ఇస్లామాబాద్: మరణశిక్ష పడి, పాకిస్తాన్ జైల్లో మగ్గుతోన్న కుల్‌భూషణ్ జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవడానికి, భారత్‌కి మరో అవకాశం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షని సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణకు చేపట్టింది. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది.కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని భారత్‌కు తెలపాలని ఈ కేసుని అక్టోబర్ 3కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment