పాకిస్థాన్ మరో నాటకానికి తెరతీసింది. ప్రపంచ దేశాల నుంచి సానుభూతిని పోగేసుకొనే చర్యకు దిగింది. తమ దేశానికి ధన్యవాదాలు చెబుతున్నట్లుగా ఉన్న కులభూషణ్ జాదవ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా అధికారికంగా విడుదల చేసింది. ఆ వీడియోలో జాదవ్ పాక్‌కు ధన్యవాదాలు చెబుతూ తనను కలవడంతో తల్లి, భార్య చాలా ఆనందంగా కనిపించారని, తనకు కూడా సంతోషంగా ఉందని చెప్పారు. తన ఆరోగ్యంపట్ల తల్లి కూడా చాలా సంతృప్తి చెందారని, తాను ఇక్కడ(పాక్ జైలులో) బాగానే ఉన్నానని, వారు (పాక్ జైలు అధికారులు) తనకు ఎలాంటి హానీ తలపెట్టడం లేదంటూ వివరించారు. అయితే, దీనిపై జాదవ్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.