అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్, పాకిస్తాన్‌లు నేడు మళ్లీ తలపడ్డాయి. కులభూషణ్ జాదవ్ వ్యవహారంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు మొదలయ్యాయి. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ నగరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కుల్‌భూషన్ జాధవ్(46) కేసులో ఇరు దేశాలు వాదనలు కొనసాగుతున్నాయి. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషన్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.