ఇంటగెలవలేక... రచ్చ... రచ్చ... | There Is A public Opposition To The MLA Style | Sakshi
Sakshi News home page

ఇంటగెలవలేక... రచ్చ... రచ్చ...

Published Fri, Aug 3 2018 11:20 AM | Last Updated on Fri, Aug 3 2018 11:20 AM

There Is A public Opposition To The MLA Style - Sakshi

కేఏ నాయుడు

గంట్యాడ మండలం నరవలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, ప్రజలతో వాదులాడారు. గ్రామంలో అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించినందుకు.. పింఛన్లు ఇవ్వలేదని ని ష్టూరమాడినందుకు ఆయన చిందులు తొక్కా రు. దొంగలకు పెన్షన్లు రావు అంటూ  మండి పడ్డారు. నన్ను ప్రశ్నించాలని చూస్తే సహించే దిలేదు. ఎవరికీ భయపడను. అంటూ తీవ్ర స్వరంతో ఎగిరెగిరి పడ్డారు. ఈ అసహనానికి కారణం ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకతే.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రతిపక్షం బలంగా మారుతుండటం, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతుండటం వల్ల తమ కోపాన్ని అదుపుచేసుకోలేక జనంపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న పార్వతీపురంలో సమస్యలపై నిలదీసిన స్థానిక యువకుడిపై ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సమక్షంలోనే ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ చేయిచేసుకున్నారు.

నానా తంటాలుపడి ఆ వివాదాన్ని సద్దుమణిగించారు. తాజాగా గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు గంట్యాడలో జరిగిన బహిరంగసభలో తనను స్థానికులు నిలదీయడాన్ని సహించలేక మహిళలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈయన అసహనం వెనుక అంతర్గత కారణాలున్నట్టు తెలుస్తోంది. స్వపక్షంలో వస్తున్న వ్యతిరేకత ఆయన్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని, అందుకే ఆయన అలా అందరిపైనా చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం

పనిచేసినవారిని పక్కనపెట్టినందునే..

2014 ముందు గజపతినగరం, చీపురుపల్లిలో టీడీపీకి నాయకత్వం కరువైంది. ఆ సమయంలో మాజీ మంత్రి పడాల అరుణకు గజపతినగరం ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఆమెకు కనీస కేడర్‌ లేకపోవడంతో ఆ దశలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణను టీడీపీ ప్రోత్సహించింది. ఆయన తన ఉనికిని కాపాడుకునేందుకు సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. కో ఆపరేటివ్‌ ఎన్నికలు, మీ కోసం యాత్రకు బాగానే పార్టీకి అర్ధికంగా ఉపయోగపడ్డారు.

ఇక చీపురుపల్లికి కె.ఎ.నాయుడిని ఇన్‌చార్జ్‌గా చేశారు. కానీ ఆయన గంట్యాడకే పరిమితమైపోయారు. అప్పుడు గ్రామీణ బ్యాంకు యూనియన్‌ నాయకుడైన త్రిమూర్తులు రాజునుఆ నియోజకవర్గంలో టీడీపీ తెరపైకి తెచ్చింది. అతను కూడా పార్టీకి తన తాహతకు తగ్గట్టుగా సమర్పించుకున్నారు.

2014 ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చి కరణం శివరామకృష్ణకు నామినేటెడ్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన నాయుడు ఏరుదాటాక తెప్పతగలేసినట్టు శివరామకృష్ణతో పాటు అతని అనుచరగణానికి చెక్‌ పెట్టారు. 

పదవిరాగానే ‘ఆపని’ మొదలుపెట్టి...

పదవి చేపట్టిన తర్వాత చిన్నా చితకా కాంట్రాక్టుల దగ్గర నుంచి టీటీడీలో శ్రీవారి దర్శనం టిక్కెట్ల వరకూ ప్రతిపనీ తనకు లాభదాయకంగా ఉండేలా చూసుకున్నారని కె.ఎ.నాయుడుపై విస్తృతంగా ప్రచారం జరిగింది. అతని తీరు ఏ స్థాయికి చేరిందంటే సొంత ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఆయన సోదరుడైన కొండబాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పరువు తీస్తున్నాడంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు.

దత్తిరాజేరు మండలాధ్యక్ష పదవి రెండున్నరేళ్లు చొప్పున ఇద్దరికి పంచుతానని నాయుడు మాటిచ్చి ప్రతిపక్ష సభ్యుడికి ఎరవేశారు. కానీ ఆ మాట నిలుపుకోలేదు. ఆ మాట తప్పడంతో ఆ వర్గం అసంతృప్తిగా ఉంది. నీరూ–చెట్టు కార్యక్రమంలో పనుల దగ్గర్నుంచి, కాంట్రాక్టు పోస్టుల వరకూ అన్నీ తానే స్వయంగా చూసుకోవడం నాయుడికి అలవాటు.

దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో రూ.68 లక్షల పనులను తన అనుచరుడైన నారాయణకు కట్టబెట్టారు. చుక్కపేట గ్రామంలో చప్ప చంద్రశేఖర్‌ అనేవ్యక్తి దాదాపు రూ.40 లక్షల పనులు చేసుకుంటున్నారు. మండలపార్టీ అధ్యక్షుడు బోడసింగి సత్తిబాబు రూ.30 లక్షల పనులు దక్కించుకున్నారు. ఇలా ఏ పని వచ్చినా తన అనుయాయులకే ఇచ్చి తాను ప్రయోజనం పొందడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ వైఖరితో ఆ పార్టీలోని మిగతావారిని ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement