MLA KA naidu
-
ఇంటగెలవలేక... రచ్చ... రచ్చ...
గంట్యాడ మండలం నరవలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, ప్రజలతో వాదులాడారు. గ్రామంలో అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించినందుకు.. పింఛన్లు ఇవ్వలేదని ని ష్టూరమాడినందుకు ఆయన చిందులు తొక్కా రు. దొంగలకు పెన్షన్లు రావు అంటూ మండి పడ్డారు. నన్ను ప్రశ్నించాలని చూస్తే సహించే దిలేదు. ఎవరికీ భయపడను. అంటూ తీవ్ర స్వరంతో ఎగిరెగిరి పడ్డారు. ఈ అసహనానికి కారణం ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకతే. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రతిపక్షం బలంగా మారుతుండటం, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతుండటం వల్ల తమ కోపాన్ని అదుపుచేసుకోలేక జనంపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న పార్వతీపురంలో సమస్యలపై నిలదీసిన స్థానిక యువకుడిపై ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సమక్షంలోనే ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ చేయిచేసుకున్నారు. నానా తంటాలుపడి ఆ వివాదాన్ని సద్దుమణిగించారు. తాజాగా గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు గంట్యాడలో జరిగిన బహిరంగసభలో తనను స్థానికులు నిలదీయడాన్ని సహించలేక మహిళలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈయన అసహనం వెనుక అంతర్గత కారణాలున్నట్టు తెలుస్తోంది. స్వపక్షంలో వస్తున్న వ్యతిరేకత ఆయన్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని, అందుకే ఆయన అలా అందరిపైనా చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం పనిచేసినవారిని పక్కనపెట్టినందునే.. 2014 ముందు గజపతినగరం, చీపురుపల్లిలో టీడీపీకి నాయకత్వం కరువైంది. ఆ సమయంలో మాజీ మంత్రి పడాల అరుణకు గజపతినగరం ఇన్చార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. ఆమెకు కనీస కేడర్ లేకపోవడంతో ఆ దశలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణను టీడీపీ ప్రోత్సహించింది. ఆయన తన ఉనికిని కాపాడుకునేందుకు సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. కో ఆపరేటివ్ ఎన్నికలు, మీ కోసం యాత్రకు బాగానే పార్టీకి అర్ధికంగా ఉపయోగపడ్డారు. ఇక చీపురుపల్లికి కె.ఎ.నాయుడిని ఇన్చార్జ్గా చేశారు. కానీ ఆయన గంట్యాడకే పరిమితమైపోయారు. అప్పుడు గ్రామీణ బ్యాంకు యూనియన్ నాయకుడైన త్రిమూర్తులు రాజునుఆ నియోజకవర్గంలో టీడీపీ తెరపైకి తెచ్చింది. అతను కూడా పార్టీకి తన తాహతకు తగ్గట్టుగా సమర్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చి కరణం శివరామకృష్ణకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన నాయుడు ఏరుదాటాక తెప్పతగలేసినట్టు శివరామకృష్ణతో పాటు అతని అనుచరగణానికి చెక్ పెట్టారు. పదవిరాగానే ‘ఆపని’ మొదలుపెట్టి... పదవి చేపట్టిన తర్వాత చిన్నా చితకా కాంట్రాక్టుల దగ్గర నుంచి టీటీడీలో శ్రీవారి దర్శనం టిక్కెట్ల వరకూ ప్రతిపనీ తనకు లాభదాయకంగా ఉండేలా చూసుకున్నారని కె.ఎ.నాయుడుపై విస్తృతంగా ప్రచారం జరిగింది. అతని తీరు ఏ స్థాయికి చేరిందంటే సొంత ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఆయన సోదరుడైన కొండబాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పరువు తీస్తున్నాడంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు. దత్తిరాజేరు మండలాధ్యక్ష పదవి రెండున్నరేళ్లు చొప్పున ఇద్దరికి పంచుతానని నాయుడు మాటిచ్చి ప్రతిపక్ష సభ్యుడికి ఎరవేశారు. కానీ ఆ మాట నిలుపుకోలేదు. ఆ మాట తప్పడంతో ఆ వర్గం అసంతృప్తిగా ఉంది. నీరూ–చెట్టు కార్యక్రమంలో పనుల దగ్గర్నుంచి, కాంట్రాక్టు పోస్టుల వరకూ అన్నీ తానే స్వయంగా చూసుకోవడం నాయుడికి అలవాటు. దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో రూ.68 లక్షల పనులను తన అనుచరుడైన నారాయణకు కట్టబెట్టారు. చుక్కపేట గ్రామంలో చప్ప చంద్రశేఖర్ అనేవ్యక్తి దాదాపు రూ.40 లక్షల పనులు చేసుకుంటున్నారు. మండలపార్టీ అధ్యక్షుడు బోడసింగి సత్తిబాబు రూ.30 లక్షల పనులు దక్కించుకున్నారు. ఇలా ఏ పని వచ్చినా తన అనుయాయులకే ఇచ్చి తాను ప్రయోజనం పొందడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ వైఖరితో ఆ పార్టీలోని మిగతావారిని ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. -
బెదిరింపులు... దాడులు..!
