consular access
-
కులభూషణ్ జాదవ్.. భారత్‌కు పాక్ కోర్టు గడువు
Kulbhushan Jadhav Case: పాక్‌లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, సదరున్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్ హైకోర్టు, భారత్‌కు స్పష్టం చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో కులభూషణ్ జాదవ్ తన మరణశిక్షకు వ్యతిరేకంగా అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసిన అవకాశం దొరికిన విషయం తెలిసిందే. తదనంతరం జాదవ్ తరపున వాదనలు వినిపించాల్సిన న్యాయవాది విషయంపై ప్రతిష్టంభన ఏర్పడింది. జాదవ్ తరపున వాదనలు వినిపించే న్యాయవాది అంశంపై పాక్ డ్రామాలు మొదలుపెట్టింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఇస్లామాబాద్ హైకోర్టు ధర్మాసనం 2020 ఆగష్టులో.. పాక్ నుంచే న్యాయవాది నామినేట్ చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే భారత్ మాత్రం ఆ తీర్పును వ్యతిరేకించింది. మొదటి నుంచి జాదవ్ విషయంలో పాక్ మిలిటరీ ఆడుతున్న డ్రామాలు అందరికీ తెలుసని, అందుకే తమ దేశం తరపున న్యాయవాదినే నియమిస్తామని పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు గడువు విధించడం విశేషం. భారత్ కావాలనే జాప్యం చేస్తోంది: పాక్ ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ ఖలీద్ జావెద్ మాట్లాడుతూ.. భారత్ ఈ వ్యవహారంలో కావాలనే జాప్యం చేస్తోంది. తద్వారా మరోసారి పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. నవంబర్ 2021లో పాక్ పార్లమెంట్ జాదవ్‌కు రివ్యూ పిటిషన్‌కు హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. అయితే 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం తర్వాత జరిగిన పరిణామాలతో మరణ శిక్ష తీర్పును సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. -
జాధవ్‌ను కలిసిన భారత రాయబారి
న్యూఢిల్లీ: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను భారత సీనియర్ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాన్సులర్ అనుమతి లభించడంతో ఓ భారత దౌత్యాధికారి సోమవారం జాధవ్‌ను కలిశారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. అయితే, జాధవ్‌ను కలిసిన దౌత్యాధికారి ఎవరు? వారు ఎక్కడ సమావేశమయ్యారనే వివరాలు వెల్లడించలేదు. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు పాక్ విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. -
జాధవ్‌ను కలిసేందుకు పాక్ అనుమతి
ఇస్లామాబాద్: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను దౌత్యాధికారులు కలుసుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ‘కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయమై చర్చలు జరిగిన ఆరు నెలల తర్వాత పాక్ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం భారత దౌత్యాధికారులు జాదవ్‌ను కలుసుకోనున్నారు. -
జాధవ్‌ను కలుసుకోవచ్చు!
న్యూఢిల్లీ: పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు ఎట్టకేలకు న్యాయసహాయం పొందే అవకాశం దక్కింది. భారత దౌత్యాధికారులు జాధవ్‌ను శుక్రవారం కలుసుకోవచ్చని భారత విదేశాంగశాఖకు పాక్ గురువారం సమాచారమిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం భారత్ దౌత్యాధికారులు జాధవ్‌ను కలుసుకోవచ్చునని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ చెప్పారు. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు వేసిన మరణశిక్షను పునః పరిశీలించాలని ఇటీవల అంతర్జాతీయ కోర్టు చెప్పింది. న్యాయ సహాయం అంటే.. 1963 వియన్నా ఒప్పందం ప్రకారం రెండు స్వతంత్ర దేశాల మధ్య న్యాయ సహాయ సంబంధాలు ముఖ్యం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఏదైనా దేశం విదేశీ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటే వారి హక్కుల్ని కాపాడడానికి ఆలస్యం చేయకుండా అరెస్ట్‌కు సంబంధించిన విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలి. అరెస్ట్‌కి కారణాలు వివరించాలి. తనకు లాయర్ కావాలని నిర్బంధంలోని వ్యక్తి కోరితే ఆ ఏర్పాటు చేయాల్సిందే. భారత్‌కు ఎలా ప్రయోజనం ? ఇన్నాళ్లూ ఏకపక్షంగా విచారణ జరిపి జాధవ్ గూఢచారి అని పాక్ ముద్రవేసింది. లాయర్ని నియమిస్తే జాధవ్ వైపు వాదన ప్రపంచానికి తెలుస్తుంది. అతని అరెస్ట్ వెనుక నిజానిజాలు వెలుగు చూస్తాయి. పాకిస్తాన్ కుటిలబుద్ధిని బయటపెట్టే అవకాశం భారత్‌కు లభిస్తుంది. -
కులభూషణ్ జాధవ్ కేసు: పాక్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తమ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు రాయబార అనుమతిని ఇస్తామంటూ దాయాది పాకిస్థాన్ గురువారం వెల్లడించింది. ఆగస్టు 2న కులభూషణ్‌ను కలిసేందుకు భారత్ అధికారులకు కాన్సులర్ యాక్సెస్ ఇస్తామని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై భారత్ జవాబు ఇవ్వాల్సి ఉంది. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు భారత్‌కు కాన్సులర్ అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు కాన్సులర్ అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. -
భారత్ అభ్యర్థనకు పాకిస్తాన్ నో
ఇస్లామాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను తమ అధికారులు కలిసేందుకు అనుమతించాలన్న భారత విజ్ఞప్తిని పాకిస్తాన్ తిరస్కరించింది. పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్రవాదులకు భారత్ ఆర్థికసాయం చేస్తోందని, తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తోందని జకారియా ఆరోపించారు. దీని కోసమే కుల్‌భూషణ్ జాధవ్.. బలూచిస్తాన్ వచ్చారని పేర్కొన్నారు. ఆయనతో భారత్ అధికారులను కలవనిచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌తో పాటు ముంబైకి చెందిన హమీద్ నెహాల్‌ను తమ అధికారులు కలిసేందుకు అనుమతించాలని భారత విదేశాంగ శాఖ పాక్‌ను శనివారం మరోసారి కోరింది. 2012లో తన ఆన్లైన్ స్నేహితురాలిని కలుసుకోవడానికి అఫ్గాన్ నుంచి పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హమీద్ ఆ తర్వాత జాడలేకుండా పోయారు.