‘జాధవ్‌ను తక్షణమే ఉరి తీయండి’
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను త్వరగా ఉరితీయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, సెనేట్ మాజీ చైర్మన్ ఫరూక్ నయీక్ తరఫున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ’డాన్’పత్రిక పేర్కొంది.