ముంబై: మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం కచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలను తాము ఎంతమాత్రం ఊహించలేదని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు.
ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment