Kulbhushan Jadhav Case: పాక్‌లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, సదరున్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్ హైకోర్టు, భారత్‌కు స్పష్టం చేసింది.
అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో కులభూషణ్ జాదవ్ తన మరణశిక్షకు వ్యతిరేకంగా అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసిన అవకాశం దొరికిన విషయం తెలిసిందే. తదనంతరం జాదవ్ తరపున వాదనలు వినిపించాల్సిన న్యాయవాది విషయంపై ప్రతిష్టంభన ఏర్పడింది. జాదవ్ తరపున వాదనలు వినిపించే న్యాయవాది అంశంపై పాక్ డ్రామాలు మొదలుపెట్టింది.
ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఇస్లామాబాద్ హైకోర్టు ధర్మాసనం 2020 ఆగష్టులో.. పాక్ నుంచే న్యాయవాది నామినేట్ చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే భారత్ మాత్రం ఆ తీర్పును వ్యతిరేకించింది. మొదటి నుంచి జాదవ్ విషయంలో పాక్ మిలిటరీ ఆడుతున్న డ్రామాలు అందరికీ తెలుసని, అందుకే తమ దేశం తరపున న్యాయవాదినే నియమిస్తామని పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు గడువు విధించడం విశేషం.
భారత్ కావాలనే జాప్యం చేస్తోంది: పాక్
ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ ఖలీద్ జావెద్ మాట్లాడుతూ.. భారత్ ఈ వ్యవహారంలో కావాలనే జాప్యం చేస్తోంది. తద్వారా మరోసారి పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. నవంబర్ 2021లో పాక్ పార్లమెంట్ జాదవ్‌కు రివ్యూ పిటిషన్‌కు హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. అయితే 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం తర్వాత జరిగిన పరిణామాలతో మరణ శిక్ష తీర్పును సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment