిపింది. పాక్ న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించలేకపోయారని పేర్కొన్నారు. ఐసీజే ముందు హాజరయి తమ దేశం తప్పుచేసిందని, విచారణకు హాజరుకాకుండా ఉండాల్సిందని రిటైర్డ్ జస్టిస్ షాయిఖ్ ఉస్మానీ అభిప్రాయపడ్డారు. స్టే కొనసాగినంత కాలం జాధవ్‌కు మరణశిక్ష అమలు చేయడానికి వీలులేదన్నారు. వాదనలకు ఇచ్చిన 90 నిమిషాల సమయాన్ని పాకిస్తాన్ లాయర్లు వినియోగించుకోలేకపోయారని లండన్‌కు చెందిన న్యాయవాది అస్లాం రషీద్ పేర్కొన్నారు. తక్కువ సమయంలో వాదనలు ముగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసును సరిగా ప్రజెంట్ చేయలేకపోయారని, బలమైన వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు. ఐసీజే నిర్ణయానికి చట్టబద్దంగా కట్టుబడాల్సిన అవసరం లేదని, నైతికంగా మాత్రమే అమలు చేయాల్సివుంటుందని విశ్లేషకుడు జాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విఘాతం కలిగించేలా ఐసీజే నిర్ణయం ఉందని మాజీ అటార్నీ జనరల్ ఇర్ఫాన్ ఖాదిర్ అన్నారు. ఐసీజే నిర్ణయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని న్యాయవాది ఎ. నసీమ్ వ్యాఖ్యానించారు. -
కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరి నుంచి ఊరట
-
కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరి నుంచి ఊరట
అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్‌కు ఊరట లభించింది. తాము తుది తీర్పు వెల్లడించేవరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలుచేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించింది. అంతేకాక, జాదవ్‌ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందంటూ పాకిస్తాన్‌కు మొట్టికాయలు వేసింది. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషణ్ జాదవ్ (46) కేసులో ఇరు దేశాలు తమ తమ వాదనలను గట్టిగా వినిపించాయి. అనంతరం 11 మంది జడ్జీలతో కూడిన బెంచ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టాలంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. జస్టిస్ రోనీ అబ్రహాం విషయం తెలిపారు. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పాక్ ఆరోపించింది. అయితే, అతడిని ఇరాన్లో కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లి అక్రమంగా కేసులు పెట్టారని భారత్ వాదించింది. అంతే కాక, జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత రాయబారి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈనెల 8న మనదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై తొలుత స్టే విధించింది. ఈ కేసులో భారత్ తరఫున హరీశ్ సాల్వే, పాక్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన హరీశ్ సాల్వే.. ఈ కేసులో వాదించేందుకు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారు. విదేశీ పౌరుడిని అరెస్టు చేసిన సమయంలో కాన్సల్ జనరల్‌కు అతడిని కలిసేందుకు అవకాశం కల్పించాలని వియన్నా ఒప్పందం చెబుతోంది. కానీ పాక్ మాత్రం ఈ కేసులో జాదవ్‌కు అసలు కాన్సులర్ యాక్సెస్ కల్పించలేదు. దాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని చెప్పింది. భారత్, పాక్ రెండు దేశాలూ వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని జడ్జి రోనీ అబ్రహాం చెప్పారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో్ భారత్ పాక్షిక విజయం సాధించింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. జాదవ్‌ను కలుసుకునే హక్కు భారతీయ దౌత్యాధికారులకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఈ కేసులో హరీష్ సాల్వే వాదనలు ఫలించినట్లే అయ్యాయి. -
హరీష్ సాల్వే ఫీజు.. ఒక్క రూపాయే!
-
హరీష్ సాల్వే ఫీజు.. ఒక్క రూపాయే!
ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఏదైనా కేసు ఒప్పుకున్నారంటే ఒక్క రోజుకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఫీజు తీసుకుంటారు. కానీ ఆ ఒక్క కేసు విషయంలో మాత్రం.. ఆయన డబ్బులను ఏమాత్రం లెక్కచేయలేదు. దేశభక్తి ముందు డబ్బులు తనకు బలాదూర్ అని చెప్పి, కేసు మొత్తం వాదించినందుకు కేవలం ఒకే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటున్నారు. అది ఏం కేసని అనుకుంటున్నారా? పాకిస్తాన్లో గూఢచారి అని ముద్రవేసి మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ కేసు. అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న ఈ కేసులో భారతదేశం తరఫున ఆయన వాదిస్తున్నారు. సాల్వే నిర్ణయం తెలిసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆశ్చర్యపోయారు. హరీష్ సాల్వే సాధారణంగా సుప్రీంకోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోనే వాదిస్తారు. అరుదుగా మాత్రమే వేరే కోర్టులకు వస్తారు. చాలా పెద్ద కేసు అనుకున్నప్పుడు, ప్రతిష్ఠాత్మకంగా భావించినప్పుడు మాత్రమే ఆయనను తీసుకొస్తారు. సాల్వేకి యాపిల్ ఉత్పత్తులంటే చాలా ఇష్టం. అవి లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన ఇంట్లో ఉండాలి. పియానో వాయిస్తారు, జాజ్ అంటే ఇష్టం, అప్పుడప్పుడు తన బెంట్లీ కారును స్వయంగా నడుపుకొంటూ వెళ్తారు. గతంలో భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ వద్ద సాల్వే పనిచేశారు. సల్మాన్ ఖాన్, ముఖేష్ అంబానీ లాంటి పెద్దవాళ్ల తరఫున వాదించిన హరీష్ సాల్వే.. గుజరాత్ అల్లర్ల కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ కోరిక మేరకు బిల్కిస్ బానో తరఫున వాదించారు. గతంలో ఇదే అంతర్జాతీయ కోర్టులో మార్షల్ ఐలండ్స్ విషయంలో భారత్ మీద వచ్చిన వివాదాన్ని ఆయన విజయవంతంగా తిప్పికొట్టారు. -
జాధవ్ మరణశిక్ష ఆపండి
-
జాధవ్ మరణశిక్ష ఆపండి
తాత్కాలికంగా నిలుపుదల చేయండి: ఐసీజేలో భారత్ - లేదంటే విచారణ పూర్తయ్యేలోగా ఉరితీసే ప్రమాదముంది - వియన్నా ఒప్పందాన్నీ పాక్ ఉల్లంఘించింది - ఆ ఒప్పందం వర్తించదంటూ వాదించిన పాక్ - హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు ద హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి(ఐసీజే) భారత్ విజ్ఞప్తిచేసింది. లేదంటే ఐసీజేలో విచారణ పూర్తి కాకముందే జాధవ్‌ను పాకిస్తాన్ ఉరితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. జాధవ్‌కు మరణశిక్షపై భారత్ అభ్యంతరాల నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం విచా రణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. పరిస్థితి చాలా తీవ్రమైంది కావడంతో ఇంత తక్కువ సమయంలో ఐసీజేను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అయితే పాక్‌కు వ్యతిరేకంగా గూఢచర్య విధులు నిర్వర్తించిన జాధవ్‌కు వియన్నా ఒప్పందం వర్తించదని, మరణశిక్షపై స్టే పొందడమే భారత్ అసలైన లక్ష్యమని పాకిస్తాన్ ఆరోపించింది. వీలైనంత త్వరగా తీర్పును వెలువరిస్తామని, తేదీని తగిన సమయంలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం స్పష్టం చేసింది. సాల్వే ఫీజు ఒక్క రూపాయే! జాధవ్ మరణశిక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరఫున కేసు వాదించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించారు. ఐసీజేలో భారత్ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాదుల బృందానికి హరీష్ సాల్వే నేతృత్వం వహిస్తున్నారు. జాధవ్‌పై అభియోగాలన్నీ అవాస్తవం విచారణ ప్రారంభం కాగానే విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ మాట్లాడుతూ.. జాధవ్‌కు న్యాయ సాయం పొందే హక్కును తిరస్కరించారని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వెల్లడించారు. దాదాపు 90 నిమిషాల పాటు భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ► జాధవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత్ 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించింది. ► కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్ని అందించేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. చార్జ్‌షీట్ కాపీని కూడా ఇవ్వలేదు. ► జాధవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి, మిలిటరీ నిర్బంధంలో బలవంతంగా నేరవాంగ్మూలం నమోదుచేశారు. జాధవ్ కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా న్యాయ నిర్బంధంలో ఉంచారు. ► మరణవిక్ష విధిస్తూ పాకిస్తాన్ సైనిక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. ► జాదవ్‌పై మోపిన అభియోగాలన్నీ అవాస్తవం. ► జాధవ్‌కు దౌత్యసాయాన్ని నిరాకరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించగా... మరణశిక్షపై స్టే విధించిన ఐసీజే అత్యవసర విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పీలుకు 150 రోజుల సమయమిచ్చాం అయితే భారత్ వాదనల్ని పాక్ తోసిపుచ్చింది. అంతర్జాతీయ కోర్టును భారత్ రాజ కీ య వేదికగా వాడుకుంటుందని ఆరోపించింది. ఉగ్ర కార్యకలాపాల్లో ప్రమేయమున్న గూఢచారి విషయంలో వియన్నా ఒప్పందంలోని నిబంధనలు వర్తించవని వాదించింది. ► జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేసుకునేందుకు 150 రోజుల సమయం ఇచ్చాం. ► జాధవ్‌ను అరెస్టు చేసినప్పుడు అతని పాస్‌పోర్ట్ కాపీని భారత్‌కు అందచేశాం. అనంతరం నేరవాంగ్మూలం వీడియోను అందచేసినా ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. జాధవ్ పాస్‌పోర్టులో ముస్లిం పేరుపై ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. ► జాధవ్ దౌత్యపరమైన సంప్రదింపులకు అర్హుడుకాదు. భారత్ దరఖాస్తు విచారణ అత్యవసరం కాదని, దానిని తిరస్కరించాలి. ► ఇరాన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన కుల్‌భూషణ్‌ను బలూచిస్తాన్‌లో అదుపులోకి తీసుకున్నాం. హడావుడిగా విచారించి శిక్ష విధించారన్న భారత్ ఆరోపణలు నిజం కాదు. ► స్టే ఉత్తర్వులు పొందడమే భారత్ అసలైన, నిజమైన లక్ష్యం. పాకిస్తాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసినా.. అందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. ► ఈ సందర్భంగా నేరాన్ని ఒప్పకుంటూ జాధవ్ ఇచ్చిన వాంగ్మూల వీడియోను చూపిస్తామని ఖురేషి కోర్టుకు తెలపగా ఐసీజే అందుకు నిరాకరించింది. -
కులభూషణ్ ఉరిపై మొదలైన వాదనలు
-
కులభూషణ్ ఉరిపై మొదలైన వాదనలు