సాక్షి, విజయనగరం: జిల్లాలో ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్య అధికారులను ఇష్టానుసారం మాట్లాడిన అధికారపార్టీ నాయకులు ఇప్పుడు బహిరంగంగా దూషణలకు దిగుతున్నారు. మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అది చాలదన్నట్లు దాడుల వరకు వచ్చేశారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఇలాగైతే ఉద్యోగాలు కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందునా గజపతినగరం నియోజకవర్గ నాయకులంటేనే హడలిపోయే పరిస్థితి తలెత్తింది. ‘ఏమనుకుంటున్నావ్ నువ్వు... బయటకు రా నీ కథ తేలుస్తాను... తమాషా చేస్తున్నావా?...’ ఇదీ గతేడాది చివరిరోజున జరిగిన జెడ్పీ సమావేశంలో అధికారపార్టీకి చెందిన గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, జెడ్పీటీసీలు పలువురు పార్వతీపురం పంచాయతీరాజ్ ఈఈ వి.ఎస్.ఎన్.మూర్తిపై దూషణలు, బెదిరింపులు. ఈ ఘటన మరవకుండానే జన్మభూమి గ్రామసభ సాక్షిగా అనేక మంది చూస్తుండగానే గజపతినగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, సర్పంచ్, వారి కుటుంబసభ్యులు వెలుగు ఏపీఎంపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు పరుగులు పెట్టించి కొట్టారు. ఈ ఘటనతో ఉద్యోగుల్లో అత్మస్థైర్యం సన్నగిల్లింది. ఆందోళన పెరిగింది. ఈ సంఘటనలతో ఉద్యోగులంటే తెలుగుదేశం నాయకులకు చులకనగా మారిందని, అధికారం ఉందని విర్రవీగి ఏదైనా చేస్తారన్న భయం పలువురు ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ఇలాగైతే ఉద్యోగాలు చేయడం కష్టమని వాపోతున్నారు. తెలుగుదేశం నాయకులు ఇలా వ్యవహరించడానికి కారణం వారి అడుగులకు మడుగులొత్తడమేనన్న భావన వ్యక్తం అవుతోంది. కొంత మంది అధికారులు తెలుగుదేశం నాయకులకు జీ హుజూర్ అనడంతో వారు ఇష్టానుసారం చేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. పైగా రాజకీయ సిఫార్సులకు తలొగ్గి ఉద్యోగులను ఎప్పటికప్పుడు బదిలీలు చేస్తుండడంతో ఉద్యోగులను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుని వారి మనుగడను దెబ్బతీస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉంటే ఉద్యోగులంటే చులకనగా మారడానికి మరో కారణం ఉద్యోగుల్లో ఐక్యత లేకపోవడం. పేరుకు ఉద్యోగ సంఘాలున్నా ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే పోరాడే పరిస్థితి ఇప్పుడు జిల్లాలో లేదు. ఒకప్పుడు ఉద్యోగులపై అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉద్యోగసంఘాలన్నీ ఒకటై ఆందోళన నిర్వహించిన సందర్భాలున్నాయి. తద్వారా అధికారంలో ఉన్నా ప్రభుత్వం మెడలు వంచేవారు. ఇప్పుడు ఐక్యత లోపించడంవల్లే ఉద్యోగులంటే గౌరవం, భయం పోతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న జెడ్పీలో అధికారులను ఇష్టానుసారం మాట్లాడిన నేతలపై ఉద్యోగ సంఘాలు సమష్టిగా పోరాడ లేకపోయాయి. వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయలేకపోయినా ముక్తకంఠంతో ఖండించలేకపోయాయి. గజపతినగరంలో ఏపీఎంపై దాడి చేసినా సంఘాలు పెద్దగా స్పందించ లేదు. ఇందుకు కూడా ఉన్నతాధికారుల వైఖరి కారణమవుతోంది. సంఘాలు గట్టిగా మాట్లాడితే ఎక్కడ తమకు అడ్డుతగులుతారని ఉన్నతశ్రేణిలో ఉన్న అధికారులు సంఘాలకు నేతృత్వం వహించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులకు భద్రత కరవవుతోంది. ఈ నేపధ్యంలోనైనా మేల్కోని ఉద్యోగ సంఘాలు ఒక్కటి కావాలని, అధికారులు వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. నాయకుల అడుగులకు మడుగులొత్తినందుకే...సంఘాల్లో పటుత్వం తగ్గిందా? -
ఎమ్మెల్యే నాపై కక్ష కట్టారు...
