భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి(ఐసీజే) భారత్ విజ్ఞప్తిచేసింది. లేదంటే ఐసీజేలో విచారణ పూర్తి కాకముందే జాధవ్‌ను పాకిస్తాన్ ఉరితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.