హేగ్ : అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మళ్లీ తలపడ్డాయి. కులభూషణ్ జాదవ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు మొదలయ్యాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్భూషన్ జాధవ్(46) కేసులో ఇరు దేశాలు వాదనలు కొనసాగుతున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషన్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఈ 8న మనదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తాజాగా నేడు రెండు దేశాలు తమ వాదనలు వినిపిస్తున్నారు. న్యాయమూర్తి అబ్రహం ఇరు దేశాలకు తమ తమ వాదనలు వినిపించేందుకు చెరో 90 నిమిషాల సమయం కేటాయించారు. జాదవ్ అమాయకుడని, అతడి ఉరిశిక్షపై మరోసారి మిలటరీ కోర్టులో విచారణ చేపట్టాలని భారత్ కోరింది. కాగా భారత్ తరఫున హరీశ్ సాల్వే, పాక్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపిస్తున్నారు. అవసరం అయితే వాదనలు పొడిగించే అవకాశం ఉంది. కాగా చివరిసారిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్‌లు 18 ఏళ్ల క్రితం తలబడ్డాయి. -
ఐసీజే వేదికగా భారత్–పాక్ ఢీ
-
ఐసీజే వేదికగా భారత్–పాక్ ఢీ
నేడు అంతర్జాతీయ న్యాయస్థానంలో జాధవ్ అంశంపై విచారణ ► 18 ఏళ్ల క్రితం ఐసీజేలో భారత్‌పై కేసు ఓడిన పాకిస్తాన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మరోసారి తలపడుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్భూషన్ జాధవ్(46) కేసులో ఇరు దేశాలు వాదనల్ని వినిపించనున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెల్లో జాధవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాధవ్‌ను కలిసేందుకు అనుమతించాలని 16 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని మే 8న భారత్ ఆశ్రయించింది. చివరిసారిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాకిస్తాన్‌లు 18 ఏళ్ల క్రితం తలబడ్డాయి. తమ నౌకా దళ విమానాన్ని భారత్ కూల్చివేసిందని, జోక్యం చేసుకోవాలంటూ ఐసీజేను పాకిస్తాన్ కోరింది. 1999, ఆగస్టు 10న భారత్ భూభాగంలోని కచ్ ప్రాంతం గగనతలంపైకి వచ్చిన పాకిస్తాన్ నేవీ విమానం అట్లాంటిక్యూను భారత ఎయిర్‌ఫోర్స్ విమానం కూల్చివేసింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం పాకిస్తాన్లో ఉండగానే కూల్చారని, పరిహారంగా భారత్ రూ. 390 కోట్లు(అప్పటి లెక్క ప్రకారం) చెల్లించాలం టూ పాకిస్తాన్ ఐసీజేను ఆశ్రయించింది. అయితే జూన్ 21, 2000న 16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం పాకిస్తాన్ వాదనను 14–2 తేడాతో తోసిపుచ్చింది. ధర్మాసనానికి ఫ్రాన్స్‌కు చెందిన గిల్బర్ట్ గుయోమ్ అధ్యక్షతన వహించారు. ఈ తీర్పు అంతిమం కావడంతో పాకిస్తాన్‌కు అప్పీలుకు వీలులేకుండా పోయింది. పాక్ వాదనల్ని తోసిపుచ్చిన ఐసీజే మొత్తం నాలుగు రోజుల విచారణ ఏప్రిల్ 6, 2000న ముగియగా.. కేసు కోర్టు పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశంపైనే వాదనలు కొనసాగాయి. ఈ అంశం కోర్టు పరిధిలోకి వస్తుందా? రాదా? అన్నది తేల్చేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. భారత్ తరఫున అప్పటి అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ వాదనలు వినిపిస్తూ.. కేసు విచారణ పరిధిపై ప్రా«థమిక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాకిస్తాన్ పూర్తి బాధ్యత వహించాలని, పరిణామాలు కూడా అనుభవించాల్సిందేనని ఆయన వాదించారు. కేసులో త్వరగా తీర్పు వెలువరించాలంటూ పాకిస్తాన్ అటార్నీ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. కేసును కశ్మీర్ అంశం, కార్గిల్ యుద్ధం, భారత్ పాక్ సంబంధాలకు ముడిపెడుతూ రాజకీయం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించగా భారత్ అభ్యంతరం తెలిపింది. -
పాకిస్తాన్ మొండి వైఖరి
-
పాకిస్తాన్ మొండి వైఖరి
ఇస్లామాబాద్: భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్ష విధించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ముందు కూడా గట్టిగా సమర్థించుకునేందుకు పాకిస్తాన్ వ్యూహం రచిస్తోంది. గూఢచర్యం, విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాక్ మిలిటరీ కోర్టు జాధవ్‌కు విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జాధవ్ కేసుకు సంబంధించి తమ సిఫారసులను ప్రధాన మంత్రికి, విదేశీ కార్యాలయానికి పంపామని పాక్ అటార్నీ జనరల్ అస్తార్ ఔసఫ్ చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో పాక్ గట్టి సమాధానమే ఇస్తుందని ఔసఫ్ చెప్పారు. ఈ నెల 15న ప్రారంభమయ్యే ఐసీజే విచారణకు ఔసఫ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రెండు రోజులుగా అధికారులతో, విదేశీ కార్యాలయం, న్యాయ మంత్రిత్వశాఖతో నిర్విరామంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఐసీజే ముందు అధికార పరిధి గురించి పాక్ ప్రస్తావించ వచ్చని అంతర్జాయ చట్టాలపై అవగాహన కలిగిన న్యాయ నిపుణుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. 1999లో అట్లాంటిక్ విమానం షూటింగ్‌కు సంబంధించి భారత్ కూడా అధికార పరిధి గురించి ప్రస్తావించిందని గుర్తు చేశారు. -
జాధవ్‌పై స్టేను విశ్లేషిస్తున్నాం
-
జాధవ్‌పై స్టేను విశ్లేషిస్తున్నాం
ఐసీజే మరణదండన నిలుపుదల ఉత్తర్వులపై పాక్ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: గూఢచర్యం కేసు లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పును విశ్లేషిస్తున్నట్లు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. కొద్దిరోజుల్లో దీనిపై ప్రకటన చేయనున్నట్లు పాక్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తార్ అజీజ్ వెల్లడించారు. ఈ కేసులో భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను, స్టే విధించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్న అధికారాన్ని విశ్లేషిస్తున్నా మన్నారు. ఉత్తర్వుపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వాతో చర్చించారు. పాక్‌లో భారత్ ఎగదోస్తున్న ఉగ్రవాదం నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకు జాదవ్ మరణశిక్షను భారత్ ఉపయోగించుకుంటోందని, ఇందులో భాగంగానే అంతర్జాతీయ న్యాయస్థానానికి లేఖ రాసిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఇటీవల ట్వీట్ చేశారు. ఐసీజేలో భారత్ పిటిషన్ వేయడాన్ని పాక్ మీడియా విమర్శించింది. ప్రాణహాని ఉన్నందుకే: పాక్‌లో అక్రమ నిర్బంధంలో ఉన్న జాధవ్‌కు ప్రాణహాని ఉన్నందుకే ఐసీజేను ఆశ్రయించామని, ఇది జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. కాగా, ఈ నెల 15న జాధవ్ కేసుపై బహిరంగ విచారణ జరుపుతామని ఐసీజే తెలిపింది. -
కులభూషణ్ శవాన్ని పంపుతాం
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్షమైన ఫోటో సంచలనం రేపింది. పాకిస్తాన్లో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్ జాధవ్ మృతదేహం పంపిస్తామంటూ అతడి ఫొటోతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా మెసేజ్ పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. దుండగులు ఏఐఎఫ్ఎఫ్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ దురాగతానికి దిగినట్టు తేలింది. ‘కులభూషణ్ జాధవ్ తిరిగి రావాలని కోరుకుంటున్నారా? అతడి విడుదల కోసం డిమాండ్ చేస్తారా? కులభూషణ్ మృతదేహాన్ని పంపిస్తామ’ని దుండగులు సందేశం పోస్ట్ చేశారు. తమ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందని ట్విటర్ ద్వారా ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. హ్యాకింగ్‌కు గురైన తర్వాత ఇంటర్నెట్ నుంచి ఏఐఎఫ్ఎఫ్ వెబ్సైట్ అదృశ్యమైంది. వెబ్‌సైట్‌ను త్వరలో పునరుద్ధరిస్తామని, అసౌకర్యానికి క్షమించాలని ఏఐఎఫ్ఎఫ్ పేర్కొంది. హ్యాకర్లు ఎవరనేది వెల్లడికాలేదు. -
కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
-
కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం...ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ () మంగళవారం స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు పాక్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించడం, ఆయనను ఉరి తీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. -
భారత్ నివేదనను తిరస్కరించిన పాక్
- కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షపై తల్లి అప్పీలు - పాక్ విదేశాంగ కార్యదర్శితో భారత రాయబారి చర్చలు విఫలం ఇస్లామాబాద్: మరణ శిక్షకు గురైన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ మరోసారి కరుకుతనాన్ని ప్రదర్శించింది. కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించడంతోపాటు, ఒకమారు కలుసుకునే అవకాశం కల్పించాలన్న అతని తల్లి నివేదనను దాయాది ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. బుధవారం పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనా జాంగ్వాతో భారత రాయబారి గౌతం బంబావాలే జరిపిన చర్యలు విఫలం అయ్యాయి. భారత నౌకాదళం మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ యాదవ్ ను గూఢచారిగా పేర్కొంటూ పాక్ ఆర్మీ కోర్టు అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్ష రద్దు కోసం భారత్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కుల్ భూషణ్ భవితవ్యంపై అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కన్నతల్లి రోదననూ పట్టించుకోలేదు.. పాకిస్థాన్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 133(బి) ప్రకారం.. ఆర్మీ కోర్టు విధించే శిక్షలను ప్రభుత్వం రద్దుచేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారమే తన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కుల్ భూషణ్ తల్లి.. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. కన్నకొడుకును చూసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రాధేయపడింది. ఈ మేరకు ఆమె చేసుకున్న అప్పీలు పత్రాలను భారత రాయబారి గౌతం బాంబావాలే.. పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనాకు అందించారు. దీనిపై తెహ్మీనా బదులిస్తూ 'సాధారణ ఖైదీల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉండేదేమో, కానీ, గూఢచారుల విషయంలో, వారికి విధించిన శిక్షల విషయంలో మేమేమీ చెయ్యలేం..'అని తేల్చిచెప్పారు. ఈ ప్రయత్నం కూడా విఫలం కావడంతో కుల్ భూషణ్ విషయంలో భారత ప్రభుత్వం తర్వాతి అడుగు ఏమిటనేది ఆసక్తిగా మారింది. -
జాదవ్కోసం అమెరికాలో పోరుబాట
-
జాదవ్కోసం అమెరికాలో పోరుబాట
వాషింగ్టన్: గూఢచర్యం కేసులో ఉరి శిక్ష పడి ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు భారత్ నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా మద్దతు మొదలైంది. అమెరికాలోని భారతీయ అమెరికన్లు జాదవ్ కోసం నడుంకట్టారు. వైట్ హౌస్ పిటిషన్‌ను ప్రారంభించారు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారని ఆరోపిస్తూ పాక్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ చర్యను తీవ్రంగా ఖండిస్తూ భారత్ మొత్తం ఒక్కతాటిపై వచ్చింది. జాదవ్‌ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని అక్కడ ఉన్న భారతీయులు వైట్ హౌస్ పిటిషన్ ప్రారంభించారు. ఎస్.ఎస్ అనే ఓ వ్యక్తి అమెరికా వైట్ హౌస్‌కు అర్జీలు పెట్టుకునే ‘వీ ది పీపుల్ పిటిషన్’అనే వైట్ హౌస్ వెబ్సైట్లో ఈ పిటిషన్ ప్రారంభించారు. మే 14లోపు దీనిపై లక్ష సంతకాలు చేస్తే ట్రంప్ పరిపాలన వర్గం స్పందిస్తుంది. జాదవ్‌పై పాక్ చేసిన ఆరోపణలు మొత్తం కూడా అసత్యాలంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. -
ఐక్యరాజ్యసమితికి జాధవ్ పత్రాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్షకు గురైన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు సంబంధించిన కీలక పత్రాలను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు పాకిస్తాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనికి సంబంధించిన పత్రాలను పాక్ సిద్ధం చేసినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ పత్రాలను ఐక్యరాజ్యసమితితో పాటు ఇస్లామాబాద్‌లోని విదేశీ రాయబారులకు అందజేయనున్నట్టు పేర్కొంది. జాధవ్ తొలుత ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. కరాచీ, బలూచిస్తాన్‌లో గూఢచర్యం, విద్యోహ కార్యకలాపాలకు సంబంధించి ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఎదుట అతను ఇచ్చిన వాంగ్మూలానికి చెందిన పత్రాల ఆధారంగా ఈ తాజా పత్రాలను పాక్ సిద్ధం చేసిందని, వీటితో పాటు కోర్టు మార్షల్ జనరల్ నివేదికను, అలాగే కోర్టు విచారణ కాలక్రమానికి చెందిన పత్రాలను కూడా జత చేసినట్టు ద నేషన్ పత్రిక వెల్లడించింది. జాధవ్‌కు చెందిన స్థలాల్లో జరిగిన సోదాలు.. అరెస్టులకు సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 46 ఏళ్ల జాధవ్‌కు పాకిస్తాన్ సైనిక చట్టం ప్రకారం ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖుమర్ జాదవ్ బజ్వా గత వారం నిర్థారించారు. -
మళ్లీ మంటపెట్టి రెచ్చగొట్టిన పాకిస్థాన్
న్యూఢిల్లీ: పుండుమీద కారం చల్లినట్లుగా పాకిస్థాన్ మరో విషయం ప్రకటించింది. ఇప్పటికే కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత పరిస్థితి కనిపిస్తుండగా దానికి మరింత ఆజ్యం పోసేలాగా మరో ప్రకటన చేసింది. తాము మరో ముగ్గురు భారత గుఢాచారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)నే లక్ష్యంగా చేసుకొని గూఢచర్యం నిర్వహిస్తున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేశామని పాక్ తెలిపినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. ‘మేం ఖలీల్, ఇంతియాజ్, రషీద్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశాం. ఈ ముగ్గురు కూడా భారత్ ఇంటెలిజెన్స్ సంస్థ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) నుంచి జీతభత్యాలు పొందుతున్నవాళ్లే’ అని పాక్ పోలీసులు ప్రకటించారు. వీరు ముగ్గురు కొత్త కొత్త లక్ష్యాలు ఎన్నుకున్నారని, వాటిల్లో రావల్కోట్లోని మిలటరీ ఆస్పత్రి, సీపీఈసీ నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, చైనా కీలక ఇంజినీర్లు, సున్నితమైన ఏర్పాట్లకు సంబంధించిన రహస్యాలు తెలుకునేందుకు తాము అరెస్టు చేసిన ఈ ముగ్గురు గూఢచర్యం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భారత రా అధికారులు రంజీత్, మేజర్ సుల్తాన్, మరో అధికారి ఈ అరెస్టయిన వారితో టచ్‌లో ఉంటూ పనులు చక్కబెట్టించుకున్నారని కూడా పాక్ ఆరోపించింది. వీరు ఎన్నోసార్లు నియంత్రణ రేఖను దాటి భారత ఆర్మీ, రా అధికారులు నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారని కూడా పాక్ పేర్కొంది. గత ఏడాది అబ్బాస్పూర్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో కూడా వీరు ముగ్గురు నిందితులని భారీ ఆరోపణలు చేసింది. -
‘భారత్‌తో పాక్ డేంజర్ గేమ్.. తట్టుకోలేదు’
గోవా: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ చాలా ఆపాయకరమైన ఆట ఆడుతోందని రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఒక్కసారి భారత్ యాక్షన్‌కు దిగితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ సరైన ఆధారాలు చూపించకుండానే కులభూషణ్‌కు పాక్ ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారికర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కులభూషణ్ యాదవ్ పేరిట భారత్‌తో పాక్ చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది. భారత్ తిరుగుబాటుకు దిగితే తిరిగి పోరాడే శక్తి పాక్‌కు లేదు. వారిని వారు ఏ విధంగా రక్షించుకోలేరు. కానీ, మేం శాంతిని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. ఈ విషయం అర్ధం చేసుకొని జాదవ్‌ను తిరిగి పంపిస్తే ఆ దేశానికే మంచిది. ముందుగా ఒక విషయం చెప్పాలి. పాకిస్థానే ఇరాన్లో ఉన్న జాదవ్‌ను ఎత్తుకెళ్లింది. అరెస్టు సమయంలో పాక్‌లో లేడు. ఓ తాలిబన్ జాదవ్‌ను కిడ్నాప్ చేసి పాక్ తీసుకెళ్లినట్లు మాకు ఇరాన్ స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలు చేస్తుండటం పాక్‌కు అలవాటు. అవసరం అయితే ఆ దేశం ఇంకోలాగ కూడా చేస్తుంది. ఏదేమైనా జాదవ్‌ను ఉరి తీస్తే చూస్తూ ఊరుకోం. బదులిచ్చి తీరుతాం. ఈ విషయాన్ని ఇప్పటికే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు కూడా’ అని పారికర్ అన్నారు. -
జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేస్తాం.
-
జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేస్తాం
-
జాధవ్ మరణశిక్షపై అప్పీలు చేస్తాం
చార్జ్‌షీట్, తీర్పు కాపీలు ఇవ్వాలని పాక్‌ను కోరిన భారత్ ► దౌత్య అనుమతి కోసం మరోసారి విజ్ఞప్తి ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షపై అప్పీలుకు వెళ్తామని భారత్ స్పష్టం చేసింది. జాధవ్‌పై దాఖలైన చార్జిషీట్ వివరాలతో పాటు మరణశిక్ష విధిస్తూ పాక్ సైనిక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాపీల్ని అందించాలని పాక్‌ను కోరింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలతో జాధవ్‌కు ప్రమేయ ముందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగానే మరణశిక్ష విధించామని, 40 రోజుల్లో తీర్పుపై అప్పీలుకు వెళ్లవచ్చని పాక్ పేర్కొంది. జాధవ్‌ను కలిసేందుకు దౌత్య అనుమతిని పాక్ తిరస్కరించిన నేపథ్యంలో.. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతం బాంబావాలే శుక్రవారం పాక్‌విదేశాంగ కార్యదర్శి టెహ్మినా జంజువాను కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌ను కలిసేందుకు దౌత్యపరమైన అనుమతి ఇవ్వాలని మరోసారి కోరారు. బాంబావాలే మాట్లాడుతూ.. ‘తీర్పుపై మనం తప్పకుండా అప్పీలుకు వెళ్లాలి. అయితే చార్జ్‌షీట్, తీర్పు కాపీలు లేకుండా ఏమీ చేయలేం. ముందుగా పాక్ వాటిని భారత్‌కు అందించాలి’ అని తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ 1952, అధికారిక రహస్య చట్టం 1923ల కింద జాధవ్‌పై విచారణ నిర్వహించామని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి జంజువా పేర్కొన్నారు. భారత్ జైళ్లలో ఉన్న పాకిస్తానీయులతో మాట్లాడేందుకు దౌత్య అనుమతి కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తీర్పుకు వ్యతిరేకంగా జాధవ్ కుటుంబం అప్పీలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అప్పిలేట్ కోర్టు తిరస్కరిస్తే ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించవచ్చు: పాక్ ‘చట్టపరిధికి లోబడే జాదవ్‌పై విచారణ నిర్వహించాం’ అని పాకిస్తాన్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న సర్తాజ్ అజీజ్ అన్నారు. సైనిక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై 40 రోజుల్లోగా జాధవ్ మిలటరీ అప్పిలేట్ కోర్టును ఆశ్రయించవచ్చని.. ఒకవేళ ఆ విజ్ఞప్తిని అప్పిలేట్ కోర్టు తిరస్కరిస్తే... మరో 60 రోజుల్లోగా ఆర్మీ చీఫ్‌కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఆర్మీ చీఫ్ తిరస్కరిస్తే పాక్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవచ్చన్నారు. ఎవిడెన్స్ యాక్ట్ తో సహా సంబంధిత చట్టాలకు లోబడే సుధీర్ఘ విచారణ నిర్వహించామని, మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ సైతం రికార్డు చేశారన్నారు. తనను ముస్లింగా పేర్కొంటూ నకిలీ గుర్తింపుపత్రాన్ని జాధవ్ ఎందుకు వాడాడని, ఒక అమాయక మనిషి ఎందుకు రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడని, ఒక పాస్‌పోర్ట్‌లో హిందూ పేరు, మరో దాంట్లో ముస్లిం పేరు ఎందుకున్నాయని ప్రశ్నించారు. కాగా కుల్‌భూషణ్ యాదవ్‌కు ఏ న్యాయవాదైనా సాయం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని లాహోర్ హైకోర్టు బార్ అసోషియేషన్ హెచ్చరించింది. వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని బార్ అసోషియేషన్ సెక్రటరీ జనరల్ అమెర్ సయీద్ పేర్కొన్నారు. -
పాకిస్థాన్‌పై బాంబు వేసి, ఆయన్ను విడిపించండి
జంషెడ్పూర్: విశ్వ హిందూ పరిషత్ ఫైర్ బ్రాండ్ ప్రవీణ్ తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై భారత్ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించాలని తొగాడియా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చూసి భారత్ నేర్చుకోవాలని సూచించారు. శుక్రవారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తొగాడియా మాట్లాడుతూ.. ట్రంప్‌ను ప్రశంసించారు. అఫ్ఘానిస్థాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై ట్రంప్ బాంబు వేయించారని చెప్పారు. గూఢచర్యం కేసులో పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న జాదవ్‌ను విడిపించేందుకు భారత్ కూడా ఇలాంటి దాడి చేయాలని వ్యాఖ్యానించారు. 'వాషింగ్టన్కు 10 వేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న అఫ్ఘాన్‌లోని ఐఎస్ స్థావరాలపై అమెరికా బాంబు వేసింది. భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌పై బాంబు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలి. న్యూఢిల్లీకి పాకిస్థాన్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే భద్రత దళాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులనే ఏరివేయాలి. కశ్మీర్లో పౌరులకు, భద్రత దళాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించాలి' అని తొగాడియా అన్నారు. -
‘బట్టలు ఉతికే నేను జాదవ్ వల్లే నేడిలా..’
