Public opposition
-
ఏదో మోసం జరిగింది: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం కచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలను తాము ఎంతమాత్రం ఊహించలేదని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు. -
ఇంటగెలవలేక... రచ్చ... రచ్చ...
గంట్యాడ మండలం నరవలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, ప్రజలతో వాదులాడారు. గ్రామంలో అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించినందుకు.. పింఛన్లు ఇవ్వలేదని ని ష్టూరమాడినందుకు ఆయన చిందులు తొక్కా రు. దొంగలకు పెన్షన్లు రావు అంటూ మండి పడ్డారు. నన్ను ప్రశ్నించాలని చూస్తే సహించే దిలేదు. ఎవరికీ భయపడను. అంటూ తీవ్ర స్వరంతో ఎగిరెగిరి పడ్డారు. ఈ అసహనానికి కారణం ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకతే. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రతిపక్షం బలంగా మారుతుండటం, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతుండటం వల్ల తమ కోపాన్ని అదుపుచేసుకోలేక జనంపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న పార్వతీపురంలో సమస్యలపై నిలదీసిన స్థానిక యువకుడిపై ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సమక్షంలోనే ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ చేయిచేసుకున్నారు. నానా తంటాలుపడి ఆ వివాదాన్ని సద్దుమణిగించారు. తాజాగా గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు గంట్యాడలో జరిగిన బహిరంగసభలో తనను స్థానికులు నిలదీయడాన్ని సహించలేక మహిళలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈయన అసహనం వెనుక అంతర్గత కారణాలున్నట్టు తెలుస్తోంది. స్వపక్షంలో వస్తున్న వ్యతిరేకత ఆయన్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని, అందుకే ఆయన అలా అందరిపైనా చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం పనిచేసినవారిని పక్కనపెట్టినందునే.. 2014 ముందు గజపతినగరం, చీపురుపల్లిలో టీడీపీకి నాయకత్వం కరువైంది. ఆ సమయంలో మాజీ మంత్రి పడాల అరుణకు గజపతినగరం ఇన్చార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. ఆమెకు కనీస కేడర్ లేకపోవడంతో ఆ దశలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణను టీడీపీ ప్రోత్సహించింది. ఆయన తన ఉనికిని కాపాడుకునేందుకు సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. కో ఆపరేటివ్ ఎన్నికలు, మీ కోసం యాత్రకు బాగానే పార్టీకి అర్ధికంగా ఉపయోగపడ్డారు. ఇక చీపురుపల్లికి కె.ఎ.నాయుడిని ఇన్చార్జ్గా చేశారు. కానీ ఆయన గంట్యాడకే పరిమితమైపోయారు. అప్పుడు గ్రామీణ బ్యాంకు యూనియన్ నాయకుడైన త్రిమూర్తులు రాజునుఆ నియోజకవర్గంలో టీడీపీ తెరపైకి తెచ్చింది. అతను కూడా పార్టీకి తన తాహతకు తగ్గట్టుగా సమర్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చి కరణం శివరామకృష్ణకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన నాయుడు ఏరుదాటాక తెప్పతగలేసినట్టు శివరామకృష్ణతో పాటు అతని అనుచరగణానికి చెక్ పెట్టారు. పదవిరాగానే ‘ఆపని’ మొదలుపెట్టి... పదవి చేపట్టిన తర్వాత చిన్నా చితకా కాంట్రాక్టుల దగ్గర నుంచి టీటీడీలో శ్రీవారి దర్శనం టిక్కెట్ల వరకూ ప్రతిపనీ తనకు లాభదాయకంగా ఉండేలా చూసుకున్నారని కె.ఎ.నాయుడుపై విస్తృతంగా ప్రచారం జరిగింది. అతని తీరు ఏ స్థాయికి చేరిందంటే సొంత ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఆయన సోదరుడైన కొండబాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పరువు తీస్తున్నాడంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు. దత్తిరాజేరు మండలాధ్యక్ష పదవి రెండున్నరేళ్లు చొప్పున ఇద్దరికి పంచుతానని నాయుడు మాటిచ్చి ప్రతిపక్ష సభ్యుడికి ఎరవేశారు. కానీ ఆ మాట నిలుపుకోలేదు. ఆ మాట తప్పడంతో ఆ వర్గం అసంతృప్తిగా ఉంది. నీరూ–చెట్టు కార్యక్రమంలో పనుల దగ్గర్నుంచి, కాంట్రాక్టు పోస్టుల వరకూ అన్నీ తానే స్వయంగా చూసుకోవడం నాయుడికి అలవాటు. దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో రూ.68 లక్షల పనులను తన అనుచరుడైన నారాయణకు కట్టబెట్టారు. చుక్కపేట గ్రామంలో చప్ప చంద్రశేఖర్ అనేవ్యక్తి దాదాపు రూ.40 లక్షల పనులు చేసుకుంటున్నారు. మండలపార్టీ అధ్యక్షుడు బోడసింగి సత్తిబాబు రూ.30 లక్షల పనులు దక్కించుకున్నారు. ఇలా ఏ పని వచ్చినా తన అనుయాయులకే ఇచ్చి తాను ప్రయోజనం పొందడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ వైఖరితో ఆ పార్టీలోని మిగతావారిని ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. -
సర్కార్‌పై ప్రజావ్యతిరేకత
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న సర్కార్‌గా అపప్రదను మూటకట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉండే బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఆవిర్భావ రోజుల్లోనే పార్టీపై ప్రతిపక్షాలు బురదజల్లే పనికి పూనుకున్నాయని, అయినప్పటికీ దీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పాలన స్థంభించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని దుస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని దుయ్యబట్టారు. జిల్లాలో నదీ పరివాహకప్రాంతం ఉన్నప్పటికీ ఇసుక దొరకని దుస్థితి నెలకొందని, సిమెంటు ధర బస్తా రూ. 400కు చేరుకోవడంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయి కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద నుంచి అన్యాయంగా భూమిని లాక్కుని సింగపూర్ రియల్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దోచిపెడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతోందన్నారు. మండల, గ్రామస్థాయిలో కమిటీలు వేయడం జరిగిందన్నారు. కలసికట్టుగా పనిచేసి ఇతర పార్టీల వారిని మన పార్టీలో చేర్చుకునేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఏ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో, దీని లక్ష్యం, ఆశయం ఏమిటో అందరికీ తెలుసన్నారు. వైఎస్ఆర్సీపీ(యువజన శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ) బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించి వై.ఎస్.ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు అందించాలనే ఆశయంతో దివంగత రాజశేఖరరెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో వేరే పార్టీలో విలీనం అయిపోతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని.. వీటిని తిప్పికొడుతూ మొదటగా వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారన్నారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకుని పార్టీ ప్రభంజనం చాటిందన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయి 67 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరలా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామన్నారు. కార్యక్రమానికి ముందు దివంగత వైఎస్ చిత్రపటానికి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానరసింహం(వరం), ఎం.వి.పద్మావతి, అంధవరపు సూరిబాబు, చల్లా అలివే లు మంగ, ఎన్ని ధనుంజయ్, డాక్టర్ పైడి మహేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి, చల్లా రవి, శిమ్మ రాజశేఖర్, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు, పసగడ రామకృష్ణ, తెలుగు సూర్యనారాయణ, ధర్మాన రఘునాథమూర్తి, శిమ్మ వెంకటరావు, టి.కామేశ్వరి, కె.సీజు, పొన్నాడ రుషి, గుమ్మా నగేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
ఆరునెలల్లోనే టీడీపీపై ప్రజా వ్యతిరేకత
జీలుగుమిల్లి :అధికారంలోకి రావడానికి చంద్రబాబు మోసపూరితమైన వాగ్దానాలు చేయడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అన్నారు. జీలుగుమిల్లి వైఎస్సార్సీపీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం కక్కిరాల చక్రధర్ నివాసంలో పార్టీ మండల కన్వీనర్ బోధాశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆళ్లనాని మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు అమలుకాని వాగ్దానాలు చేసి రైతులు, మహిళలు, నిరుద్యోగులను, పేదలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్ఫథంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవకపోయినా ఇప్పటికీ పార్టీకి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. మండలంలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా అందరూ కలిసి కట్టుగా ముందుకు నడవాలన్నారు. త్వరలో మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అవసరమైన చోట గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల అభిప్రాయాలు అడిగారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తొలి సంతకం అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభంలో పెట్టిన సంతకమే అన్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు కల్లబొల్లి కబుర్లు చెబుతూ తొలి సంతకం అర్ధం మార్చేశారన్నారు. ప్రతి కార్యకర్త సేవాభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని అందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలే కారణమన్నారు. పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు గంటాప్రసాదరావు, క్రమశిక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు రామతిరుపతిరెడ్డి, జేపి, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కొవ్వాసి నారాయణ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతి నిధులు పోల్నాటి బాబ్జి, ఎం.సంపత్‌కుమార్, డీసీసీబీ డెరైక్టర్ శ్రీనివాస్, బి.ప్రేమ్‌కుమార్, ఆరేటి సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు, ఎం.రామచంద్రరావు, సిర్రిమోహన్, కె.చక్రి, కె.రాము, కె.సూరి, దాసరి బాబ్జి, డి.వేణు,వై.సత్యనారాయణ, జి.బాబ్జి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కొయ్యలగూడెం : వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని, ఐక్యతతో కలిసి ప్రజా సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సర్పంచ్ల చాంబర్ ఉపాధ్యక్షురాలు దేవి గంజిమాల ఆధ్వర్యంలో మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మట్టా శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీడీపీ రాక్షస పాలనపై పోరాటానికి అండ టి.నరసాపురం : టి.నరసాపురం మండలంలో టీడీపీ రాక్షసపాలనపై పోరాటానికి కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటానని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆళ్ళ నాని అన్నారు. స్థానిక కాశీ విశ్వేశ్వరాలయ కల్యాణ మంటపంలో మంగళవారం రాత్రి పార్టీ మండల కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కార్యకర్తలతో సైన్యాన్ని తయారు చేస్తానన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు జగన్మోహనరెడ్డి పిలుపుతో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. -
మాకొద్దు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘జోగీ జోగీ రాసుకుంటే..’ అన్న చందంగా తయారైంది జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి. తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు టీడీపీ గాలం వేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు చూస్తున్నారు. అలాంటివారికి చంద్రబాబు ఎర్ర తివాచీ పరచడంపై టీడీపీ తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండా అధినేత అనుసరిస్తున్న వ్యూహం బెడిసికొడుతుందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ.. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరితే మిగిలేది బూడిదేనని తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. తలుపులు బార్లా తెరిచిన బాబు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ విముఖత చూపుతోంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు దృష్టిసారించారు. ఈ పరిణామం టీడీపీలో సరికొత్త రగడకు దారితీస్తోంది. ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కోసం తమ పార్టీ ప్రజాప్రతినిధికే చంద్రబాబు ఝలక్ ఇవ్వడానికి సిద్ధపడటం విస్మయపరుస్తోంది. పశ్చిమ ప్రాంతానికే చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో టీడీపీ అధిష్టానం మంతనాలు ఆ దిశగానే సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఆయన సామాజికవర్గ బలంలేకపోయినా 2009 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు తహతహలాడారు. ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న ఆయన్ని చేర్చుకునేందుకు వైఎస్సార్సీపీ సమ్మతించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే భావించారు. కానీ అధిష్టానం ఆగ్రహించడంతో వెనక్కి తగ్గారు. ఆయనతో తాజాగా టీడీపీ దూతలు మంతనాలు సాగిస్తున్నారు. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గెలవడం కష్టమని భావించిన ఆ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంపై కన్నేశారు. తనకు పొరుగున ఉన్న నియోజకవర్గంలో టిక్కెట్టు ఇస్తే టీడీపీలో చేరుతానని షరతు పెట్టారు. కాగా ఆ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ ప్రజాప్రతినిధి ఉన్నారు. కానీ ఆయన ఓ ఫైనాన్స్ సంస్థ కుంభకోణంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో వివాదాస్పదుడయ్యారు. ఈ అంశాన్నే చూపించి ఆయన్ని తప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వాలన్నది టీడీపీ అధినేత ఉద్దేశంగా ఉంది. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ ప్రజాప్రతినిధి హతాశుడయ్యారనే చెప్పాలి. పశ్చిమ ప్రాంతానికే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారు. తన నియోజకవర్గానికి భారీ పరిశ్రమల కారిడార్‌ను కేటాయించారని సీఎం కిరణ్‌ను కీర్తిస్తున్న ఆ ఎమ్మెల్యే.. టీడీపీతో లోపాయికారీగా మంతనాలు సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఫోన్లు మీద ఫోన్లు చేసి.. తన అనుచరులతో రాయబారాలు పంపి హడావుడి చేశారు. కానీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన్ని చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ససేమిరా అన్నారు. విషయం తెలిసిన చంద్రబాబు తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తానని ఆయనకు గాలం వేశారు. కాగా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంతకాలంగా పనిచేస్తున్న టీడీపీ నేతకు ఆగ్రహం వచ్చింది. ఆయన నేరుగా బాలకృష్ణతో మాట్లాడి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన సన్నిహితుడని తెలిసీ ఆయన స్థానానికే చెక్ పెట్టడంపై బాలకృష్ణ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇప్పటికే టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన ఏకంగా పొరుగు జిల్లాకే వెళ్లిపోనున్నారు. తన సొంత జిల్లా కూడా అయినందున అక్కడి నుంచి ఈసారి టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈ పరిణామాలపై టీడీపీ తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. పదేళ్లుగా అధికారం లేకపోయినా పార్టీని అంటిపెట్టుకున్న తమను కాదనడంపై మండిపడుతున్నారు. అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ పరిణమాల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
పుట్టి మునగొచ్చు!
