white house petition
-
జాదవ్కోసం అమెరికాలో పోరుబాట
-
జాదవ్కోసం అమెరికాలో పోరుబాట
వాషింగ్టన్: గూఢచర్యం కేసులో ఉరి శిక్ష పడి ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కు భారత్ నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా మద్దతు మొదలైంది. అమెరికాలోని భారతీయ అమెరికన్లు జాదవ్ కోసం నడుంకట్టారు. వైట్ హౌస్ పిటిషన్‌ను ప్రారంభించారు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారని ఆరోపిస్తూ పాక్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ చర్యను తీవ్రంగా ఖండిస్తూ భారత్ మొత్తం ఒక్కతాటిపై వచ్చింది. జాదవ్‌ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని అక్కడ ఉన్న భారతీయులు వైట్ హౌస్ పిటిషన్ ప్రారంభించారు. ఎస్.ఎస్ అనే ఓ వ్యక్తి అమెరికా వైట్ హౌస్‌కు అర్జీలు పెట్టుకునే ‘వీ ది పీపుల్ పిటిషన్’అనే వైట్ హౌస్ వెబ్సైట్లో ఈ పిటిషన్ ప్రారంభించారు. మే 14లోపు దీనిపై లక్ష సంతకాలు చేస్తే ట్రంప్ పరిపాలన వర్గం స్పందిస్తుంది. జాదవ్‌పై పాక్ చేసిన ఆరోపణలు మొత్తం కూడా అసత్యాలంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. -
పాకిస్థాన్ పై 'ఉగ్ర పిటిషన్' కు రికార్డు మద్దతు
వాషింగ్టన్: పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండు నేపథ్యంలో వైట్‌హౌస్ అధికారులు చేపట్టిన ఆన్లైన్ పిటిషన్ దరఖాస్తుకు రికార్డు స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు 6,65,769 మంది ఈ పిటిషన్ పై సంతకాలు చేశారని వైట్‌హౌస్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 50 వేల మంది సంతకాలు చేశారు. ఇప్పటి వరకు వైట్‌హౌస్ చేపట్టిన సంతకాల సేకరణలో 3,50,000 మంది సంతకాలు చేయడమే రికార్డుగా ఉంది. ఆ రికార్డును ఈ పిటిషన్ బద్దలు కొట్టింది. దీంతో తలలు పట్టుకున్న వైట్‌హౌస్ అధికారులు పిటిషన్ ను రద్దు చేశారు. పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండ్ నేపథ్యంలో సెప్టెంబర్ 21న ఈ పిటిషన్ ను వైట్‌హౌస్ అధికారిక వెబ్సైట్లో చేర్చారు. 30 రోజుల్లో లక్ష సంతకాలు వస్తే అమెరికా అధ్యక్షుడు 60 రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ పిటిషన్లలోని 98 శాతం పిటిషన్లపై అధ్యక్షులు స్పందించారు. దీంతో 'పాకిస్థాన్ ఉగ్రదేశం' పిటిషన్ పై ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఉన్న బలూచిస్థాన్ ప్రజలు సైతం తమను పాకిస్థాన్ నుంచి వేరు చేయాలనే డిమాండ్‌తో ఒక పిటిషన్ ను వైట్‌హౌస్ వెబ్సైట్లో సంతకాల సేకరణ చేపట్టాని డిమాండ్ చేస్తున్నారు.