భారత్ అభ్యర్థనకు పాకిస్తాన్ నో
ఇస్లామాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను తమ అధికారులు కలిసేందుకు అనుమతించాలన్న భారత విజ్ఞప్తిని పాకిస్తాన్ తిరస్కరించింది. పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్రవాదులకు భారత్ ఆర్థికసాయం చేస్తోందని, తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తోందని జకారియా ఆరోపించారు. దీని కోసమే కుల్‌భూషణ్ జాధవ్.. బలూచిస్తాన్ వచ్చారని పేర్కొన్నారు. ఆయనతో భారత్ అధికారులను కలవనిచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌తో పాటు ముంబైకి చెందిన హమీద్ నెహాల్‌ను తమ అధికారులు కలిసేందుకు అనుమతించాలని భారత విదేశాంగ శాఖ పాక్‌ను శనివారం మరోసారి కోరింది. 2012లో తన ఆన్‌లైన్ స్నేహితురాలిని కలుసుకోవడానికి అఫ్గాన్ నుంచి పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హమీద్ ఆ తర్వాత జాడలేకుండా పోయారు.