=‘సీ ఓటర్’ అంచనాలతో కాంగ్రెస్ నేతల్లో గుబులు =రాష్ర్టంలో అప్పుడే వ్యతిరేక పవనాలు = లోక్‌సభ ఎన్నికలపై పెట్టుకున్న ఆశలు గల్లంతు = కనీసం సగం స్థానాల్లోనూ గెలవలేని దుస్థితి = ఫలితాలపై యూపీఏ-2 కుంభకోణాల ప్రభావం = అదుపు తప్పిన ధరలపై ఓటరు మరింత ఆగ్రహం = అప్పను చేర్చుకుంటే... బీజేపీ గెలుపు ఖాయం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మొన్ననే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చి ఏడాదయ్యాక... అంటే వచ్చే మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున పెద్దగా ప్రజా వ్యతిరేకత ఉండబోదని అంచనా వేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటకపై పార్టీ పటిష్టమైన అంచనాలతో ఉంది. అయితే ‘సీ ఓటర్’ సహకారంతో ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’లు నిర్వహించిన ఎన్నికల సర్వేలో అధికార కాంగ్రెస్ మొత్తం 28 స్థానాలో సగం గెలుచుకోవడమూ గగనమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడే కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 12, జేడీఎస్‌కు మూడు స్థానాలు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకులతో భేటీ అయినప్పుడు 25 స్థానాలను గెలుచుకుని తీరాలని దిశా నిర్దేశం చేశారు. బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వేరు పడడం, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ బలహీనంగా కనిపించండ లాంటి పరిణామాలతో ఉపాధ్యక్షుడు నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా పూర్తి చేస్తామని రాష్ర్ట నాయకులు ధీమా కనబరుస్తూ వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుండడంతో ప్రస్తుతం గుబులు చెందుతున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అన్నట్లు ఏ అవినీతి నినాదంతో కాంగ్రెస్ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిందో, అదే నినాదం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచేట్లు ఉందని పార్టీ నాయకులు కలత చెందుతున్నారు. బీజేపీ నాయకుల అవినీతిని పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో సొమ్ము చేసుకున్న కాంగ్రెస్‌కు అదే ప్రస్తావన తిరుగు బాణమై వచ్చి గుచ్చుకునేట్లుంది. కేంద్రంలోని యూపీఏ-2 కుంభకోణాలకు పర్యాయ పదంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు, అదుపు లేని పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు యూపీఏ సర్కారుపై ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల గడువు ఉన్నందున యూపీఏ సర్కారు మరింతగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుందనే విశ్లేషణలున్నాయి. అదే కనుక జరిగితే ప్రస్తుతం అంచనా వేస్తున్న స్థానాలు లభించడం కూడా దుర్లభమే. అప్పను చేర్చుకుంటేనే బీజేపీ గెలుపు.. హాసన, మండ్య, బెంగళూరు గ్రామీణ స్థానాలు జేడీఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. లింగాయత్‌లు ప్రాబల్యం కలిగిన ఉత్తర కర్ణాటకతో పాటు సంఘ్ పరివార్‌కు గట్టి పునాదులున్న కోస్తా తీరంలోని స్థానాల్లో విజయం సాధించడానికి బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బేషరతుగా పార్టీలో చేరాలన్న కమలనాథుల షరతును యడ్యూరప్ప సమ్మతించడం లేదు. పార్టీలో తనకు గౌరవప్రదమైన పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక దశలో ఈ డిమాండ్‌ను కూడా పక్కన పెట్టి బీజేపీలో కేజేపీని విలీనం చేయడానికి ఆయన సిద్ధమైనా అనుయాయులు వారించారు. ‘వారికి మన అవసరం ఉందే తప్ప వారి అవసరం మనకు లేదు’ అని ఆయనను నిలువరించారు. ఏదో విధంగా యడ్యూరప్పను తమ దారికి తెచ్చుకోకపోతే బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందడం చాలా కష్టమవుతుంది. మొన్న శాసన సభ ఎన్నికల్లో పది శాతం ఓట్లను తెచ్చుకున్న కేజేపీని తక్కువగా అంచనా వేస్తే బీజేపీకే నష్టమనే రాజకీయ వాదనలున్నాయి. విలీనం లేదు : యడ్డి బీజేపీలో కేజేపీని విలీనం చేసే ప్రసక్తే లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. హుబ్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. పొత్తుపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, ఒక వేళ పొత్తు కుదరక పోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని కుండ బద్ధలు కొట్టారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నది తన ఆశయమని, ఈ క్రమంలో ఎన్డీఏకు దగ్గర కావడానికి ప్రయత్నించానని తెలిపారు. ఇంతకు మించి ఎటువంటి బలహీనతలు, పదవీ కాంక్ష, అధికార వాంఛ తనకు లేదని స్పష్టం చేశారు.