
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్, ఆయన తల్లి, భార్య కోరిక తీరింది. వారు ఒకరినొకరు చూసుకొని కాస్తంత ఉపశమనం పొందారు. అన్నింటికంటే ముందు ఆయన క్షేమంగానే ఉండటాన్ని స్వయంగా చూసిన తల్లి, భార్య ధైర్యంతో తిరుగుపయనం అయ్యారు. అయితే, జాదవ్‌ను కలిసే క్రమంలో పాక్ అడుగడుగునా తన బుద్ధి చూపించుకుందనే చెప్పాలి. కనీసం జాదవ్ తల్లికి, భార్యకు మర్యాద ఇవ్వని పాక్ జాదవ్‌తో మాట్లాడే సందర్భంలో వారి మధ్య గ్లాస్‌ను ఏర్పాటుచేశారు. పైగా వారు మాట్లాడేదాన్ని మొత్తం వీడియోలో షూట్ చేయడంతోపాటు రహస్యంగా ప్రత్యేక అధికారులు ఆయన ఏం మాట్లాడుతున్నారనే దాన్ని మైక్రో స్పీకర్ల ద్వారా తమ గదుల్లోని తెరలపై చూస్తూ విన్నారు.
కనీసం వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేని పరిస్థితి కనిపించింది. ఇదిలా ఉండగా పాక్ మరో వీడియో విడుదల చేసింది. గతంలో జాదవ్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా ఓ కపట వీడియోను విడుదల చేసినట్లుగానే తాజాగా కూడా మరో వీడియోను విడుదల చేసింది. అందులో ‘నాతల్లిని, భార్యను కలిసే సమావేశం ఏర్పాటుచేయాలని పాక్ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేసిన పాక్ ప్రభుత్వానికి నేను మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని జాదవ్ చెప్పినట్లుగా ఆ వీడియో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment