గూఢచర్యం కేసులో ఉరి శిక్ష పడి ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు భారత్ నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా మద్దతు మొదలైంది. అమెరికాలోని భారతీయ అమెరికన్లు జాదవ్ కోసం నడుంకట్టారు. వైట్ హౌస్ పిటిషన్‌ను ప్రారంభించారు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారని ఆరోపిస్తూ పాక్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.