ముంబయి: మరణ శిక్షకు గురైన కులభూషణ్ జాదవ్‌ను వెంటనే పాకిస్థాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మానవహారం నిర్వహించారు. పాక్ చర్యను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా గతంలో బట్టలు ఉతుకుతూ అనంతరం జాదవ్ ద్వారా తన జీవితాన్నే మార్చుకున్న యువకుడు ఈ కార్యక్రమ నిర్వాహక బాధ్యతలు తీసుకున్నాడు. గతంలో తనకు జాదవ్ ఎంతో సహాయం చేశారని, చదువులో అండగా ఉండటమే కాకుండా తన ఆకలి బాధను తీర్చారని, అలాంటి వ్యక్తిని పాక్ ఎలా ఉరితీస్తుందని ప్రశ్నిస్తూ విజయ్ కనువాజియా అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘జాదవ్గారు నాకు ఎంతో సహాయం చేశారు. చదువులో ఆదుకున్నారు. వాళ్ల కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూసుకున్నారు. రాత్రి 11గంటల వరకు నాకోసం భోజనం చేయకుండా జాదవ్గారి కుటుంబం ఎదురుచూసేది. పాకిస్థాన్ వెంటనే జాదవ్‌ను విడుదల చేయాలి. ఆయన గుఢాచారి కాదు’ అని విజయ్ కనువాజియా అనే యువకుడు తెలిపాడు. గతంలో బట్టలు ఉతికే పనిలో ఈ బాలుడు ప్రస్తుతం ఆ పని మానేసి డిగ్రీ పూర్తి చేశాడు. సైన్యంలోకి అడుగుపెట్టడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు. -
'ఆ ఆరోపణలు అవాస్తవం, కావాలనే రాద్ధాంతం'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కుల్‌భూషణ్ జాదవ్‌పై చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి వీకే సింగ్ తోసిపుచ్చారు. జాదవ్ నిర్దోషి అని, అతని వద్ద భారత పాస్‌పోర్టు ఉందని ఆయన అన్నారు. వీకే సింగ్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.... జాదవ్‌పై గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పాకిస్తాన్ కావాలనే రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాదవ్ కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. జాదవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాదవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాక్ జాదవ్‌కు తక్షణమే ఉరి అమలు చేయమని, క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా జాదవ్ తరఫున ఎవరు వాదించొద్దని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. మరోవైపు కుల్‌భూషణ్ అమాయకుడు అయితే అతని వద్ద రెండు పాస్‌పోర్టులు ఎందుకు ఉంటాయని, ఒకటి హిందు, మరొకటి ముస్లిం పేరుతో పాస్‌పోర్టులు ఉన్నాయని పాక్ ప్రధాని సలహాదారుడు సత్తాజ్ అజీజ్ ప్రశ్నించారు. -
జాధవ్ జాడ తెలియదు
ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ వ్యవహారంలో ఇరుదేశాలు పట్టు వీడటం లేదు. ఆయన్ని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించగా, జాధవ్ మరణ శిక్ష విషయంలో రాజీ పడకూడదని పాక్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. జాధవ్ అమాయకుడని,ఆయన పాక్‌లో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. జాధవ్‌ను స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. జాధవ్‌కు న్యాయం చేయడానికి భారత్ ఎంతవరకైనా వెళ్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. రాజీ ఉండదు: పాక్ సైనిక ఉన్నతాధికారులు జాధవ్‌కు ఉరిశిక్షపై వెనక్కి తగ్గకూడదని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయన్ని ఉరితీస్తే ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత్ చేసిన హెచ్చరికలను పెడచెవిన పెడుతూ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గురువారం రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా నేతృత్వంలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలిటరీ మీడియా సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది. స్పందించలేం: ఐరాస జాధవ్‌కు పాక్ మరణశిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, పాక్‌లకు సూచించింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. -
కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా?
-
జాధవ్‌కు శిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గం: పాక్
ఇస్లామాబాద్: గూఢచర్యం కేసులో భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు తమ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా నిర్ణయించినట్లు సమా అనే పాక్ టీవీ చానల్ తెలిపింది. ఈ విషయంలో బజ్వా ప్రధానిని విశ్వాసంలోకి తీసుకున్నారని వెల్ల డించింది. జాధవ్‌కు శిక్షపై మండిపడ్డ భారత్ అసాధారణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో బజ్వా బుధవారం షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఆర్మీ సంసిద్ధత, దేశ భద్రత, సరిహద్దు పరిస్థితిపై వీరు చర్చించినట్లు పాక్ రేడియో తెలిపింది. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ‘రదుల్ ఫసద్’పై బజ్వా ప్రధానికి వివరించారని తెలిపింది. షరీఫ్‌తో బజ్వా భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా, కశ్మీర్ వివాద పరిష్కారంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని, అయితే ఆ దేశం ఇంతవరకు ఆ పనిచేయలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులను కోరుకుంటున్నామని ఆయన అన్నట్లు పాక్ అధికార మీడియా తెలిపింది. -
కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా?
గూఢచారిగా పేర్కొంటూ భారతీయుడైన కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించడంతో దాయాది దేశాల మధ్య సంబంధాలు మరింత జఠిలంగా, మరింత ఉద్రిక్తంగా మారాయి. జాధవ్‌కు న్యాయం చేసేందుకు అసాధారణ చర్యలకూ వెనకాడబోమని భారత్.. అన్ని ఒత్తిళ్లను తట్టుకోగలమని, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమకుందంటూ పాకిస్తాన్ వాగ్యుద్ధానికి తెరతీశాయి. ఈ నేపథ్యంలో.. భారత్ ముందు, కుల్‌భూషణ్ ముందు ఉన్న మార్గాలివీ.. దౌత్యపరంగా.. ⇒ వివిధ దౌత్య మార్గాల ద్వారా పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడం. లోపభూయిష్టమైన విచారణను ఎత్తిచూపడం, గోప్యతను పాటించారని, బలమైన సాక్ష్యాలు లేవని, భారత దౌత్యాధికారులను అతన్ని కలిసేందుకు అనుమతించలేదనే విషయాన్ని వివరించాలి. ⇒ సౌదీ అరేబియా సహా పాక్‌తో సత్సంబంధాలున్న దేశాల ద్వారా లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మధ్యవర్తిత్వం ద్వారా జాధవ్ విడుదలకు ప్రయత్నించడం. న్యాయపరంగా... ⇒ పాక్ ఆర్మీ యాక్ట్ ప్రకారం... శిక్ష ఖరారైనప్పటి నుంచి 60 రోజుల్లోగా జాధవ్ తనకు విధించిన మరణశిక్షపై మిలటరీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేయవచ్చు. ళీ కోర్టు మార్షల్లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని సివిల్ కోర్టులో దావా వేయొచ్చు. 7.2.3 సెక్షన్ ప్రకారం మిలటరీ కోర్టులో శిక్ష పడ్డవారు సివిల్ కోర్టులో సమీక్ష కోరొచ్చు. ⇒ అప్పీలు చేసుకునేందుకున్న 60 రోజుల గడువు ముగిశాక... పాక్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పెట్టుకునేందుకు మరో 60 రోజుల గడువు ఉంటుంది. పాక్ ఏం చేయొచ్చు... న్యాయ ప్రక్రియ ముగిసేందుకు సమయం పడుతుంది. ఒకవేళ అప్పీలులోనూ మరణశిక్షే ఖరారైనా.. పాక్ అతన్ని ఉరితీయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌ను బెదిరించడానికి, బేరసారాలకు అతన్ని పాక్ వాడుకుంటుందని అంచనా. గతంలోనూ ఇలాంటివి జరిగాయని వారు ఉదహరిస్తున్నారు. వియన్నా ఒడంబడిక ఏం చెబుతోంది..! 1961లో కుదిరిన వియన్నా ఒడంబడికపై భారత్, పాక్‌లు కూడా సంతకాలు చేశాయి. ఈ ఒడంబడిక ఆర్టికల్ 36(1) ప్రకారం... ఎవరైనా విదేశీయుడిని అరెస్టు చేస్తే అతని దేశానికి చెందిన రాయబారులకు కొన్ని హక్కులు ఉంటాయి. అవి.. ► నిర్బంధంలో లేదా జైలు శిక్షను అనుభవిస్తున్న తమ దేశీయుడిని సంప్రదించడానికి రాయబార కార్యాలయ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అరెస్టు అయిన వ్యక్తికీ... తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించే స్వేచ్ఛ ఉంటుంది.. ► అరెస్టయిన, అభియోగాలను ఎదుర్కొంటున్న లేదా శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి కోరితే... నిర్భందించిన సమాచారాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెంటనే తెలియజేయాలి. రాయబార కార్యాలయానికి అరెస్టయిన వ్యక్తి రాసే ఉత్తరాలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలి. అలాగే అరెస్టయిన వ్యక్తికి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించే విషయంలో అతనికున్న హక్కులను వెంటనే చెప్పాలి. ► జైల్లో ఉన్న తమ దేశస్తుడిని కలిసే హక్కు రాయబార కార్యాలయ అధికారులకు ఉంటుంది. సదరు వ్యక్తితో మాట్లాడే, ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే, అతని తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేసే హక్కు కూడా ఉంటుంది. ఎదుర్కొంటున్న అభియోగాలేమిటనే దానితో సంబంధం లేకుండా... జైళ్లలో ఉన్న తమ దేశస్తులను ఎవరినైనా దౌత్య సిబ్బంది కలవొచ్చు. కోర్టు మార్షల్ చేయొచ్చా! గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన వారిని న్యాయస్థానాల్లో విచారించాలి. అయితే కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ కోర్టు మార్షల్ (సైనిక న్యాయస్థానాల్లో విచారించడం) చేసింది. పాక్ ఆర్మీ యాక్ట్‌లోని సెక్షన్–59 కింద కుల్‌భూషణ్‌కు ఉరిశిక్ష విధించింది. పౌర ప్రదేశాల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడే వారిని శిక్షించే ఉద్దేశంతో 2015లో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్షన్–59ను చేర్చారు. దీంట్లో గూఢచర్యం, దేశద్రోహానికి పాల్పడిన వారిని సైతం విచారించే వెసులుబాటు ఉంది. సైన్యానికి అపరిమితమైన అధికారాలను కట్టబెట్టిన ఈ చట్టం తీవ్ర దుర్వినియోగమవుతోంది. మానవహక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులపై ప్రభుత్వం ప్రయోగిస్తోంది. దీనికింద మొత్తం 274 మందిని విచారించగా.. ఒక్కరూ నిర్దోషిగా బయటపడలేదు. 161 మందికి మరణశిక్ష విధించగా, మిగిలిన 113 మందికి జైలు శిక్ష పడింది. ఇటీవలే ఈ చట్టాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కుల్‌భూషణ్ జడ్జిమెంట్ కాపీలో ఏముంది?
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్ష తీర్పు కాపీని భారత ప్రభుత్వం పాక్‌ను తప్పక అడిగి తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సూచించారు. తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో ఆయనకు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుందని అన్నారు. ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మెరుగవుతున్న భారత్-పాక్ సంబంధాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ జెఠ్మలానీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వారు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. వారు మోపిన నేరం సరైనదా కాదా.. అన్నదీ తెలుసుకోవాలి. అప్పుడు దానికి ఏ శిక్ష పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు ఆయనపై తప్పుడు సాక్ష్యం ఆధారంగా నేరం మోపితే.. అప్పుడు భారత్ గట్టిగా వాదించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలంతా జాదవ్ విషయమై పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. అది సరికాదు. మన స్టాండ్ మనకు ఉంటుంది. కానీ తీర్పు కాపీ చదవకుండా అభిప్రాయం చెప్పడం ఎవరికీ సరికాదు’ అని అభిప్రాయపడ్డారు. -
కులభూషణ్‌కు ఉరి: అమెరికా వార్నింగ్!
వాషింగ్టన్: భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధంచడంపై అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను ఏకాకిగా నిలబెట్టాలన్న భారత్ దౌత్య చర్యలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చేందుకే దాయాది ఈ చర్యకు దిగి ఉంటుందని వారు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం లైఫ్ సోపర్ట్ మీద ఉన్న భారత్-పాక్ సంబంధాలు మరింత దెబ్బతినవచ్చునని, ఇరుదేశాల మధ్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి.. రానున్న రోజలు మరింత అంధకారమయంగా మారిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారత్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే ఉరిశిక్ష అమలు చేయబోమంటూ పాక్ వెనుకకు తగ్గింది. అయితే, గుఢచర్యం, జాతి వ్యతిరేక కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కులభూషణ్‌పై విచారణ ఆదరాబాదరాగా చేయడం, తగినంతగా ఆధారాలు లేకుండానే ఆయనకు శిక్ష విధించడాన్ని అమెరికాకు చెందిన దక్షిణ, మధ్య ఆసియా బ్యూరో మాజీ సీనియర్ అధికారి అలిస్సా అయ్రెస్ తప్పుబట్టారు. ఒకవైపు కులభూషణ్‌పై విచారణను వేగంగా చేపట్టిన పాక్.. మరోవైపు ముంబై దాడుల కేసులో తమ దేశంలో జరుగుతున్న విచారణను నిత్యం వాయిదాలతో జాప్యం చేస్తుండటంపై విస్మయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రముఖ మేధోసంస్థ అయిన విదేశీ సంబంధాల మండలిలో భారత్, పాకిస్థాన్, దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ ఫెల్లో ఆమె ఉన్నారు. సరైన ఆధారాలు లేకుండా రాజకీయ ప్రేరేపణతోనే కులభూషణ్‌కు శిక్ష విధించినట్టు కనిపిస్తున్నదని, తమ దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా హెచ్చరించేందుకే పాక్ ఈ చర్యకు పాల్పడినట్టుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక, ప్రస్తుతం భారత్-పాక్ సంబంధాలు లైఫ్ సపోర్ట్ (కొన ప్రాణాధారం) మీద ఉన్నాయని, తాజాగా కులభూషణ్‌కు పాక్‌లో శిక్షతో ఇరుదేశాల సంబంధాలు మరింత క్షీణించి.. చర్చలు పూర్తిగా నిలిచిపోయే అవకాశముందని, రానున్న రోజుల్లో గడ్డుకాలాన్ని ఇరుదేశాల సంబంధాలు ఎదుర్కోబోతున్నాయని మరో విదేశీ వ్యవహారాల నిపుణుడు, ప్రతిష్టాత్మక వుడ్రో విల్సన్ సెంటర్లో దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ అసోసియేట్ మైఖేల్ కుజల్మన్ తెలిపారు. -
భారత్ వార్నింగ్ పనిచేసింది.. తగ్గిన పాక్
-
భారత్ వార్నింగ్ పనిచేసింది.. తగ్గిన పాక్
ఇస్లామాబాద్: భారత్ హెచ్చరికలు ఫలించాయి. కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ కాస్తంత వెనక్కి తగ్గింది. జాదవ్‌ను వెంటనే ఉరితీయబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. అప్పీల్ చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇస్తామని తెలిపింది. పాక్ ఆర్మీ చీఫ్‌కు, అధ్యక్షుడికి క్షమాభిక్ష వినతిని ఇవ్వొచ్చని కూడా పాక్ తెలిపింది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్-భారత్ మధ్య మరోసారి తీవ్ర విభేదాలు తలెత్తాయి. పాక్ జాదవ్‌ను ఉరి తీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్ తీవ్రంగా హెచ్చరించింది. తీవ్ర చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో తాము యుద్ధానికైనా సిద్ధమేనన్నట్లుగా వ్యాఖ్యానించిన పాక్ తాజాగా మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పీల్ చేసుకునేందుకు రెండు నెలల గడువు ఇస్తామని చెప్పింది. -
ఎదుర్కొనేందుకు మేం రెడీ: పాక్
-
అసాధారణ చర్యలకూ వెనుకాడం!
-
పాక్ ప్రమాదకర క్రీడ
భారత గూఢచారిగా ఆరోపణకు గురైన కుల్‌భూషణ్ జాధవ్‌కు మరణశిక్షను విధిం చినట్టు పాకిస్థాన్ సైనిక వర్గాలు చేసిన ప్రకటన మనకే కాదు, ప్రపంచ దేశాలకు సైతం దిగ్భ్రాంతిని కలిగించింది. పాక్ ప్రభుత్వం ఆరోపించినట్టుగా కుల్‌భూషణ్ భారత గూఢచారే అనుకున్నా, పట్టుబడ్డ శత్రు గూఢచారులకు మరణశిక్ష విధించ డాన్ని అంతర్జాతీయ సమాజం నేడు అనాగరిక చర్యగా భావిస్తోంది. కుల్‌భూషణ్ స్వయంగా తాను భారత గూఢచార సంస్థ రా (రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) గూఢచారినని అంగీకరించారంటూ పాక్ ప్రభుత్వం అప్పట్లోనే ఒక వీడియోను బయటపెట్టింది. పాక్ మీడియా సైతం దాన్ని లెక్కలోకి తీసుకోదగ్గదిగా పరిగణించ లేదు. సహజంగానే మన విదేశాంగశాఖ అది తీవ్ర ఒత్తిడికి గురిచేసి చెప్పించిన బలవంతపు అంగీకారమని స్పష్టం చేసింది. కుల్‌భూషణ్ తమ గూఢచారి కారని రా అధికారికంగా ప్రకటించడమే కాదు, సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులు సైతం అదే చెప్పారు. కుల్‌భూషణ్‌తో మాట్లాడేందుకు పాక్‌లోని మన కాన్సలేట్ అధి కారులకు అవకాశాన్ని కల్పించాలని భారత్ పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయినా పాక్ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఇది వియన్నా అంతర్జాతీయ ఒప్పందానికే కాదు, ఇరు దేశాలూ సంతకాలు చేసిన అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒప్పందానికి కూడా విరుద్ధం. నమ్మదగిన ఆధారాలు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా, ఎప్పుడు విచారణ జరిగిందో, ఎప్పుడు శిక్ష విధించారో కూడా తెలుపకుండా మరణశిక్ష ప్రకటనను వెలువరించడం పూర్తి బాధ్యతా రాహిత్యం. ఏదిఏమైనా ఇది అంతర్జాతీయ న్యాయ స్థానానికి నివేదించాల్సిన నేరం. ఇక మరణశిక్షను అమలుచేస్తే భారత్ అంటున్నట్టు అది ‘ముందస్తు పథకం ప్రకారం చేసిన హత్యే’ అవుతుంది. ఏడాదిగా నిర్బంధంలో ఉన్న కుల్భూష ణ్‌కు అన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఒప్పందాలను తుంగలోకి తొక్కి హడావుడిగా మరణశిక్షను విధించాల్సిన అగత్యం ఏమొచ్చింది? పాక్ అధికార వ్యవస్థ స్వభావం ఎప్పుడూ అంతుబట్టనిదిగానే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న చట్టబద్ధ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాస్వామిక, న్యాయ వ్యవస్థలకు అతీత మైన అదృశ్య హస్తం తన పని తాను చేసుకు పోతూనే ఉంటుంది. ఆ అదృశ్య హస్తం సైనిక దుస్తుల్లో ఉన్నా, గూఢచార వ్యవస్థ ఐఎస్ఐ రూపం ధరించినా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దాని మాట శిరోధార్యం, దాని చేతలను సమర్థించడం పరమ పవిత్ర కర్తవ్యం. కాక పోతే, కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని పాక్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన విషయాన్ని నవాజ్ షరీఫ్ మరిచేవారేనా? సైనిక న్యాయస్థానం తీర్పును వెనకేసు కొస్తూ మాట మార్చేవారేనా? ఒక ఉన్నత స్థాయి సైనిక అధికారిని, తమ దేశపు పాస్‌పోర్ట్‌తో శత్రు దేశంలోకి గూఢచారిగా పంపే తెలివిమాలిన పని ఏ దేశమూ చేయదు. అది తెలిసీ పాక్ సైన్యం ఇరాన్ కేంద్రంగా సొంత వ్యాపారం నడుపుకుంటున్న మన నావికాదళ మాజీ కమాండర్ కుల్‌భూషణ్‌ను ఇరాన్–బెలూచిస్థాన్ సరిహద్దుల్లో పట్టుకున్నా మని 2016 మార్చి 3న ప్రకటించింది. బెలూచిస్థాన్ వేర్పాటువాదులతో కలసి విద్రోహకాండకు పాల్పడుతున్న భారత గూఢచారి అని ఆరోపించింది. పాక్ వాయవ్య ప్రాంతంలోని పాక్ తాలిబన్ మిలిటెంట్లపై చేపట్టిన రెండేళ్ల సైనిక చర్యల వైఫల్యంతో అడుగంటిన ప్రతిష్టను కాపాడుకోడానికి పాక్ సైన్యం భారత గూఢచా రిని కనిపెట్టిందని అప్పట్లో ప్రముఖ పాక్ పాత్రికేయులు కొందరు వ్యాఖ్యానిం చారు. కుల్‌భూషణ్ గూఢచారే అయినా పట్టుబడ్డ గూఢచారుల పట్ల అనుసరించా ల్సిన లిఖిత, అలిఖిత పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. నేటి ప్రపంచంలో ఇతర దేశాలలో గూఢచారులను నియమించని దేశమే లేదు. గూఢచారులు పట్టుబ డటం తరచుగా జరిగేదే. పట్టుబడ్డ గూఢచారులను అనధికారిక సంభాషణలు, బేర సారాలతో కొంత ఆలస్యంగానో లేక త్వరగానో మార్పిడి చేసుకోవడం, ఖైదీలను విడుదల చేయడం భారత్, పాక్‌ల మధ్య కూడా ఉన్న రివాజే. కానీ 2015 నుంచి భారత్‌లో పాక్ సీమాంతర ఉగ్రవాద మూకల దాడులు పెరిగాయి. 2016 జనవరిలో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై దాడికి అవి బరితెగించాయి. దీంతో పాక్‌తో స్నేహ సంబంధాల కోసం చేయిచాస్తున్న భారత వైఖరిలో మార్పు రావడం మొదలైంది. ఉగ్రవాదం పట్ల కఠినవైఖరిని అవలంబిస్తా నని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన యూరీ ఉగ్ర దాడి భారత్ సహనానికి పరీక్షే అయింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ‘నీరూ, నెత్తురూ కలసి ప్రవహించలేవు’ అని ప్రకటించి 1960 నాటి భారత్–పాక్ నదీ జలాల ఒప్పందానికి ఎసరు పెట్ట గలమని పాక్‌కు చురక అంటించారు. దాని కొనసాగింపుగా సెప్టెంబర్ 29న భారత సేనలు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి పాక్ ప్రతిష్టను దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల ‘ఉద్యో గాన్వేషణ’ కోసం నేపాల్ వెళ్లిన దిగువ స్థాయి రిటైర్డ్ పాక్ సైనికాధికారి ఒకరు కనిపించకుండా పోయారు. అది భారత్ పనేనని తమ సైన్యం భావిస్తోందని, అందుకు బదులుగా కుల్‌భూషణ్‌కు హడావుడిగా మరణశిక్ష విధించిందని పాక్ విశ్లేషకుల కథనం. పాక్ సైన్యం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంలో ఆశ్చర్యం లేదు. కానీ కిడ్నాపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు చేసి బేరసారాలాడే స్థితికి భారత్ దిగ జారేదైతే, సరిహద్దుల్లో దారితప్పి పాక్ భూభాగంలోకి ప్రవేశించిన సరబ్జిత్ సింగ్ 23 ఏళ్లు పాక్ జైళ్లలో నరకం చూసి మరణించేవాడే కాడు. ఏదిఏమైనా పాక్ విపరీత చర్య భారత్‌ను రెచ్చగొట్టేదని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత విష మింపజేసేదని అంతా అంగీకరిస్తున్నారు. ఎంతకైనా తెగించగల తెంపరితనానికి మారుపేరైన పాక్ సైన్యం ఉరిశిక్ష విధించినంత, గుట్టుగా, హడావుడిగా ఉరి తీయనూ గలదు. పాక్ దుశ్చర్యను సత్వరమే అంతర్జాతీయ సమాజం దృష్టికి, వేదిక లపైకి తీసుకుపోయి కుల్‌భూషణ్‌కు ప్రాణహాని కలుగకుండా చూడటం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. -
అసాధారణ చర్యలకూ వెనుకాడం!
జాధవ్‌కు పాక్ ఉరిశిక్ష విధించడంపై భారత్ స్పందన ► న్యాయం జరిగేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తాం ► పార్లమెంటులో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన ► ఉభయసభల్లో సభ్యుల ఆందోళన ► 60 రోజుల్లో జాధవ్ అప్పీలు చేసుకోవచ్చు: పాక్ రక్షణ మంత్రి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకూ వెనుకాడబోమంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ సభ్యులు లేవనెత్తారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉభయసభల్లో సవివర ప్రకటన చేశారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు దౌత్యపరంగానే కాకుండా.. అన్ని మార్గాల్లోనూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్: భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు ఉరిశిక్షతో భారత్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు కుయుక్తులకు పాల్పడుతోందని పార్లమెంట్లో ప్రభుత్వం విమర్శించింది. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తూ ‘జాధవ్‌కు న్యాయం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం, అమాయకుడైన భారతీయుడ్ని పాక్ కిడ్నాప్ చేసింది. మరణశిక్షపై పాకిస్తాన్ ముందుకెళ్తే జాధవ్ ఉరిని పథకం ప్రకారం చేసిన హత్యగా పరిగణిస్తాం. అనంతరం ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ఏర్పడే ప్రతికూల పరిణామాల గురించి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి’ అని సుష్మా హెచ్చరించారు. జాధవ్‌ను కలిసేందుకు అనుమతించలేదు ‘జాధవ్ తప్పుచేశాడనేందుకు ఎలాంటి ఆధారం లేదు. జాధవ్‌పై ఆధారాల కోసం పాకిస్తాన్ భారత్ సాయాన్ని కోరింది. ఈ సందర్భంగా కేసుతో సంబంధం లేని కొందరు భారతీయ ఉన్నతాధికారులపై అర్థంలేని ఆరోపణలు చేసింది. తాము చూపించిన ఆధారాల్ని అంగీకరిస్తేనే జాధవ్‌ను కలిసేందుకు భారత్ రాయబార కార్యాలయాన్ని అనుమతిస్తామని పాకిస్తాన్ లింకు పెట్టింది. నిజ నిర్ధారణకు, పాకిస్తాన్లో జాధవ్ ఉండడానికి గల కారణాల కోసం భారత్ రాయబార కార్యాలయాన్ని అనుమతించడం తప్పనిసరన్న అంశాన్ని మేం లేవనెత్తాం. తమ షరతులు ఒప్పుకుంటేనే అనుమతిస్తామని మరోసారి పాక్ పేర్కొంది’ అని సుష్మా తెలిపారు. అంతకముందు లోక్‌సభలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... జాధవ్‌కు న్యాయం జరిగేందుకు చేయదగ్గ అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. మౌనం ఎందుకు?: లోక్‌సభలో కాంగ్రెస్ జాధవ్ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘ఎలాంటి ఆహ్వానం లేకపోయినా మీరు పెళ్లికి(నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి) హాజరుకావచ్చు. కానీ ఈ అంశంపై అతణ్ని(షరీఫ్) కలవడం, మాట్లాడడం గానీ చేయలేదు’ అని మోదీని ఉద్దేశించి ఖర్గే పరోక్షంగా విమర్శించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మాట్లాడుతూ.. జాధవ్ తరఫున ప్రభుత్వం అత్యుత్తమ న్యాయవాదిని ఏర్పాటు చేయాలన్నారు. సుష్మ స్పందిస్తూ.. పాకిస్తాన్ సుప్రీంకోర్టులోని అత్యుత్తమ న్యాయవాదుల్ని ఏర్పాటు చేయడంతో పాటు, పాక్ అధ్యక్షుడితో మాట్లాడతామని చెప్పారు. మరణశిక్షపై 60 రోజుల్లోపు కుల్‌భూషణ్ అప్పీలు చేసుకోవచ్చని పాక్రక్షణ మంత్రి అసిఫ్ చెప్పారు. ముప్పును తిప్పికొట్టే సత్తా ఉంది పాక్ ప్రధాని షరీఫ్ ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమ బలగాలకు ఉందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్నారు. ‘పాకిస్తాన్ శాంతికాముక దేశం. అన్ని దేశాలతో.. ముఖ్యంగా పొరుగు దేశాలతో స్నేహసంబంధాలను కోరుకుంటోంది. అయితే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పారు. కుల్‌భూషణ్ జాధవ్‌ను ఉరితీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత అనే భావన మారిపోయిందని, యుద్ధాలు ప్రస్తుతం సైన్యాలకు పరిమితం కాలేదని అన్నారు. మంగళవారం ఖైబర్–పంక్తూన్ఖ్వా రాష్ట్రంలోని అస్ఘర్ ఖాన్‌లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఘర్షణలకు కాకుండా సహకారానికి, అనుమానానికి కాకుండా ఉమ్మడి శ్రేయస్సుకు తమ దేశం ప్రాధాన్యమిస్తుందన్నారు. జాధవ్‌కు మరణశిక్షను వ్యతిరేకించిన బిలావల్.. జాధవ్‌కు మరణశిక్షను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో పరోక్షంగా వ్యతిరేకించారు. ఇది వివాదాస్పద అంశమని, తమ పార్టీ మరణశిక్షకు వ్యతిరేకమని పేర్కొన్నారు. -
ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్
న్యూఢిల్లీ: భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విషయంలో వెనక్కి తగ్గబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఈ శిక్ష విధించడాన్ని పాక్ సమర్థించుకుంది. జాదవ్ గూఢచర్యం నెరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉరి శిక్ష విధించడానికి ముందు అన్ని నియమనిబంధనలు పాటించామని, తమ చట్టాలకు లోబడే ఈ శిక్ష విధించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఒక్కటి కూడా చేయలేదని చెప్పారు. తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధంగా పనిచేసే శక్తుల విషయంలో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా జాదవ్ విషయంలో పాక్ మొండి వైఖరి స్పష్టమవుతోంది. ‘జాదవ్‌కు విధించిన ఉరి శిక్ష పూర్వాలోచనతో చేసిన పని భారత్ అంటోంది. కానీ, మేం మాత్రం చట్టానికి లోబడే కేసును విచారించాం. నియమ నిబంధనలు పాటించాం. పాకిస్థాన్ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక కన్సెషన్ ఇవ్వబోదు. మా దేశ సార్వభౌమాధికారన్ని దెబ్బకొట్టాలని, తమ దేశ సుస్థిరతకు భంగంకలిగించాలనే చూసే శక్తులను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటాం’ అని అసిఫ్ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. -
పాక్ చేతికి దొరికితే ఎలా హింసిస్తారంటే..?
ముంబయి: తన చేతులకు దొరికిన భారతీయుడిని పాకిస్థాన్ ఎన్ని రకాల చిత్ర హింసలు పెడుతుందో తెలిస్తే ఒళ్లు గగుర్లుపొడుస్తుంది. కులభూషణ్ జాదవ్‌కు ఉరి శిక్ష నేపథ్యంలో గతంలో పాక్ చేతులకు దొరికి నరకం అనుభవించి తిరిగి భారత్ చేరుకున్న సైనికుడు చందు చవాన్ కుటుంబ సభ్యులు ఆ వివరాలు తెలిపారు. సొంత కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని విధంగా పాకిస్థాన్ పోలీసులు జైలులో చిత్ర హింసలు పెడతారని తమ కుమారుడు చందు చెప్పినట్లు వివరించారు. చవాన్ గత ఏడాది సెప్టెంబర్ 29న అనుకోకుండా నియంత్రణ రేఖ దాటి వెళ్లాడు. దీంతో పాకిస్థాన్ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ విషయం తెలిసి షాక్‌తో చవాన్ నాయనమ్మ లీలీ చిందా పాటిల్ గుండెపోటుతో చనిపోయింది. అయితే, భారత్ సంప్రదింపులు జరిపిన తర్వాత తిరిగి ఈ ఏడాది జనవరి 21న అతడు భారత్ చేరకున్నాడు. కానీ, అతడి ముఖంలో గతంలో ఉన్నంత కళ లేకుండా పోయింది. ముభావంగా మారిపోయాడు. తాను అనుభవించిన టార్చర్ షాక్‌లో నుంచి రెండు నెలలపాటు కోలుకోలేదు. డ్రగ్స్ కూడా అతడిపై ప్రయోగించి చిత్ర హింసలు పెట్టడంతో దాని ప్రభావం అతడిపై అప్పుడప్పుడు చూపడం ప్రారంభించింది. ఈ విషయాన్ని చందు తల్లిదండ్రులు పంచుకున్నారు. ‘చందు తిరిగొచ్చన తర్వాత మాకు కులభూషణ్ జాదవ్ కుటుంబం నుంచి ఫోన్ వచ్చింది. వారి వద్ద అతడు ఎక్కడ ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల మధ ఉన్నాడనే విషయంపై ఆధారాలు లేవు. సరిగ్గా కులభూషణ్ వీడియోను పాక్ విడుదల చేసిన రీతిలోనే చందును కూడా టార్చర్ చేశారు. ముందు చిత్ర హింసలు పెట్టి డ్రగ్స్ ఎక్కించి కేవలం తమకు మరణ శిక్ష విధించండి అనే మాట మాత్రమే నోట్లో నుంచి వచ్చేంత భయంకరంగా హింసించి అదే విషయాన్ని రికార్డు చేస్తారు. తాము చెప్పిన మాటలే వీడియోలో చెప్పాలని బెదిరిస్తారు. అందుకే ఆ సమయంలో వారికి చావు అనే మాట తప్ప ఆ సమయంలో ఇంకే మాట రాదు. డ్రగ్స్ ఇచ్చిన తర్వాత చంపేయండి అనే మాట తప్ప తన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో బందీగా ఉన్న వ్యక్తికి తెలియదు. ఇది మా కొడుకు చందూకు కలిగిన అనుభవం. అందుకే కులభూషణ్ కుటుంబ సభ్యులు అడిగితే చిత్రహింసల విషయం చెప్పవద్దని, సాధారణంగా విచారిస్తానని చెప్పమని నేను చెప్పాను. కానీ, వాస్తవానికి అక్కడ జరిగేది మాత్రం పూర్తిగా విరుద్ధం’ అని చందు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. -
కుల్‌భూషణ్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలు
కుల్‌భూషణ్ జాదవ్‌ను గూఢచారి అని ప్రకటించి, అతడికి మరణశిక్ష విధించడంపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు భారతదేశంలో పాక్ రాయబారిగా ఉన్న అబ్దుల్ బాసిత్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. జాదవ్ ఉగ్రవాది అని, అతడు చేసిన దానికి తలరాత ఎలా ఉంటే అలా అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు చెందిన వార్తా చానల్ సమా టీవీతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో అరెస్టయిన జాదవ్ రా ఏజెంటు అని కూడా సమా టీవీ వ్యాఖ్యానించినా, దాన్ని భారతదేశం పదే పదే ఖండిస్తోంది. తొలుత వాళ్లు తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడతారని, ఇప్పుడు ఒక ఉగ్రవాదిని తాము శిక్షిస్తే ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని బాసిత్ అడిగారు. జాదవ్‌కు మరణశిక్ష విధించడంలో పాక్ తప్పేమీ చేయలేదని కూడా అన్నారు. తాము అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అయితే ఎటువైపు నుంచైనా తమకు ఏవైనా బెదిరింపులు వస్తే మాత్రం వాటిని దీటుగా ఎదుర్కోడానికి పాక్ దళాలకు తగిన సామర్థ్యం ఉందని, పూర్తి సన్నద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు. -
ఎదుర్కొనేందుకు మేం రెడీ: పాక్
న్యూఢిల్లీ: ఎలాంటి నేరం చేయని భారత్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు ఉరి శిక్ష విధించి ఆగ్రహంతో ఉడికిపోయేలా చేసిన పాకిస్థాన్ తాజాగా మరోసారి పుండుమీద కారం చల్లేలా వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు సరిహద్దు వెంట పాకిస్థాన్ భద్రతా బలగాలు, పాక్ ఉగ్రవాదులు మాత్రమే కవ్వింపు చర్యలకు, దాడులకు పాల్పడగా తాజాగా ఏకంగా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అంతకంటే ఎక్కువగా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఢీకొట్టేందుకు, ఎదురు నిలిచేందుకు తమ దేశ సైన్యం సిద్ధంగా ఉందంటూ మంగళవారం నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో యుద్ధం పెద్ద దూరంలో ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. కులభూషణ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్ హెచ్చరికలు పంపించిన కొద్ది సేపటికే షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘పాకిస్థాన్ ప్రేమపూర్వక శాంతియుత దేశం. దీనిని ఎవరూ బలహీనతగా చూడొద్దు. విభేదాలకన్నా సహకారంతో ఉండటం, సంశయించడంకంటే శ్రేయస్సును పంచుకోవడమే మా దేశం విధానం. స్నేహం విస్తరించుకునే విషయాన్ని మేం ఎప్పుడూ కాదనం’ అంటూ వ్యాఖ్యానించారు. -
‘ఉరితీస్తే మాత్రం భారత్ ఇలా చేయాలి’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ ఉరితీస్తే మాత్రం ఇండియా బలోచిస్థాన్‌ను స్వతంత్ర్య దేశంగా తప్పకుండా గుర్తించాల్సిందేనని అన్నారు. సింధ్ ప్రావిన్స్‌ను పాకిస్థాన్ విడిచి వెళ్లాల్సిందేనని డిమాండ్ చేశారు. గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి కులభూషణ్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మంగళవారం చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి తాజా వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉరిశిక్ష ప్రకటించిన వెంటనే సోమవారం స్పందించిన స్వామి పాకిస్థాన్‌కు భారత్ గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనని కోరిన విషయం తెలిసిందే. జాదవ్‌ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ దేశానికి మంచిదికాదని నేరుగా హెచ్చరించాలని కేంద్రాన్ని కోరారు. -
పాకిస్తాన్ కు సుష్మా స్వరాజ్ హెచ్చరిక
-
విడిపిస్తారా, చేతగాదని ఊరుకుంటారా?
-
పాకిస్తాన్ కు సుష్మా స్వరాజ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవరిస్తోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపకుండానే పాకిస్తాన్ మిలటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించిందని అన్నారు. ఈ అంశంపై రాజ్యసభలో మంగళవారం సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆధారాలు లేవన్నారు. విచారణ పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. కుల్‌భూషణ్ కు ఉరిశిక్ష విధిస్తే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలకు పాకిస్తాన్ బాధ్యత వహించాల్సివుంటుందని సుష్మ హెచ్చరించారు. కుల్‌భూషణ్ కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు. అతడికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కుల్‌భూషణ్ తరపున పాకిస్తాన్ సుప్రీంకోర్టులో వాదించేందుకు మంచి లాయర్ ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ సూచించారు. -
విడిపిస్తారా, చేతగాదని ఊరుకుంటారా?
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్ గూఢచారని పాకిస్తాన్ అబద్ధం చెబుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని అతడికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని మంగళవారం లోక్ సభలో కాంగ్రెస్ లేవనెత్తింది. 'గూఢచర్యానికి పాల్పడ్డాడనే అసత్య, మోసపూరిత ఆరోణలతో కుల్‌భూషణ్ జాధవ్ కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. జాధవ్ ను పాకిస్తాన్ ఉరి తీస్తే అది హత్య కిందకు వస్తుంది. అతడిని విడిపించకుంటే మోదీ సర్కారును చేవలేనిదిగా భావించాల్సి ఉంటుంద'ని విపక్షనేత మల్లిఖార్జున్ ఖడ్గే అన్నారు. కుల్‌భూషణ్ జాధవ్ ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అతడిని రక్షించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే జాధవ్ కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్లమెంట్ మొత్తం జాధవ్ పక్షాన ఉందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. -
ఇదే మా హెచ్చరిక.. కుట్ర చేస్తే సహించం: పాక్
గూఢచర్యం ఆరోపణలపై భారత జాతీయుడు కులభూషణ్ జాధవ్‌కు ఉరిశిక్ష విధించడాన్ని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ ఉరిశిక్ష హెచ్చరిక లాంటిందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని, వారికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన శక్తులన్నింటినీ వాడుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్ సైనికులు, ప్రజలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ త్యాగాలు కోరుతున్నాయి’ అని అన్నారు. జాధవ్ బహిరంగంగా తన నేరాన్ని ఒప్పుకొన్నాడని, ఈ విషయాన్ని భారత్ లేవనెత్తితే.. పాకిస్థాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన చెప్పారు. కల్లోలిత బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పేర్కొంది. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. -
పాక్‌లో ఉరి.. భారత్‌లో ఇద్దరికి ప్రాణభిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై గత ఏడాది అరెస్టైన భారతీయుడు కులభూషణ్ జాధవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. భారతీయుడికి ఉరిశిక్ష విధించడానికి సరిగ్గా ఒకరోజు ముందే భారత తీర ప్రాంత గస్తీ దళం ఇద్దరు పాకిస్థానీ జాలర్ల ప్రాణాలను కాపాడింది. సముద్రంలో కొట్టుకుపోయిన వారిని కాపాడి మరీ వైద్య చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టింది. ఇటీవల పాకిస్థాన్ కోస్టు గార్డుకు చెందిన ఓ చిన్నబోటు తమ జలాల్లో చేపల వేటను పరిశీలిస్తూ.. పొరపాటున గుజరాత్ తీరంలోని సర్‌క్రీక్ ప్రాంతానికి భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రధాన బోటుతో ఇది విడిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ సమయంలో బోటులో ఆరుగురు జాలర్లు ఉన్నారు. వెంటనే పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ న్యూఢిల్లీలోని భారత నేవీ అధికారులతో మాట్లాడి.. సాయం కోసం అర్థించారు. దీంతో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం జాలర్ల కాపాడేందుకు పలు ఓడలతో గాలింపుచర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సర్ క్రీక్‌కు సమీపంలో ఇద్దరు పాకిస్థాన్ జాలర్లను కాపాడినట్టు భారత ఓడలు ఐసీజీఎస్ సామ్రాట్ షిప్‌కు సమాచారం ఇచ్చాయి. అప్పటికే నలుగురు పాకిస్థానీ జాలర్లు ప్రాణాలు విడిచారు. కొనప్రాణాలతో దొరికిన ఇద్దరు జాలర్లకు భారత కోస్ట్ గార్డు అధికారులు సరైన వైద్య చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. వారి బాగోగులను చూసుకున్నారు. ఈ క్రమంలోనే భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. జాధవ్‌కు ఉరిశిక్ష విధించాలన్న పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను సమావేశానికి పిలిచిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారత జైలులో ఉన్న 12 మంది పాకిస్థాన్ జాలర్లను విడుదలను నిలిపివేసింది. -