జామి: గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై కక్ష కట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ విజినిగిరి సర్పంచ్ కొమ్మినేని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వేధింపులపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు చెందిన విజయనగరంలోని అశోక్ బంగ్లాలో మూడు పేజీల లేఖను అందజేశారు. ఎమ్మెల్యే నాయుడు, మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న గొర్రెపాటి శ్రీనువాసరావు కలసి తనను వేధిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేయడమే తప్పా అని ప్రశ్నించారు. పార్టీకి ఎన్నో సేవలందించిన తనపై ఎమ్మెల్యే కక్ష కట్టారని ఆరోపించారు. పార్టీలో వర్గాలు ఏర్పాటు చేసి నష్టం కలుగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా రూ.70లక్షల పనులను వేరే వారికి అప్పగించారని ఆరోపించారు. తన చెక్‌పవర్‌ను రద్దు చేయించి, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆవేదన చెందారు. -
సోషల్ మీడియాలో పోస్టులు.. తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే!
సాక్షి, విజయనగరం: హామీల అమలు విషయంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులను ప్రభుత్వ పెద్ద చంద్రబాబే కాదు.. టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా సహించలేకపోతున్నారు. మాపైనే రాతలా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నెటిజన్లపై తన అక్కసును వెల్లగక్కారు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి. వాటిని ఎమ్మెల్యే తట్టుకోలేకపోయారు. వెంటనే తన అనుచరులతో వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పటికే 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమానికి వెళ్తున్న తెలుగు తమ్ముళ్లను ప్రజలు నిలదీస్తుండగా సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతుండడంతో అధికార పార్టీ నేతలు మరింత అసహనానికి గురవుతున్నారు. -
సోషల్ మీడియాలో పోస్టులతో తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే!
-
రంగంలోకి లోకాయుక్త
విజయనగరం కంటోన్మెంట్: విజయనగరం జిల్లాలో అధికారం అండతో ఇష్టానుసారం వ్యవహరించి...అర్హులకు దగ్గాల్సిన పోస్టుల్ని అమ్ముకున్న వైనంపై లోకాయుక్త దృష్టిసారించింది. ఈ మేరకు గజపతినగరం ఎమ్మెల్యే లేఖలపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు వచ్చేనెల 28న లోకాయుక్త కు హాజరు కావాలని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్, ఎమ్మెల్యే రాసిన లేఖల ప్రకారం పోస్టుల పందేరం చేసిన కాంట్రాక్టర్ స్వామినాయుడుకు నోటీసులు జారీ చేసింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో ఎమ్మెల్యే జోక్యం ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో షిఫ్ట్‌ఆపరేటర్ల పోస్టుల్లో డబ్బులిచ్చినవారినే గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నియమించుకునేలా సిఫార్సుల లేఖలిచ్చారని గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ పరిశీలకుడు సామంతుల పైడిరాజు మార్చి 23న లోకాయుక్తను ఆశ్రయించారు. కాంట్రాక్టర్ స్వామినాయుడు, ఎస్ఈ తదితరులందరికీ సిఫార్సు లేఖలిచ్చారని రంగంలోకి లోకాయుక్త ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ స్వామినాయుడు నిబంధనలనకు విరుద్ధంగా వ్యవహరించారనీ, ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పారు. పత్రికా ప్రకటనలు గానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కానీ పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యే లేఖలనే ఆధారంగా చేసుకుని అర్హులకు అన్యాయం చేశారని ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త దీనిని విచారణకు తీసుకుంది. సాక్షి కథనాల ఆధారంగా ఫిర్యాదు ఎమ్మెల్యే కేఏ నాయుడు తన సిఫార్సు లేఖలతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని తన అధికారంతో ఏ పోస్టుల్నీ వదలడం లేదనీ సాక్షి దినపత్రికలో ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. జనవరి 29న ‘పైరవీలే పరమావధి’ అంటూ ఎమ్మెల్యే రాసిచ్చిన పైరవీ లేఖలతో ప్రచురణ అయింది. అనంతరం ‘ఎమ్మెల్యే అభ్యర్ధా? అయితే ఓకే! ’ అంటూ మరో శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రధాన సంచికలో కూడా కథనం ప్రచురితమైంది. ఈ కథనాలపై వివిధ పార్టీలు, వైఎస్సార్ సీపీ కూడా ధర్నాలు చేపట్టాయి. ఈ కథనాలను ఆధారంగా చేసుకుని సామంతుల పైడిరాజు లోకాయుక్తకు ఫైల్ చేశారు. విచారణకు స్వీకరించిన లోకాయుక్త విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే ప్రారంభమైంది. ఎమ్మెల్యే కె.ఎ.నాయుడి చర్యల వల్ల నిరుద్యోగులు బలైపోయారు. తాను సూచించిన వారికే ఉద్యోగాలివ్వాలని పైరవీల లేఖలు రాశారు. స్థానికులకు కాకుండా ఇతర నియోజకవర్గాలు, మండలాలకు చెందిన అనర్హులకు పోస్టులను కేటాయించారు. దీనిపై లోకాయుక్తను ఆశ్రయించాను. ఎమ్మెల్యే అక్రమాలపై మేం చేసే అసలు పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లోకాయుక్త న్యాయ స్థానంలో అర్హులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. - సామంతుల పైడిరాజు, లోగిశ, గజపతినగరం