
ఎవరు ఈ కులభూషణ్? ఉరి శిక్షెందుకు?
న్యూఢిల్లీ: గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ ఎవరు? పాక్ ఆరోపిస్తున్నట్లుగా కులభూషణ్ రీసర్చ్ అండ్ అనాలసిస్ (రా)వింగ్ అధికారినా? అతడు నిజంగానే పాక్ వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు దిగాడా? పాక్ చేస్తున్న ఆరోపణల్లో అసలు ఎంత వరకు నిజం ఉంది? ఇంతకీ ఎవరు ఈ కులభూషణ్ అని అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే..
- భారత ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కులభూషణ్ జాదవ్ ఇండియన్ నేవీ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. కానీ పాక్ మాత్రం ఇతడినే ఇప్పుడు 'రా' అధికారి అని ఆరోపిస్తోంది.
- ఇరాన్ నుంచి బలోచిస్థాన్‌లోకి అడుగుపెట్టగానే పాక్ పోలీసులు 2016, మార్చి 3న అరెస్టు చేసినట్లు ఊహగానాలున్నాయి.
- అయితే, ఇరాన్ నుంచి అతడిని అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు భారత్ ఆరోపిస్తోంది.
- ఏప్రిల్ 2016లో కులభూషణ్‌పై ఉగ్రవాదం, దేశ ద్రోహం చర్యలు ఆరోపించింది.
- జాదవ్‌ను తిరిగి పంపించేందుకు ఇస్లామాబాద్‌లోని ఎగువ సభ నిరాకరించిందంటూ ఈ ఏడాది(2017) మార్చిలో పాక్ ప్రధాని సలహాదారు, విదేశాంగ వ్యవహారాల మంత్రి సర్తాజ్ అజీజ్ ప్రకటించాడు.