పాక్ యువతికి బాలీవుడ్ నటుడి వార్నింగ్
ముంబై: పాకిస్తాన్ యువతిపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మండిపడ్డారు. మాటలు తిన్నగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. గూఢచర్యం కేసులో భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం పట్ల రిషి కపూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిపక్రియకు పాకిస్తాన్ విఘాతం కలిగిస్తోందని ట్విటర్ లో మండిపడ్డారు. ‘నటులు, సినిమాలు, క్రీడలు మొదలైన వాటిద్వారా రెండు దేశాల మధ్య శాంతిస్థాపనకు భారత్ ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం విద్వేషాన్నే కోరుకుంటోంద’ని రిషి కపూర్ ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తిడుతూ పాకిస్తానీయులు ట్వీట్లు పెట్టారు. ఒక యువతి అసభ్యకర పదజాలంతో దూషించింది. దీనిపై రిషి కపూర్ ఘాటుగా స్పందించారు. ‘మాటలు సరిగా మాట్లాడడం నేర్చుకో. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో నీ తల్లిదండ్రులు నీకు నేర్పించలేదనుకుంటా’ అని బదులిచ్చారు. 'ఎవరితో ఎలా మాట్లాడాలో నా తల్లిదండ్రులు బాగానే నేర్పించారు. నీతి సూత్రాలతో మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోలేరు. గూఢచారుల పట్ల ఇతర దేశాలు ఎలా వ్యవరిస్తున్నాయో తెలుకోవాల'ని పాక్ యువతి సలహాయిచ్చింది. తాను అసభ్య పదజాలం వాడినట్టు రిషికపూర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె తన ట్విటర్ లో పేర్కొంది. తాను చేసిన ట్వీట్లు తొలగించానని అబద్దాలు చెబుతున్నారని తెలిపింది. రిషి మాటలను నమ్మి ఎన్డీటీవీ తనపై అసత్య కథనాలు రాసిందని వాపోయింది. -
భారతీయుడికి ఉరిశిక్ష
► గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్ జాధవ్‌ను దోషిగా పేర్కొన్న పాక్ మిలటరీ కోర్టు ► ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన భారత్ ► ముందస్తు నిర్ణయంతో చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరిక ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్ జాధవ్ (46)కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను సమావేశానికి పిలిచిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అటు.. బుధవారం విడుదల కావాల్సిఉన్న పాకిస్తాన్ ఖైదీల విడుదలను భారత్ ప్రస్తుతానికి నిలిపేసింది. మరణశిక్ష నిర్ణయాన్ని చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ధ్రువీకరించారని పాకిస్తాన్ మిలటరీ సమాచార విభాగం ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తను భారత నౌకాదళ కమాండర్ అని జాధవ్ ఒప్పుకున్నట్లు తెలిపింది. ఆర్మీ కోర్టు తీసుకున్న నిర్ణయం పాక్‌లో గూఢచర్యానికి పాల్పడే విదేశాలకు స్పష్టమైన హెచ్చరిక అని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు. పాక్ కమిషనర్‌కు భారత్ సమన్లు జాధవ్‌కు మరణశిక్ష విధించటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కనీస న్యాయ నిబంధనలు పాటించకుండా జాధవ్‌కు శిక్ష విధించారని ఆరోపించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్.. పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉరిశిక్ష అమలైతే.. దీన్ని ముందస్తుగా ఆలోచించి చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కేసు విచారణ ప్రారంభించిన విషయాన్ని కూడా భారత కమిషన్‌కు తెలపలేదని మండిపడ్డారు. కాగా, జాధవ్‌కు వేసిన మరణశిక్ష అమలు కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పాక్ జైల్లో చనిపోయిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ‘భారత్ జైళ్లలో తీవ్రమైన నేరారోపణలతో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీయులకు అలాంటి శిక్షలే విధిస్తున్నామా? 2000లో ఎర్రకోటపై దాడికి ప్రయత్నించిన పాక్ జాతీయుడిని మనం ఉరితీశామా?’ అని ఆమె ప్రశ్నించారు. పాక్ ఖైదీల విడుదల నిలుపుదల జాధవ్‌కు మరణశిక్ష నేపథ్యంలో భారత జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న పాక్ ఖైదీల విడుదలను భారత్ నిలిపివేసింది. బుధవారం కొందరిని విడుదల చేయాల్సి ఉన్నా పాక్ నిర్ణయంతో.. భారత్ నిర్ణయాన్ని మార్చుకుంది. గతేడాది మార్చి 3న పాక్ భద్రతా బలగాలు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాధవ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జాధవ్ నేవీలో పనిచేశారని తెలిపిన భారత్.. అతను ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతనికి సంబంధం లేదని ప్రకటించింది. కాగా, గతేడాది డిసెంబర్ 7న పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆ దేశ పార్లమెంటుకు ఇచ్చిన వివరణలో.. ‘జాధవ్‌పై ఇచ్చిన పత్రాల్లో వెల్లడించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. సరైన ఆధారాలను అందించలేకపోయారు’ అని పేర్కొన్నారు. పాక్‌కు ఆమ్నెస్టీ అక్షింతలు పాకిస్తాన్ మిలటరీ కోర్టు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ దుయ్యబట్టింది. ‘పాకిస్తాన్ మిలటరీ కోర్టు వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా ఉల్లంఘిస్తోందో మరోసారి వెల్లడైంది. ప్రతివాదులు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవటం పాక్ మిలటరీ కోర్టులకు అలవాటు’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. వాదనలివీ భారత్ జాధవ్ నేవీలో పనిచేసేవారు. ముందస్తు పదవీవిరమణ తీసుకుని ఇరాన్లో వ్యాపారం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు జాధవ్‌ను ఇరాన్‌లోని ఛాబహార్ పోర్టు నుంచి కిడ్నాప్ చేసి పాక్‌కు తీసుకెళ్లారు. బెలూచిస్తాన్‌లో పట్టుకున్నామని చాలాకాలంగా ఇక్కడే ఉన్నాడంటూ పాక్ చెబుతున్నా.. ఇంతవరకు దీనికి సంబంధించిన ఆధారాలివ్వలేదు. భారత గూఢచారి అని చిత్రహింసలు పెట్టి బలవంతంగా ఒప్పించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత రాయబార కార్యాలయం పలుమార్లు ప్రయత్నించినా పాక్ అనుమతివ్వలేదు. ఆధారాల్లేకుండానే విచారణ జరిపి ఇప్పుడు మరణశిక్ష విధించినట్లు ప్రకటించారు. పాక్ తీరు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. పాకిస్తాన్ కొన్నేళ్లుగా పాకిస్తాన్లో అశాంతి నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జాధవ్‌ను పక్కా వ్యూహంతోనే భారత గూఢచార సంస్థ రా బెలూచిస్తాన్‌కు పంపించింది. జాధవ్ కూడా తను గూఢచారినని ఒప్పుకున్నారు. బెలూచిస్తాన్‌లో అస్థిరత సృష్టించేందుకే వచ్చానని చెప్పారు. ఈ వీడియోను మేం విడుదల చేశాం. -
'కులభూషణ్‌ను రక్షించేందుకు ఎందాకైనా వెళ్లండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను ఏం చేసైనా కేంద్రం రక్షించాలని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే కోరారు. కులభూషణ్‌కు ఉరిశిక్ష విధించడం దురదృష్టకరమని, అవసరమైతే కేంద్రం ఎలాంటి ముందడుగు వేసైనా జాదవ్‌ను రక్షించాలని అభ్యర్థించారు. అలా చేయడంలో తప్పులేదని చెప్పారు. ఉద్దవ్ ఠాక్రే సోమవారం ఢిల్లీకి వచ్చి ఎన్డీయే పెద్దలను కలిశారు. అయితే, ఎందుకు కలిశారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి కులభూషణ్‌కు పాకిస్థాన్ ఉరి శిక్ష విధించినట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ నిర్ణయాన్ని ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. -
ఎవరు ఈ కులభూషణ్? ఉరి శిక్షెందుకు?
-
ఎవరు ఈ కులభూషణ్? ఉరి శిక్షెందుకు?
న్యూఢిల్లీ: గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ ఎవరు? పాక్ ఆరోపిస్తున్నట్లుగా కులభూషణ్ రీసర్చ్ అండ్ అనాలసిస్ (రా)వింగ్ అధికారినా? అతడు నిజంగానే పాక్ వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు దిగాడా? పాక్ చేస్తున్న ఆరోపణల్లో అసలు ఎంత వరకు నిజం ఉంది? ఇంతకీ ఎవరు ఈ కులభూషణ్ అని అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే.. భారత ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కులభూషణ్ జాదవ్ ఇండియన్ నేవీ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. కానీ పాక్ మాత్రం ఇతడినే ఇప్పుడు 'రా' అధికారి అని ఆరోపిస్తోంది. ఇరాన్ నుంచి బలోచిస్థాన్లోకి అడుగుపెట్టగానే పాక్ పోలీసులు 2016, మార్చి 3న అరెస్టు చేసినట్లు ఊహగానాలున్నాయి. అయితే, ఇరాన్ నుంచి అతడిని అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు భారత్ ఆరోపిస్తోంది. ఏప్రిల్ 2016లో కులభూషణ్‌పై ఉగ్రవాదం, దేశ ద్రోహం చర్యలు ఆరోపించింది. జాదవ్‌ను తిరిగి పంపించేందుకు ఇస్లామాబాద్‌లోని ఎగువ సభ నిరాకరించిందంటూ ఈ ఏడాది(2017) మార్చిలో పాక్ ప్రధాని సలహాదారు, విదేశాంగ వ్యవహారాల మంత్రి సర్తాజ్ అజీజ్ ప్రకటించాడు. -
యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
-
యూ టర్న్ తీసుకున్న పాకిస్థాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ గూఢచారిగా పాకిస్థాన్ ఆరోపణలు చేసిన కుల్‌భూషణ్ జాదవ్ అప్పగింత విషయంలో ఆ దేశం యూ టర్న్ తీసుకుంది. తమ దేశంలో జాదవ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని, తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి సర్తాజ్ అజీజ్ చెప్పారు. జాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. గతేడాది మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌లో జాదవ్‌ను అరెస్ట్ చేశారు. జాదవ్ రా ఏజెంట్ అని, ఆయన 2013 నుంచి తమ దేశంలో విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడని పాక్ అధికారులు ఆరోపించారు. పాక్ ఆరోపణలను భారత్ అప్పట్లో ఖండించింది. గతేడాది డిసెంబర్లో అజీజ్ మాట్లాడుతూ.. జాదవ్ నేరం చేసినట్టు తగిన ఆధారాలు లేవని చెప్పారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారని భావించారు. అజీజ్ తాజాగా మాటమారుస్తూ.. పాక్‌లో జాదవ్ విద్రోహ, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడని, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. పాక్ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది. పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, జాదవ్ దారితప్పి పాక్ భూభాగంలోకి వెళ్లాడని భారత్ అధికారులు చెప్పారు.