
'కులభూషణ్‌ను రక్షించేందుకు ఎందాకైనా వెళ్లండి'
పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను ఏం చేసైనా కేంద్రం రక్షించాలని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే కోరారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను ఏం చేసైనా కేంద్రం రక్షించాలని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే కోరారు. కులభూషణ్‌కు ఉరిశిక్ష విధించడం దురదృష్టకరమని, అవసరమైతే కేంద్రం ఎలాంటి ముందడుగు వేసైనా జాదవ్‌ను రక్షించాలని అభ్యర్థించారు.
అలా చేయడంలో తప్పులేదని చెప్పారు. ఉద్దవ్ ఠాక్రే సోమవారం ఢిల్లీకి వచ్చి ఎన్డీయే పెద్దలను కలిశారు. అయితే, ఎందుకు కలిశారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి కులభూషణ్‌కు పాకిస్థాన్ ఉరి శిక్ష విధించినట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ నిర్ణయాన్ని ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.