
అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే విజయం: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) గెలుపు ఆరంభం మాత్రమేనని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ విజయయాత్ర రాష్ట్రంలో మరికొద్ది నెల ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసా గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 సీట్లకు గాను ఎంవీఏ పార్టీలు 30 సీట్లను గెల్చుకో వడం తెల్సిందే.
ఉద్ధవ్ శనివారం ఎన్‌సీపీ (ఎస్‌పీ)చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అజేయమనే అపోహ ఎంత బూటకమైనదో లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు రుజువు చేశారని ఉద్ధవ్ అన్నారు. ఎన్డీఏ సర్కారుగా మారిన మోదీ సర్కారు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment