Islamabad High Court
-
POK విదేశీ భూ భాగమని అంగీకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం
-
తోషఖానా కేసులో దిగువ కోర్టు తీర్పు తప్పు
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు అందిన ఖరీదైన బహుమతుల విక్రయంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) వేసిన కేసుపై విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించింది. దీంతో, మరో అయిదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అర్హత కోల్పోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమెర్ ఫరూఖ్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, విచారణకు ఈసీపీ తరఫు లాయర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. విచారణను వాయిదా వేయాలని ఆయన సహాయక లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం వినతిని తోసిపుచ్చింది. ‘ట్రయల్ కోర్టు తప్పు చేసింది. ఆ తప్పుల్ని మేం చేయదలుచుకోలేదు. పిటిషన్‌పై విచారణ కీలక దశలో ఉంది. అందుకే విచారణను సోమవారానికి మాత్రమే వాయిదాగలం. సోమవారం ఎవరూ రాకున్నా మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని స్పష్టం చేసింది. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్‌కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు బుధవారం వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నందున వేచి చూస్తామని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఇరవై రోజులుగా అటోక్ జైలులో ఉన్నారు. -
ఇమ్రాన్ అరెస్ట్.. పాకిస్తాన్‌కు ఊహించని షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఇమ్రాన్ కోర్టుకు హాజరుకాగా.. అల్ఖదీర్ ట్రస్ట్ భూకబ్జా కేసులో రెండు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట ఇచ్చింది. అంతేకాదు.. మే 9వ తేదీ తర్వాత ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎన్ఏబీ కస్టడీ నుంచి రిలీజ్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. కాగా, ఇమ్రాన్ అరెస్ట్ కారణంగా పాక్‌లో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. ఇమ్రాన్ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. వాహనాలను తగులబెట్టారు. తీవ్ర ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో ఘర్షణలను నియంత్రించేందుకు ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ 3.3శాతం కుంగి 300 వద్ద హిస్టరీలోనే రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం నాటి ట్రెడింగ్లో 285కు చేరుకుంది. డాలర్ బాండ్ల విలువ అమాంతం పెరిగి 33.44 శాతానికి చేరింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. కాగా, ఇటీవలి కాలంలో వరదలు, ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన విషయం తెలిసిందే. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ కాలంలో కూడా ప్రజలు తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విదేశీ మారకపు నిల్వలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అటు ఐఎంఎఫ్ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు పాక్ చర్చలు జరుపుతున్నా వెంటనే నిధులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో, పాక్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ అరెస్ట్ పాక్‌కు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇది కూడా చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్.. మళ్లీ అరెస్ట్‌కు ఛాన్స్? -
ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్.. మళ్లీ అరెస్ట్‌కు ఛాన్స్?
ఇస్లామాబాద్: అవినీతి ఆరోపణల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట దక్కింది. శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అల్‌ఖాదీర్ ట్రస్ట్ కేసులో ఇదే కోర్టు బయట నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని పారామిలిటరీ బలగాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్‌ఖాదీర్ ట్రస్ట్ భూకబ్జా కేసులో విచారణకు ఇమ్రాన్ ఖాన్ హాజరవుతూ వస్తుండగా, పారామిలిటరీ రేంజర్ల సాయంతో దర్యాప్తు సంస్థ ఎన్ఏబీ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఆపై కోర్టు ఆదేశాలతో విచారణ కోసం కస్టడీలోకి కూడా తీసుకుంది. ఈ తరుణంలో గురువారం సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఇమ్రాన్‌ఖాన్‌ను గంటలోగా తమ ఎదుట హాజరు పర్చాలని ఆదేశించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ సమయంలో ఎన్ఏబీ( నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయన అరెస్ట్ చట్టవిరుద్ధంగా ఉందని, చెల్లుబాటు కాదని పేర్కొంది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు ఇవాళ(శుక్రవారం) ఇస్లామాబాద్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది కూడా. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరుకాగా.. అల్ఖదీర్ ట్రస్ట్ భూకబ్జా కేసులో రెండు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట ఇచ్చింది. అంతేకాదు.. మే 9వ తేదీ తర్వాత ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎన్ఏబీ కస్టడీ నుంచి రిలీజ్ అయ్యారు. అయితే.. లాహోర్ పోలీసుల బృందం ఒకటి ఇస్లామాబాద్‌కు బయల్దేరడంతో ఇమ్రాన్ ఖాన్ మరోసారి అరెస్ట్ అవుతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఆయనపై దాఖలైన కేసులకు గానూ ఇవాళ(శుక్రవారం) మరోసారి ఖాన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక డాన్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మొత్తం 121 కేసులు నమోదు అయ్యాయి. అవినీతితో పాటు ఉగ్రవాదం, హింసను ప్రేరేపించడం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం లాంటి తీవ్ర నేరాలు సైతం ఉన్నాయి. عمران خان اسلام آباد ہائیکورٹ میں۔۔#میں_بھی_عمران_خان_ہوں pic.twitter.com/5xxClCUOXu — PTI (@PTIofficial) May 12, 2023 ఇదీ చదవండి: పాక్ చరిత్రలోనే అదొక చీకటి అధ్యాయం -
కులభూషణ్ జాదవ్.. భారత్‌కు పాక్ కోర్టు గడువు
Kulbhushan Jadhav Case: పాక్‌లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, సదరున్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్ హైకోర్టు, భారత్‌కు స్పష్టం చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో కులభూషణ్ జాదవ్ తన మరణశిక్షకు వ్యతిరేకంగా అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసిన అవకాశం దొరికిన విషయం తెలిసిందే. తదనంతరం జాదవ్ తరపున వాదనలు వినిపించాల్సిన న్యాయవాది విషయంపై ప్రతిష్టంభన ఏర్పడింది. జాదవ్ తరపున వాదనలు వినిపించే న్యాయవాది అంశంపై పాక్ డ్రామాలు మొదలుపెట్టింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఇస్లామాబాద్ హైకోర్టు ధర్మాసనం 2020 ఆగష్టులో.. పాక్ నుంచే న్యాయవాది నామినేట్ చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే భారత్ మాత్రం ఆ తీర్పును వ్యతిరేకించింది. మొదటి నుంచి జాదవ్ విషయంలో పాక్ మిలిటరీ ఆడుతున్న డ్రామాలు అందరికీ తెలుసని, అందుకే తమ దేశం తరపున న్యాయవాదినే నియమిస్తామని పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు గడువు విధించడం విశేషం. భారత్ కావాలనే జాప్యం చేస్తోంది: పాక్ ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ ఖలీద్ జావెద్ మాట్లాడుతూ.. భారత్ ఈ వ్యవహారంలో కావాలనే జాప్యం చేస్తోంది. తద్వారా మరోసారి పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. నవంబర్ 2021లో పాక్ పార్లమెంట్ జాదవ్‌కు రివ్యూ పిటిషన్‌కు హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. అయితే 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం తర్వాత జరిగిన పరిణామాలతో మరణ శిక్ష తీర్పును సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. -
నవాజ్ షరీఫ్‌కు అరెస్టు వారంట్
ఇస్లామాబాద్: లండన్‌లో వైద్యకోసం ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ప్రభుత్వం అరెస్టు వారంట్లు జారీ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పాక్ ప్రభుత్వం.. లండన్‌లోని పాక్ హైకమిషనర్‌కు వీటిని పంపింది. హైకమిషనర్ వీటిని ఈనెల 22వ తేదీలోగా నవాజ్‌కు అందజేయాల్సి ఉంటుంది. అల్ అజీజియా మిల్స్ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆయనకు 8 వారాలపాటు లండన్ వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. అయితే, ఆయన గడువు పొడిగించాలంటూ పెట్టుకున్న అర్జీని ఇటీవల కోర్టు తోసిపుచ్చింది. ఆయన్ను ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరు పరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: నవాజ్ షరీఫ్ ఫొటోలు లీక్!) -
ఎన్నికలు ముగిసేదాకా జైల్లోనే షరీఫ్
ఇస్లామాబాద్: అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్, అల్లుడు మహ్మద్ సఫ్దర్‌లకు ఇస్లామాబాద్ హైకోర్టు షాకిచ్చింది. బెయిల్ మంజూరు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జూలై చివరి వారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే తమకు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది. అప్పీలు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టలేమని తెలిపింది. అనంతరం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాల్సిందిగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదలై రానున్న ఎన్నికల(25వ తేదీ)కు తమ పార్టీ (పీఎంఎల్–ఎన్) తరఫున ప్రచారం చేయాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు, ఆయన కుమార్తె మరియమ్‌కు 7 ఏళ్ల జైలు, అల్లుడు సఫ్దర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. -
పాక్ విదేశాంగ మంత్రిపై వేటు
-
పాక్ రాజకీయాల్లో మరో సంచలనం!
ఇస్లామాబాద్: అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వర్క్ పర్మిట్ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన ఖవాజా విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడం పాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల వల్ల పాక్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) పార్టీ షాహిద్ ఖకాన్ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్‌కు మరో షాక్ నిచ్చాయని పాక్ మీడియా పేర్కొంటున్నది. -
అడుగుపెట్టగానే మాతృభూమిని ప్రేమగా తాకి..
-
అడుగుపెట్టగానే మాతృభూమిని ప్రేమగా తాకి..
న్యూఢిల్లీ: ఆమెకు నిజంగా ప్రాణం లేచివచ్చినట్లయింది. భయం ఎగిరిపోయి కొత్త ఆశలు ఒడిలో చేరినట్లయింది. తన దయనీయ పరిస్థితి నుంచి బయటపడతానా.. తిరిగి ఎప్పటి జీవితంలో అడుగుపెడతానా.. తన దేశ స్వేచ్ఛా వాయువులను పీల్చే అవకాశం వస్తుందా.. ఆ అవకాశం వచ్చేలోగా ఎలాంటి ఉపద్రవం తనను ముంచివేస్తుందో అనే ఆందోళనలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. దాయాది దేశం దాటి భారత గడ్డపై అడుగుపెట్టిన మరుక్షణమే ఆమె అడుగు ఓ క్షణం ఆగిపోయింది. అమాంతం తన తల్లి పాదాలను మొక్కినట్లుగా భారతదేశ మట్టిని మనస్ఫూర్తిగా తాకి నమస్కారం చేసింది. పాక్ వాఘా సరిహద్దు గుండా తన మాతృదేశం(భారత్)లోకి సగర్వంగా అడుగుపెట్టింది. పాక్‌లో మోసపోయిన భారత యువతి ఉజ్మా గురువారం తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ అధికారులు ఒకపక్క, భారత హైకమిషన్‌కు చెందిన అధికారులు మరోపక్క, ఆమెకు తోడుగా రాగా వాఘా సరిహద్దు దాటి దేశంలోకి వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఆమె ముందుగా భారత్ మట్టికి వందనం సమర్పించుకుంది. అనంతరం బయలుదేరిన ఆమె తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించింది. ఒక రోజు తర్వాత ఆమెను ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి పంపించనున్నారు. ఈ నెల(మే) ప్రారంభంలో ఇస్లామాబాద్ వెళ్లిన ఉజ్మాను తాహిర్ అలీ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె ట్రావెలింగ్ పేపర్లు తీసుకెళ్లి అక్కడే ఉండిపోయేలా ప్లాన్ చేశాడు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. వీరిద్దరికి అంతకుముందే మలేషియాలో పరిచయం ఉందంట. ఆ మేరకే పాక్ వెళ్లిన ఆమెను తాహిర్ బలవంతంగా వివాహం చేసుకొని వారంలోనే నరకంగా చూపించడంతో ఆమె నేరుగా భారత్ హైకమిషన్‌కు వెళ్లి సాయం కోరడం, అనంతరం ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఉజ్మా భారత్ వెళ్లేందుకు అనుమతించడంలాంటివి చకచకా జరిగిపోవడంతో ఆమె తిరిగి ఊపిరి పీల్చుకుంది. దాదాపు తనకు నరకంలోకి పోయి వచ్చినట్లయిందని ఆమె తన అనుభవాన్ని చెప్పింది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆమె స్వాగతం అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
భారత్ బిడ్డకు స్వాగతం: సుష్మా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వ్యక్తి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకున్నభారత మహిళ ఎట్టకేలకు భారత్‌కు తిరిగి వచ్చింది. ఈమె రాకపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో స్పందించింది. ‘భారత బిడ్డకు స్వాగతం.. మీరు ఎదుర్కొన్న పరిస్థితిలన్నింటికి నేను క్షమాపణ చెబుతున్నా’ అని ట్వీట్ చేసింది. ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు భారత్ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని పోలీసుశాఖను ఆదేశించింది. దీంతో నేడు( గురువారం) ఆమె క్షేమంగా భారత్ కు చేరింది. -
పాక్ లో భారత మహిళకు విముక్తి
-
పాక్ లో భారత మహిళకు విముక్తి
న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత మహిళకు పాకిస్థాన్‌లో విముక్తి లభించింది. బలవంతంగా తనను పెళ్లి చేసుకున్న ఓ పాకిస్థాన్ వ్యక్తి నుంచి విడిపోయి తిరిగి భారత్ వచ్చేందుకు పాక్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పాక్‌కు చెందిన ఓ టీవీ చానెల్ తెలిపింది. ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. తనకు ప్రాణహానీ కూడా ఉందంటూ అందులో పేర్కొంది. ఆమె పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు బెంచ్ జస్టిస్ మోసిన్ అక్తర్ ఖయానీ ఆమెకు భారత్ వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే, ఉజ్మాను కలిసేందుకు అనుమతివ్వాలంటూ తాహిర్ కోరగా తన గదిలో మాత్రమే కలవాలని న్యాయమూర్తి చెప్పారు. అయితే, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించింది. దీంతో ఉజ్మా భారత్ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని న్యాయమూర్తి పోలీసుశాఖను ఆదేశించారు. ఈ నెల 30కే ఆమె వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. -
పాక్ కోర్టులో భారత్ విజయం
అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న పాకిస్తానీ వ్యక్తి ఒకరు తనను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ దేశానికి తీసుకొచ్చారని, తనను తన మాతృదేశమైన భారత్‌కు పంపేయాలంటూ ఉజ్మా అనే భారతీయ మహిళ పెట్టుకున్న దరఖాస్తును ఇస్లామాబాద్ హైకోర్టు ఆమోదించింది. భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు ఉజ్మాకు అనుమతి ఇచ్చింది. ఆమె భర్త తాహిర్ అలీ నుంచి స్వాధీనం చేసుకున్న ఉజ్మా ఒరిజినల్ ఇమ్మిగ్రేషన్ ఫాంను జస్టిస్ మొహసిన్ అఖ్తర్ కయానీ నేతృత్వంలోని హైకోర్టు బెంచి.. ఆమెకు తిరిగి ఇచ్చింది. దాంతో ఉజ్మా స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వాఘా సరిహద్దు దాటేవరకు ఆమెకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. ఉజ్మాను విడిగా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని తాహిర్ కోరగా, తన చాంబర్లో కలవొచ్చని జస్టిస్ కయానీ చెప్పారు. కానీ, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించారు. ఈ నెలాఖరుతో ఉస్మా వీసా గడువు ముగిసిపోతుంది కాబట్టి, ఈలోపే తనను భారత్ పంపేలా చూడాలన్నారు. తాహిర్‌తో తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తనపై ఒత్తిడి చేసి నిఖానామా మీద సంతకం చేయించారని అంతకుముందు ఉజ్మా కోర్టుకు తెలిపారు. తుపాకి చూపి బెదిరించి తన పెళ్లి చేశారని చెప్పారు. దాంతో తనకు ఈ పెళ్లి నుంచి విముక్తి కల్పించి భారత్ పంపాలని కోరగా, ఇప్పుడు కోర్టు అందుకు అంగీకరించింది. -
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!
-
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా పెళ్లి కోసం పాక్‌కు వెళ్లి మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును కోరారు. ఢిల్లీచెందిన ఉజ్మా పాకిస్తాన్‌కు చెందిన తాహిర్ అలీని మలేసియాలో కలుసుకుని, పెళ్లి చేసుకునేందుకు పాక్‌కు ఈ నెల 1న పాక్‌కు వెళ్లడం తెలిసిందే. అప్పటికే అలీకి పెళ్లయ్యి నలుగురు పిల్లలు కూడా ఉన్నారనీ, ఈ విషయం ముందుగా తనకు చెప్పకుండా పాక్‌కు వచ్చాక మోసగించి, బెదిరించి అలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. తన పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలను కూడా అలీ దొంగిలించాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉజ్మా పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్నారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించడంతోపాటు డూప్లికేట్ ప్రయాణ ప్రతాలను అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాలని ఆమె ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫొటోలు తీసినందుకు క్షమాపణ చెప్పిన భారత అధికారి ఊజ్మ కేసు విచారణ సాగుతుండగా పాక్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పియూష్ సింగ్ అనే సీనియర్ అధికారి కోర్టు లోపల ఫొటోలు తీశారు. ఇది కోర్టు నియమాలకు విరుద్ధం. ఈ విషయం న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో పియూష్ సింగ్ లిఖిత పూర్వకంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. -
ఫేస్‌బుక్‌పై నిషేధం?
దైవదూషణకు పాల్పడే కామెంట్లకు అవకాశం ఇస్తున్న ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాపై నిషేధం విధించాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ విషయమై మార్చి 27వ తేదీన జరిగే తదుపరి విచారణ నాటికి ఒక నిర్ణయం తీసుకుంటామని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షౌకత్ అజీజ్ సిద్దిఖీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా దైవదూషణకు సంబంధించిన విషయాలను వ్యాపింపజేస్తున్నారని, అందువల్ల వాటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ విషయం తెలిపింది. అసలు సోషల్ మీడియాలో నిజంగానే అలాంటి కంటెంట్ వస్తోందా లేదా అన్న విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ)ను కోర్టు ఆదేశించింది. తాము ఇప్పటికే విచారణ పూర్తిచేశామని, రెండు రోజుల క్రితమే ఒక కేసు కూడా నమోదు చేశామని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ కోర్టుకు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా దైవదూషణకు సంబంధించిన అంశాలను వ్యాపింపజేస్తున్నందుకు ఇంతకుముందు ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నామని, అవి ఫోరెన్సిక్ అధికారుల వద్ద ఉన్నాయని అన్నారు. ముగ్గురు నిందితులపై పటిష్ఠమైన నిఘా ఉంచామని, మరికొందరు నిందితుల పేర్లను కూడా ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చామని ఎఫ్ఐఏ డీజీ చెప్పారు. దైవదూషణకు సంబంధించిన, అభ్యంతరకరమైన కంటెంట్ విషయంలో తమ అభిప్రాయాలను ఫేస్బుక్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. దీనిపై ఒక బృందాన్ని పంపేందుకు కూడా ఫేస్బుక్ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ఫేస్బుక్ యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలని, అంతవరకు మాత్రం పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తేనే మంచిదని జస్టిస్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. -
వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం
పాకిస్తాన్ : వాలెంటైన్ డే వేడుకలకు ఇప్పటికే యువత భారీ ఎత్తున్న ప్లాన్స్ వేసేసుకుని ఉంటారు. ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనుకుంటున్న వారికి ఇస్లామాబాద్ హైకోర్టు షాకిచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో వాలెంటైన్స్ డే వేడుకలను నిషేధం విధిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇది ముస్లిం సంప్రదాయం కాదంటూ విచారణ సమయంలో పిటిషన్‌దారుడు వాదించడంతో పాటు వెంటనే వీటిపై నిషేధం విధించాలని కోరారు. వారి వాదనలు విన్న కోర్టు వాలెంటైన్స్ డేకు సంబంధించిన వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. కార్యలయాలోనూ వీటిపై నిషేధ ఆంజ్ఞలు విధించింది. లవ్‌ను ప్రమోట్ చేసే విధంగా ఈ వేడుకలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు కూడా కవరేజ్ చేయకూడదని గట్టి ఆదేశాలు జారీచేసింది. దీనిపై పదిరోజులోగా తమకు సమాధానం ఇవ్వాలని సమాచార మంత్రిత్వ శాఖ, ఫెడరల్ ప్రభుత్వం, ఫెమ్రా చైర్మన్, చీఫ్ కమిషనర్లను కోర్టు ఆదేశించింది. గతేడాదే అధ్యక్షుడు మామ్నూన్ హుస్సేన్ దేశంలో వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దంటూ గట్టిగా వారించారు. వాలంటైన్స్ డే పాకిస్థాన్ సంస్కృతి కాదని, దేశంలో ఎవరూ దానిని జరుపుకోవద్దని, నిషేధించాలని యువతకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు జరుపుకొంటారని, ముస్లిం మతస్థులు ఉన్న దేశంలో దానికి చోటులేదన్నారు. తమ సంప్రదాయాలను, జాతి గుర్తింపును తప్పనిసరిగా పాటించాలన్నారు. -
పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్‌మార్షల్ హోదా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మరికొన్ని వారాల్లో రిటైర్ కానుండగా ఆయనకు సైన్యంలో అత్యున్నత స్థాయి అయిన ఫీల్డ్‌మార్షల్ హోదా కట్టబెట్టాలనే ప్రతిపాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు చేరింది. దేశం కోసం అత్యున్నత సేవలందించి, అనేక త్యాగాలు చేసిన రహీల్ షరీఫ్‌కు ఈ అత్యున్నత హోదా ఇవ్వాలని న్యాయవాది సర్దార్ అద్నన్ సలీమ్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరమని, దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమగ్రంగా నిర్వర్తించేందుకు ఆర్మీచీఫ్‌కు పదోన్నతి కల్పించడమే సరైన పరిష్కారమని కోర్టుకు తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా షరీఫ్ ఈ ఏడాది నవంబర్ చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీకి 15వ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2013 నవంబర్ 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను మూడేళ్ల కాలానికి ఆర్మీచీఫ్‌గా నియమించారు. -
మరో 30 రోజుల పాటు లఖ్వీ నిర్బంధం
ఇస్లామాబాద్ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మన్ లఖ్వీ నిర్బంధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పొడిగించింది. రావల్పిండి జైల్లో ఉన్న అతడిని మరో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండనున్నాడు. ఈమేరకు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన చేసింది. కాగా లఖ్వీని వెంటనే విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే. -
'టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరు'
న్యూఢిల్లీ : ముంబైపై దాడి కేసులో ప్రధాన సూత్రధారి లఖ్వీ విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించడం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబై దాడి కేసులో లఖ్వీకు సంబంధించిన సరైన ఆధారాలు పాక్ కోర్టు ముందు పెట్టడంలో నవాజ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. లఖ్వీ విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరనే సంగతి గుర్తుంచుకోవాలని భారత విదేశాంగ శాఖ... పాక్ ప్రభుత్వానికి సూచించింది. 2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖపై విధంగా స్పందించింది. -
లఖ్వీని విడుదల చేయండి
ఇస్లామాబాద్: 2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మీడియా కథనాన్ని వెలువరించింది. తనను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని లఖ్వీ చేసుకున్న అభ్యర్థను ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూరుల్ హక్ పరిగణలోకి తీసుకుని... ఈ తీర్పు వెలువరించారు. అయితే లఖ్వీ గతంలో ఇదేవిధంగా చేసుకున్న అభ్యర్థను హైకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే. 2008 నవంబర్‌లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురిని అడియాల జైలులో నిర్బంధంలో ఉన్నారు. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్‌గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 28/11 దాడిలో 166 మంది మరణించిన సంగతి తెలిసిందే.