అమెరికాలో దారుణం జరిగింది. భారతీయ సంతతి మహిళను, ఆమె కుమారుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. వాషింగ్టన్‌లోని వర్జీనియా సబర్బ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఆ ఇద్దరు మాలా మన్వానీ (65), రిషి మన్వానీ (32)అనే భారతీయ అమెరికన్‌లు.