కులభూషణ్ జాదవ్ ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు పాక్ అంగీకరించింది. క్రిస్టమస్ రోజు జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారు. అలాగే, ఆ రోజు భారత హైకమిషన్‌కు చెందిన స్టాఫ్ మెంబర్ కూడా వారితోపాటు ఉండనున్నారని తెలిపారు.